New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 21

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 21

అలా రోజులు గడుస్తున్న కొద్దీ అఖిల్ ఆరోగ్యం కూడా కాస్త కుదుటపడుతుంది. కానీ డాక్టర్స్ మాత్రం ఇంకొన్ని రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో అఖిల్ ఇంట్లోనే ఉండి సత్య డాన్స్ క్లాస్ ఎలా నడుపుతుందో చూస్తూ ఉంటాడు.

 

మొదట్లో సత్య కేవలం తన భర్త కోసం క్లాస్ తీసుకుంటుంది అనుకున్నాడు అఖిల్. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె ఆ క్లాస్‌ని ఎంత బాధ్యతగా తీసుకుందో అర్థమవుతుంది.

 

ఒకరోజు సత్య క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోయి ఉంటుంది. అయినా అఖిల్‌కి డిన్నర్ పెట్టి, పిల్లల్ని చూసుకుని, అతని మందులు టైమ్‌కి ఇచ్చి, తర్వాతే తన గురించి ఆలోచిస్తుంది.

 

అఖిల్ మాత్రం ఆమెనే చూస్తూ ఉంటాడు.

 

“ఏంటి అలా చూస్తున్నారు?” అని సత్య అడుగుతుంది.

 

“ఏం లేదు బంగారం… నువ్వు ఇంత చేస్తుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు” అంటాడు అఖిల్.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue