పళ్ళు నూరుతూ ఏయ్! కృతి నీ బ్యాగ్ లో నా స్ట్రాటజిక్ నోట్స్ ఉంది చూడు… అసలే స్ట్రాటజిక్స్ లెక్చరర్ పెద్ద హిట్లర్ లా ఉన్నాడు ఊ అంటే ఉరుముతున్నాడు అని క్రిష్ వైపు చూస్తూ బ్యాగ్ లో నుండి నోట్స్ తీస్కుని వెళ్లిపోతుంటే పొగరు అనుకున్నాడు…
గీత, శాన్వి బస్ స్టాప్ కి వెళ్తే కృతి నీ బుజ్జగించి ఐస్క్రీమ్ పార్లర్ కి వెళ్లి ఐస్క్రీమ్ తినిపించి తాతయ్య దగ్గరికి తీసుకు వెళ్ళాడు…..
వారానికి ఓసారి కృతి కూడా తాతయ్య దగ్గరికి వెళ్లి చూసి ధైర్యం చెప్పేది…
ఇప్పుడు కూడా తాత గారిని చూసి ఇంటికి వెళ్దాం తాతయ్య అంటే… నా వల్ల మీకు ఇబ్బంది అని ఇంటికి రాను అని హాస్పిటల్ లోనే ఉంటున్నారు…