పెద్ద రాద్ధాంతం చేస్తున్నావ్?? కామ్ గా ఇంటికి వచ్చేసెయ్!! అంటాడు ఆర్డర్ వేస్తున్నట్టు శ్రీధర్
నిజానికి అతనికి లొంగాలని లేదు.ఈగో అడ్డువస్తుంది క్షమించమని అడగడానికి…
రాద్ధాంతం చేసే అంత సీన్ నాకు లేదు బావ కాబట్టి అడగగానే విడాకులు కావాలి నా భర్త మరో పెళ్లి చేసుకున్న ఎలాంటి అభ్యంతరం లేదు దానికి కారణం…నాకు పిల్లలు పుట్టారు అని పేపర్ల పైన కూడా చేశాను…
రాద్ధాంతం చేయాలని ఉంటే నువ్వు నన్ను ఎలా వదిలేస్తావో??ఇంకోదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో?? చూస్తాను అనేదాన్ని కానీ నాకు అంత ఓపిక లేదు!!
దయచేసి నన్ను విసిగించకండి నా ఒంట్లో బాలేదు ఇక వచ్చిన పని అయింది అనిపిస్తే వెళ్ళండి ఇక్కడ నుంచి అంటుంది డోర్ చూపించి… శ్రీధర్కి.
ఇంకో మాట మాట్లాడడానికి లేదు శ్రీధర్ కి ఎలా గొడవపడతాడు అప్పి తో.. తను అన్న మాటలన్నీ పడింది వెళ్ళిపోగానే వెళ్ళిపోయింది.