New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
చూపులు కలిసిన వేళ – 2

చూపులు కలిసిన వేళ – 2

జాను కోడలు పిల్లకి పంపించాల్సిన జ్యువెలరీ పట్టు చీర పంపించావా…….??? హా అండి  నిన్ననే  వెళ్లి ఇచ్చి వచ్చాను..!!
జాను అన్ని పెట్టావు కదా, మళ్లీ అక్కడికి వెళ్ళాక ,అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను, అంటే బాగోదు ,ఒకసారి చూసుకో, వెళ్లి అందరి ముందు మాట రాకూడదు….?
హా  చూసే పెట్టానండి… ఆ సరే  మహి నువ్వు వేరే కార్ తీసుకొని… వదిన వాళ్ళ ఇంటికి వెళ్లి తనని తీసుకొని…ఫంక్షన్ హాల్ కి వచ్చాయి.
అలాగే ఫంక్షన్ హాల్ కి, వచ్చే ముందు,నాకు కాల్ చెయ్… సరే నాన్న,  మరి మీరు,
నేను, అన్నయ్యా ,అమ్మ, రాజమ్మ, ఒక కారులో వస్తాం….. ఒకే నాన్న నేను వెళుతున్నా… సరే జాగ్రత్తగా డ్రైవ్ చెయ్, వాళ్ళ బంధువులు ఉంటే… నెక్స్ట్ ట్రిప్, డ్రైవర్ నీ,  తీసుకు రమ్మని చెప్పు. అలాగే నాన్న.
Sv conversation hall………
ఎంట్రీ నుండి ఫంక్షన్ హాల్ మొత్తం. పువ్వులతో చూడడానికి కలర్ ఫుల్ గా అలంకరించారు.
హాల్లోకి వెళ్తే మనకి దొరికే పువ్వుల్ని కాక దేశ విదేశీ నుండి తెప్పించిన పువ్వులతో కంటికి కన్ను విందుగా ఉండేలా…. ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి సరిపోయేట్టు డెకరేషన్ చేశారు.
ఎక్కడ చూసినా వాళ్ళ హోదాకి తగ్గకుండా. చాలా అంటే,  చాలా కాస్ట్లి తో ఉంది. భారీ బడ్జెట్తో చేసిన స్టేజ్ రాయల్ చైర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
ఈ ఫంక్షన్ కోసం. రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ, స్నేహితులు, బంధువులు, అందరూ విచ్చేస్తున్న వల్ల భారీ సెక్యూరిటీ నీ  నియమించారు, రఘురాం గారు.
వచ్చిన అతిధులకు, అతిథి మర్యాదలు,ఏ లోటు రాకుండా. అన్నిటికి సిద్ధం చేశారు.
అప్పుడే అక్కడికి వచ్చినా, బ్లాక్ బెంజ్ కార్ లో  నుండి 6.2 హైట్ తో  సిల్క్ హెయిర్ చురుకైన  చూపుతో ఎప్పుడు ట్రిమ్మ చేసినట్టు ఉండే బియార్డ్ అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్న  మన  సిద్ధార్థ వర్మ. స్పెడ్స్ పెట్టుకుంటూ స్టైల్ గా దిగాడు కార్.
కన్నా ఒక నిమిషం అంటూ జాను గారు, వెనక డోర్ నుండి బయటకు కి దిగుతూ  అక్కడే ఉన్నా వేరే సర్వెంట్స్ తో ఆల్రెడీ సిద్ధం చేసిన గుమ్మడికాయ తీసుకొని దిష్టి తీయడం స్టార్ట్ చేశారు జాను గారు…మా ఇక్కడ కూడానా…?
నువ్వు ఉండు కన్నా వచ్చినదారిలో ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో నీ మీద అందుకే దిష్టి తీస్తున్నాను…… అయినా మా నేను కార్ లోనే ఉన్నా కదా ఇంకెవరు దిష్టి పేడతారు నాకు…!!!
కన్నా……. ఆ సరే సరే తీయి నువ్వు నీ దిష్టి పిచ్చి 
దిష్టి తీసి పక్కనే ఉన్న రాజమ్మ కి ఇచ్చి బయట వేసిరా……సరే అమ్మ ….. సిద్ధూ నువ్వు లోపలికి వెళ్ళు మేము వస్తాము.
నాన్న సిద్దు నీకోసం రెడీ చేసిన రూములో వెయిట్ చెయ్ హా సరే డాడ్.
బ్యాక్ టు పెళ్ళికూతురు హౌస్
ఒసేయ్ పెద్ద మనవరాల నీకు అదృష్టం బలే పట్టిందే మీ కాబోయే అత్తగారు నీకోసం  బంగారపు నగలు పట్టు చీర పంపించింది.
5.7 హైట్ తో  చిలక పచ్చ రంగు పింక్ కలర్ కాంబినేషన్ ఉన్న పట్టు చీరతో మ్యాచింగ్ వర్క్ బ్లౌజ్  తన అందాన్ని మరింత పెంచడానికి తగ్గ ఆభరణాలు కళ్ళకి కాటుక నుదుటున్న స్టిక్కర్ దానికి  కింద  కుంకుమ.  తో అత్తింటి నుండి పంపించిన వస్త్రాల ఆభరణాలతో మహాలక్ష్మిలా ఉంది మన అన్విత
మరి ఏమనుకున్నావ  నీ పెద్ద మనవరాలు అందం అంటే ఈ అందాన్ని చూసే ఆయన నన్ను ఇష్టపడ్డారు. తాను తాను అద్దం లో చూసుకుంటూ మురిసిపోతుంది.
అవునే మనవరాలు కొంతమంది ఉంటారు. అందంగా ఉన్న,  ఎప్పుడు నెత్తిమీద, దరిద్రం పెట్టుకొని, వేలాడుతూ ఉంటారు. నీలా అందరికీ అదృష్టం కలిసి రాదు నువ్వు నక్క తోక తొక్కేవే అందుకే నీ అదృష్టం   సింహాసనమై కూర్చుంది.
సరే త్వరగా కానీ, మీ మావయ్య గారు… నీ కోసం కారు పంపిస్తున్నారంట…..!!!  లాస్ట్ మేకప్ టచ్ అప్ వేసుకుంటూ నేను రెఢీ  అమ్మమ్మ.
వీళ్ళ మాటల్లోనే ఉండగా ఇంటికి ముందు ఆగిన కారు సౌండ్ కి బయటికి వచ్చారు శ్రీలత గారు
అన్విత తల్లి గారు అయినా శ్రీలత గారు బయటకి వచ్చి కారులో నుండి దిగి వస్తున్నా మహి నీ చూసి బాబు మీరు…?
అత్తయ్య గారు వదిన తీసుకువెళ్లడానికి నాన్నగారు నన్ను పంపించారు.
మీరు ఎందుకండి డ్రైవర్ని పంపించిన మేము   వచ్చే వాళ్ళం కదా…!!!
నువ్వు ఉండవే  తన వదిన  తీసుకెళ్లడం కోసం తనే స్వయంగా వస్తే  మీరు ఎందుకు వచ్చారు అడుగుతావా…… లక్షణముడు లాంటోడే సీతమ్మ తల్లికి వాచ్మెన్ గా ఉన్నాడు…. ఈ మరిది   డ్రైవర్గా మారితే ఏమవ్వదు గానీ 
తనని డ్రైవర్ అని అన్నా ముఖంలో కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా అత్తయ్య గారు బయలుదేరుదాం టైం అవుతుంది.
బాబు లోపలికి రండి కాఫీ తాగి బయల్దేరు గానీ,
లేదు అత్తయ టైం అవుతుంది ఈసారి వచ్చినాప్పుడు తాగుతాను. 
ఒసేయ్ గీత ఎక్కడా ఉన్నవే…?? నీ సోకులు అయితే లోపల లగ్గేజ్ తీసుకొచ్చి కార్ లో పెట్టు.
మెరూన్ గోల్డ్  కలర్, కాంబినేషన్ లో చీర కట్టుకొని,  మెడలో ఒక ఛైన్ తో, పాటు   సింపుల్ గా ఉండే నాకిల్స్ పెట్టుకొని, చేవులు కి మ్యాచింగ్ జూకాలు పెట్టుకుంటూ బయటికి వస్తున్నా అమ్మాయిని చూసి మహి కన్ను ఆరుపకుండ అలానే చూస్తున్నాడు.
అయినా ఎన్ని సారులు పిలవాలి విన్నాపడ్డడం లేదా చెవిలో సీసం ఏమన్నా పోసుకున్నావా  లగేజ్ కార్లో పెట్టు
హా అమ్మమ పెట్టేస్తా. లోపల కి వెళ్లి తన కన్నా డబల్ సైజ్ ఉన్న బ్యాగ్ నీ మోయలేక మోస్తున్న తన అవస్థని చూసి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు మహి.
ఇంటు ఇవ్వండి….!! అన్నా పిల్లుపుకి తన వైపు కి చూసి మొహమాటంగా లేదు అండి నేను తీసుకొస్తాను…… మీరు దాని కార్ లో పెట్టే లోపు అక్కడ ఫంక్షన్ కూడా అయిపోయింది అండి…!!
మహి అన్న మాట వెటకారంగా ఉండే సరికి తన వైపు కి చురుకుగా చూసింది.
ఆ చూపుకి తడిపడి అంటే మీరు మోయలేక మోస్తున్నారు కదా అందుకని నేను హెల్ప్ చేద్దామని అలా అన్నాను.
మహికి ఒక లుక్ ఇచ్చి బ్యాగ్ అక్కడే వదిలేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది.
ఇదేంటి ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది. ఫీల్ అయ్యింది అంటావా. సరేలే ఈసారి కనిపిస్తే సారీ చెబుదాం.
హాయ్ మహి అన్న పిలుపుకి, హాయ్ వదిన రండి వెళ్ళదాం….అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ……హా మహి నువ్వు కార్ స్టార్ట్ చెయ్, అంటూ తను బ్యాక్ సీట్లో కూర్చుంది.తన ప్రక్కన శ్రీలత, గారు వాళ్ళ అమ్మమా కూర్చున్నారు….!! ఇందాక తను చూసిన అమ్మాయి ఫ్రంట్ సీట్ లో కూర్చుంటుంది ఏమో అని చూస్తున్నా మహికి…??
ఫ్రెంట్ డోర్  తెరిచేసరికి  ఆత్రుతగా చూసిన మహి కి గట్టిగా షాక్ తగిలింది. వెనక ఉండవలసిన బామ్మ  గారు ఫ్రెంట్ సీట్లోకి వచ్చారు.వెనుక ఉంది ఏమో అని చూసిన మహి కి ఎవరో కొత్త మొఖం దర్శనం. ఇచ్చింది. 
ఇదేంటి తను రావడం లేదా మనసులో అనుకుంటున్నా మహి కి ,పక్కన  బామ్మ గారు అరిచినా  అరుపుకి  ,ఈ లోకంలోకి వచ్చాడు మహి.
ఒసేయ్ గీత ఇంట్లో అన్నిటి కి తాళాలు వేసుకొని వెనుక ఆటోలో వచ్చాయి.
ఇంక ఉంది.