“నీకు పెళ్లి అవ్వగానే ఇంటిపేరు మాత్రమే కాదు ప్రయారిటీస్ కూడా మారిపోతాయి శైలు.. ఇది నీ ఇల్లు, ఇక్కడ మనుషులు నీ బాధ్యత.” అని అంది పద్మ.
“క్షమించండి అత్తయ్య పొరపాటు జరిగిపోయింది.” అని అంది భయంగా శైలు.
“చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద అగాధలని సృష్టిస్తాయి.. ఇప్పుడు మీ మామయ్య పక్కన నేను తప్ప ఎవరూ లేరు, మాకు కూతురు అయిన కోడలు అయినా నువ్వే కదా..!” అని అంది మెత్తటి కత్తిలా మాటలని వదులుతూ పద్మ.
“హ.. అవును అత్తయ్య.” అని అంది తల ఊపుతూ శైలు.