అలా కొన్ని రోజులు గడిచిపోతాయి…
సత్య, అఖిల్ ఇద్దరూ కలిసి డాన్స్ స్కూల్‌ని మరింత బాగా డెవలప్ చేయడం మొదలుపెడతారు. అఖిల్ ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో సత్య క్లాసెస్ చూసుకుంటుంది. సాయంత్రం అఖిల్ వచ్చాక ఇద్దరూ కలిసి కొత్త కొరియోగ్రఫీస్, కొత్త బ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
రోజురోజుకీ డాన్స్ స్కూల్‌కి వచ్చే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
ఒకరోజు ఒక పేరెంట్ సత్యని కలిసి, “మేడమ్… మా అమ్మాయికి డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ స్టేజ్ మీదకి వెళ్లడానికి భయపడుతుంది. మీరు కొంచెం మోటివేట్ చేస్తే బాగుంటుంది” అని చెబుతుంది.
“ఎందుకు భయపడాలి అండి? తప్పు చేస్తే నేర్చుకోవచ్చు. కానీ ప్రయత్నించకుండా వెనక్కి తగ్గకూడదు. మీ అమ్మాయిని రేపటి నుంచి నా దగ్గరకి పంపండి… నేను చూసుకుంటాను” అని సత్య ధైర్యంగా చెబుతుంది.
మరుసటి రోజు ఆ అమ్మాయి క్లాస్‌కి వస్తుంది.