New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె మనసులో.. సీత కథ – 1

ఆమె మనసులో.. సీత కథ – 1

ఆ రాత్రి, విజయవాడలోని వారి చిన్న ఇంటి బెడ్‌ రూమ్‌ లో, చంద్రకాంతి వెన్నెల వెండి కిరణాలు జాలువారుతూ కిటికీ గుండా చొచ్చుకుపోతున్నాయి. గదిలోని గాలి మందంగా, మధురమైన గులాబీల సువాసనతో నిండిపోయింది.

 

సీత.. పేరుకు తగ్గట్టు సౌమ్యత, సహనం, ప్రేమ అన్నీ.. ఆ సీతమ్మ తల్లిలోని అన్ని లక్షణాలను పుణికి పుచ్చుకుంది. ఆమెకు 30 ఏళ్ల వయసు, కానీ ఇంకా 18 ఏళ్ల అమ్మాయిలా కాంతివంతంగా, మృదువుగా కనిపిస్తుంది. ఆమె పక్కనే రవి.. తన భర్త. అతని వయసు 35 ఏళ్లు. బలమైన శరీరం, కళ్లలో సౌమ్యత, సహనం, ప్రేమ అన్నిటికంటే ఆమె పట్ల అపారమైన ప్రేమ, ఆప్యాయత.

 

రవి పక్కనే పడుకుని ఉంది సీత. రవి ఆమెను మెల్లగా తన ఒడిలోకి లాక్కున్నాడు. అతని వేళ్లు ఆమె జుట్టులో తడమగా.. ఆమెను తన చేతుల్లోకి తీసుకుని, మెల్లగా ముద్దులు పెడుతున్నాడు. వారిద్దరి మధ్య ఆ ఏకాంతం, ఏదో మాయాజాలంలా అనిపించింది.. ప్రపంచం మరచిపోయిన ఒక చిన్న ప్రపంచం, కేవలం వారిద్దరిదే.

 

రవి ముఖం సీత గుండెలపై ఆనుకుని, మెల్లగా ఆమె చెవిలో గుసగుసలాడాడు. “నువ్వు నాకు ఎప్పుడూ ఇలానే అనిపిస్తావు సీత. మన పెళ్లి రోజు.. ఆ మొదటి రాత్రి లాగా. ఎప్పుడూ కొత్తగా..” అతని గొంతు మెత్తగా, ప్రేమతో నిండి ఉంది.

 

సీత కళ్లు మూసుకుని, అతని భుజాల చుట్టూ చేతులు వేసి, మరింత దగ్గరికి లాక్కుంది. ఆమె హృదయ స్పందనలు వేగంగా మారాయి, కానీ అది కేవలం కామం కాదు.. అది లోతైన ప్రేమ, గత 14 సంవత్సరాల నుంచి నిర్మితమైన బంధం.

 

ఇప్పుడు, ఆ రాత్రి వారి మధ్య ప్రేమ మరోసారి పూర్తి రూపంలో వ్యక్తమవుతోంది. రవి మెల్లగా ఆమె గొంతు మీద ముద్దు పెట్టాడు, ఆమె శరీరం అతని స్పర్శకు స్పందిస్తూ వణికింది. అతని చేతులు ఆమె చీర మీదుగా మెల్లగా సర్దుకుంటూ, ఆమెలోని ప్రతి అణువును ఎంతో మృదువుగా.. తాకాయి.

 

సీత శ్వాసలు భారంగా మారాయి, ఆమె చేతులు అతని షర్ట్ బటన్లను విప్పుతూ, అతని ఛాతీపై వేళ్లు పరుగెత్తించాయి. వణుకుతున్న గొంతుతో.. “రవి… నువ్వు నన్ను ఇలా తాకినప్పుడు, నా శరీరం మొత్తం ఏదో తెలియని అలజడి..” అంది ఆమె.

 

రవి ఆమె చీరను నెమ్మదిగా తీసేశాడు. వెన్నెలలో ఆమె శరీరం వెండి రంగులో మెరిసింది.. అతని కళ్లు ఆమెను ఆరాధనతో చూస్తూ, మెల్లగా ఆమె పెదవులను తన పెదవులతో కలిపాడు. ముద్దు లోతుగా మారింది.. వారి శ్వాసలు ముడిపడ్డాయి.

 

వారు మరింత దగ్గరగా జరిగారు. సీత కళ్లు మూసుకుని, తనను తాను మైమరచిపోయి.. “రవి… ఇక ఆపకు… నన్ను పూర్తిగా నీ దానిగా చేసుకో… నీలో కలిసిపోవాలని ఉంది” అంది.

 

ఆ నిమిషం ఆమె గొంతులో కోరిక, ప్రేమ కలిసి ఉన్నాయి.

 

రవి మెల్లగా ఆమెను ఆక్రమించుకున్నాడు. మొదటి కదలికలు నెమ్మదిగా, జాగ్రత్తగా… ఆమె శరీరం అతన్ని స్వాగతిస్తూ, చుట్టుముట్టింది. 

 

రవి ఆమె పెదవులను ముద్దాడుతూ, ఆమె శరీరాన్ని మృదువుగా తాకుతూ.. వారి శరీరాలు ఒకే లయలో కదులుతున్నాయి.

 

చెమటతో తడిసిన శరీరాలు, భారీ శ్వాసలు, సుఖ సముద్రంలో మునిగిపోతున్నాయి. సీత అతని వీపుపై వేళ్లు గట్టిగా వత్తి పెట్టి, “రవి… రవి…” అంటూ అరిచింది.

 

చివరికి వారిద్దరూ ఒకేసారి ఉద్వేగంలో మునిగిపోయారు. శరీరాలు వణికి, హృదయాలు ఒకటైపోయాయి.

 

కానీ అకస్మాత్తుగా, సీత ముఖం ముభావంగా మారింది. ఆమె కళ్లలో ఏదో అంతర్గత సంఘర్షణ కనిపించింది. రవి అది గమనించి, వెంటనే కంగారుగా..

 

“ఏమైంది రా? ఏదైనా ఇబ్బందిగా ఉందా?” అని చెప్పి, ఆమెను మరింత దగ్గరికి లాక్కుని, ఓదార్చుతున్నాడు.

 

కానీ ఆమె ఏమి మాట్లాడటం లేదు. మౌనంగా తల దించుకుని కూర్చుని ఉండిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా కనిపించని మనిషి ఒక్క సెకండ్ లో చాలా బాధగా ఏదో తప్పు చేశాను అని అపరాధ భావంతో భర్త వైపు కూడా చూడలేని నిస్సహాయముతో తనను తాను ద్వేషించుకుంటూ అలా మౌనంగా ఎటు కదలకుండా ఉలి చెక్కిన శిల్పంలా కూర్చునే ఉంది.

 

తన భార్యను అలా చూసిన రవి చాలా బాధపడ్డాడు.. ‘ఎందుకు అప్పుడప్పుడు ఇలా అయిపోతుంది? ఏం జరుగుతుందో? నా దగ్గర ఏమైనా దాస్తుందా? ఏమైనా చెప్పాలనుకుంటుందా?’ ఏమీ అర్థం కాక అప్పుడప్పుడు తన భార్యను వస్తున్న ఈ వింత మార్పుకి కారణం ఏమై ఉంటుందో తెలియక ఒక నిమిషం తాను ప్రాణం ఉన్న శిలగా మిగిలిపోయాడు.

 

కాసేపటికి అతనే తేరుకుని.. ‘చెప్పాలి అని అనుకుంటే నేను అడగక ముందే చెపుతుంది, చెప్పనిది అయితే ఎన్ని సార్లు అడిగినా చెప్పదు కదా..’ అని తనలో తాను అనుకున్నాడు రవి.

 

అతను చేస్తున్న పని మానేసి, అతని ఆలోచనలకు తాళం వేసి.. ఆమెను తన ఎద పై పడుకోబెట్టుకొని, గట్టిగా ఆమెను కౌగిలించుకుని, నుదిటి మీద ముద్దు పెట్టీ.. చిన్న పిల్లను నిద్ర పుచ్చినట్టు ఆమె భుజం మీద చేతితో మెల్లగా జో కొడుతూ ఉంటే సీత చిన్న పిల్లలా అతని ఎద పై తల పెట్టుకుని నిద్ర పోయింది. కాదు నిద్ర పోతున్నట్టు నటించింది.

 

***

 

అసలు ఉన్నట్టుండి సీత కు ఏమై ఉంటుంది?? తెలుసుకోవాలి అంటే ప్లీజ్ ఫాలో “ఆమె మనసులో.. సీత కథ” లో..

 

                 Sp ✍️… writes