New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 2

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 2

“సత్యా… ఇంకా నీ అలవాటు మార్చుకో తల్లి. మా మాతో కలిసి వచ్చి ఇలా సోఫాలో కూర్చో…
“అలాగే అత్తయ్య…” అని సత్య చిన్నగా నవ్వి 
సత్య కూడా వచ్చి… ఎప్పుడూ పనులు అంటూ కిచెన్‌లోనే ఉంటావు. కొంచెంసేపు మాతో కూడా కూర్చుంటే మాకు సంతోషంగా ఉంటుంది” అని అత్తయ్య అంటారు.
“సరే అత్తయ్య… ఇక నుంచి మీతోనే కూర్చుంటాను” అని సత్య నవ్వుతూ చెప్తుంది.
ఇంకా ముగ్గురూ కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అఖిల్, పిల్లల గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఉంటారు.
అలా కొంచెంసేపు టీవీ చూస్తూ అందరూ ఎంజాయ్ చేస్తారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో సత్య లేచి కిచెన్‌లోకి వెళ్తుంది.
“అత్తయ్య… మావయ్య… రైస్ పెడుతున్నాను. మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి” అని కిచెన్ నుంచి అడుగుతుంది.
“ఏం వద్దమ్మా… నువ్వు చూసుకో” అని అంటారు.
సత్య రైస్ స్టవ్‌పై పెట్టి, కూరలు కూడా రెడీ చేసి, మళ్లీ వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది.
కొంచెంసేపటికి రైస్ కుక్ అవ్వడం కూడా అయిపోవడంతో కిచెన్‌లోకి వెళ్లి అన్నీ రెడీ చేసుకొని,
“అత్తయ్య… మావయ్య… భోజనానికి రండి” అని పిలుస్తుంది.
“అలాగేనమ్మా…” అని ఇద్దరూ హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు.
సత్య కూడా వాళ్లతో పాటు కూర్చొని భోజనం చేస్తుంది.
“తల్లి… నువ్వు కూడా సరిగ్గా తింటున్నావు కదా?” అని అత్తయ్య అడుగుతారు.
“హా అత్తయ్య… బాగానే తింటున్నాను” అని సత్య నవ్వుతుంది.
“అయితే సరే… అఖిల్ లాగా పనిలో పడి టైంకి తినడం మర్చిపోవద్దు” అని మామయ్య అనడంతో సత్య నవ్వుతుంది.
అలా ముగ్గురూ కూర్చొని లంచ్ కంప్లీట్ చేస్తారు.
తర్వాత కొంచెంసేపు వాకింగ్ చేసి, ఎవరి రూమ్‌లోకి వాళ్లు వెళ్లిపోతారు.
ఇంకా సత్య కూడా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుంది.
అలా సాయంత్రం 4:30కి మెలుకువ వస్తుంది.
సత్య లేచి ఫేస్ వాష్ చేసుకుని, క్లీన్ చేసుకుని హాల్లోకి వస్తుంది.
కాసేపు ఇంట్లో అంతా చూసుకుని, వెంటనే కిచెన్‌లోకి వెళ్లి పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం మొదలుపెడుతుంది.
ఒకపక్క పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తూనే, మరోపక్క అందరికీ టీ కూడా ప్రిపేర్ చేస్తుంది.
కరెక్ట్‌గా 4:45కి పిల్లలు ఇంటికి వస్తారు.
రావడంతోనే బ్యాగులు సోఫాలో వేసి, షూస్, టై, బెల్ట్ విప్పి పక్కన పెట్టి కాళ్లు, చేతులు, మొహం కడుక్కొని హాల్లోకి వస్తారు.
“మమ్మీ… స్నాక్స్ రెడీ చేశావా?” అని పిల్లలు అడుగుతారు.
“చేశాను బంగారాలు… ముందు కూర్చోండి. నేను తీసుకొస్తాను” అని సత్య చెప్తుంది.
అంతలో అఖిల్ కూడా పిల్లలతో పాటే ఇంటికి వస్తాడు.
“గుడ్ ఈవెనింగ్ మమ్మీ…” అంటూ పిల్లలు లోపలికి వస్తే, అఖిల్ కూడా వాళ్ల వెనకాలే వస్తాడు.
“రండి బంగారాలు… వెళ్లి ఫ్రెష్ అయి రండి” అని సత్య చెప్తుంది.
వీళ్ల స్కూల్ టైమింగ్స్ సాయంత్రం 4:30 వరకు ఉంటాయి. అఖిల్ టైమింగ్స్ కూడా ఇవే కావడంతో పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాడు.
అఖిల్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్లేలోపు పెద్దవాళ్లు కూడా హాల్లోకి వచ్చి సెటిల్ అవుతారు.
మార్నింగ్ టైంలో అందరికీ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండడంతో ఎక్కువగా మాట్లాడుకోవడానికి కుదరదు. కానీ ఈవెనింగ్ మాత్రం అందరూ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు.
సత్య కూడా టీ, స్నాక్స్ తీసుకొని హాల్లోకి వస్తుంది.
పిల్లలకి స్నాక్స్ ఇచ్చి, పెద్దవాళ్లకి టీ, స్నాక్స్ ఇస్తుంది.
అఖిల్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్లతో పాటు సోఫాలో కూర్చుంటాడు.
“ఏంటి బంగారం… ఇంత కష్టపడుతున్నావు?” అని అఖిల్ అడుగుతాడు.
“ఏం కష్టం లేదండి… అందరం కలిసి కూర్చున్నాం కదా. నాకు కూడా సంతోషంగానే ఉంది” అని సత్య చెప్తుంది.
అలా అందరూ కొంచెంసేపు సరదాగా మాట్లాడుకుంటూ తింటూ, తాగుతూ ఉంటారు.
పిల్లలు కూడా స్కూల్‌లో జరిగిన విషయాలు, టీచర్ చెప్పిన విషయాలు చెప్తూ ఉండడంతో పెద్దవాళ్లు వాటిని వింటూ నవ్వుకుంటూ ఉంటారు.
అలా ఈవెనింగ్ నానమ్మ, తాతయ్య వాకింగ్‌కి వెళ్తుంటే పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్లతో వాకింగ్‌కి వెళ్తారు.
అక్కడి నుంచి ఐదు నిమిషాల డిస్టెన్స్‌లోనే పార్క్ ఉండడంతో వీళ్లు కూడా పిల్లల్ని తీసుకొని సరదాగా వాకింగ్ చేస్తూ ఉంటారు.
వీళ్లు వాకింగ్ చేస్తుంటే పిల్లలు మాత్రం ముందుగానే పార్క్‌లోకి వెళ్లి ఆడుకుంటూ ఉంటారు.
ఒకసారి స్లైడ్ దగ్గరికి, ఇంకోసారి ఊయల దగ్గరికి అంటూ ఇద్దరూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు.
వాళ్లని చూస్తూ నానమ్మ, తాతయ్య చాలా సంతోషపడిపోతూ ఉంటారు.
“మన పిల్లలు కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకుంటూ ఉండేవాళ్లు కదా…” అని అంటారు.
“అవునండి… ఇలాగే మన పిల్లలిద్దరూ ఆడుకునేవాళ్లు. ఇప్పుడు అమ్మాయికి రావడానికి తీరిక లేకపోయినా, అబ్బాయి మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు” అని అంటారు.
“మన కోడలు సత్య అయితే బంగారు తల్లి. చక్కగా మనల్ని అడగకముందే అన్ని అర్థం చేసుకొని, మనిద్దరినీ దగ్గరుండి చూసుకుంటుంది” అని ఇద్దరూ కోడలు గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.
“నిజమేనండి… మనకి ఏం కావాలో కూడా అడగాల్సిన అవసరం లేకుండా ముందే చూసుకుంటుంది. మనం ఏం చెప్పినా నవ్వుతూ చేస్తుంది” అని అంటారు.
“కోడలు అడుగుపెట్టిన వేళ విశేషమేమో కానీ… మన జీవితాల్లో సంతోషాలు తీసుకువచ్చింది. చక్కగా కుటుంబాన్ని చూసుకుంటుంది” అని అంటారు.
అలా కొంచెంసేపు ఇద్దరూ సత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
పిల్లలు ఆడుకుంటూ వచ్చి,
“నానమ్మ… మేము చాలా ఆడుకున్నాం” అని చెప్పడంతో ఇద్దరూ వాళ్లని దగ్గరికి తీసుకుంటారు.
“సరే బంగారాలు… ఇంక ఇంటికి వెళ్దాం పదండి” అని చెప్పి అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు.
వీళ్లు పార్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అఖిల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.
ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్‌పై పడుకొని మొబైల్‌లో వీడియోస్ చూస్తూ ఉంటాడు.
చదివి వెళ్లిపోకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. 🥰🥰
మీ Chinni ❤️