అలా అఖిల్ తన డాన్స్ క్లాసెస్‌తో, ఆఫీస్‌తో బిజీగా తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటాడు. సత్య కూడా ఒకవైపు ఇంటిని చూసుకుంటూనే, మరోవైపు అఖిల్ డాన్స్ క్లాసెస్‌కి సంబంధించిన విషయాల్లో అతనికి తోడుగా ఉంటుంది.
అఖిల్ ఎంత బిజీగా ఉన్నా తన డాన్స్ క్లాసెస్‌కి మాత్రం ఎప్పుడూ టైం కేటాయిస్తాడు. తన దగ్గరకి వచ్చే పిల్లలకు ఓపికగా డాన్స్ నేర్పిస్తూ, వాళ్లలో ఉన్న టాలెంట్‌ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
కానీ… అతని ఎదుగుదలని చూసి సంతోషపడేవాళ్లు ఎంతమంది ఉన్నారో, అతని మీద పగ పెంచుకునే వాళ్లు కూడా అంతే మంది తయారవుతారు.
అఖిల్ ఆఫీస్‌లోనే అతని ఎదుగుదలని చూసి ఓర్వలేని ఒక వ్యక్తి ఉంటాడు. బయటకి మాత్రం అఖిల్‌తో చాలా మంచిగా ఉన్నట్టు నటిస్తూ, లోపల మాత్రం అతని మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
అఖిల్‌కి ఆ విషయం అసలు తెలియదు.
ఒకరోజు…