చూపులు కలిసిన వేళ – 1
“నాన్నా… నన్ను పట్టుకో!” అంటూ కిలకిలా నవ్వుకుంటూ మూడు సంవత్సరాల బాబు వాళ్ల నాన్న ముందు పరిగెడుతున్నాడు.
“కన్నా… స్లోగా పరిగెత్తు. పడిపోతావు.”
“లేదు నాన్నా… నువ్వు ఉన్నావుగా… నేను పడిపోను!” అంటూ ఆ బాబు ఒక్కసారిగా ఆగాడు.
అదే సమయంలో ఒక లారీ వచ్చి గుద్దడం… కళ్ళు మూసుకొని తెరిచేలోపు జరిగిపోయింది.
“కన్నా…!” అంటూ నిద్రలో నుంచి లేచి కూర్చున్నాడు 27 ఏళ్ల యువకుడు.
సిద్ధు… సిద్ధార్థ్ వర్మ.
ACలో ఉన్నా నుదిటిపై చెమటలు పట్టాయి. ఒళ్లంతా వణికిపోతుండగా…
“ఏంటి ఇలాంటి కల వచ్చింది…? ఎప్పుడూ లేనిది ఇలాంటి కల ఇవాళ రావడం ఏంటి…?” అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
“కన్నా… కన్నా…” అంటూ జానకి గారు బయట నుంచి డోర్ నాక్ చేస్తూ పిలుస్తుండటంతో, ఆలోచనల నుంచి తేరుకున్నాడు.
“హా మా… వస్తున్నా…” అంటూ డోర్ తీసి లోపలికి దారి ఇచ్చాడు సిద్ధు.
“ఏంటి కన్నా… ఇంకా లేవలేదు? టైం అవుతుంది కదా! వెళ్ళు… రెడీ అవ్వు పో.”
“హా మా…” అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు మన హీరో.
వాళ్ల కన్నయ్యకి కావాల్సినవి తీసి పెట్టి, కింగ్ సైజ్‌లో ఉన్న బెడ్‌ను సర్ది వెళ్ళారు.
సిద్ధు తన రూమ్‌లోకి ఎవరినీ రానివ్వడు. జానకి గారు మాత్రమే క్లీన్ చేస్తారు. లేదంటే తానే క్లీన్ చేసుకుంటాడు.
వెళ్ళడం అయితే వెళ్ళాడు గానీ… ఆ కల మాత్రం కళ్ళ ముందు నుంచి పోవడం లేదు.
స్వచ్ఛమైన నవ్వుతో ఉన్న ఆ బాబు మొహం సరిగ్గా కనిపించకపోయినా… రక్తపు మడుగులో ఉన్న ఆ బాబుని అలా చూస్తుంటే మనసుకి ఏదో తెలియని బాధ కలుగుతోంది.
“ఎవరు కన్నా…? నువ్వు నా కలలోకి ఎందుకు వచ్చావు? నిన్ను అలా చూసి నాకు ఎందుకు ఇంత బాధగా ఉంది…?
నీకు, నాకు ఏమైనా బంధం ఉందా…?” అని తనలో తానే ఆలోచిస్తున్న సిద్ధుకి వాళ్ల తమ్ముడి పిలుపు వినిపించింది.
“అన్నయ్యా…!”
ఆలోచనల నుంచి బయటకు వచ్చి…
“హా… వస్తున్నా మహి. వెయిట్.”
“అన్నయ్యా… త్వరగా రా. టైం అవుతుంది.”
ఒక టవల్ కట్టుకుని, ఇంకో టవల్‌తో తడి తలను తుడుచుకుంటూ బయటకు వస్తూ…
“హా మహి… అందరూ రెడీగా ఉన్నారా?” అని అడిగాడు.
“హా అన్నయ్యా. నీదే లేటు. అయినా నువ్వు జిమ్‌కి కూడా రాలేదు. ఇంకా లేటుగా రెడీ అవ్వడం ఏంటి?”
“హో… నాకు తెలుసులే. వదినతో ఊహాలోకంలో ఉన్నావా…?”
“రేయ్… ఇంకా చాలు. నువ్వు బయటకు వెళ్ళు.”
“సరే. నువ్వు త్వరగా రా. మనం వెళ్ళాలి. ఇంకా టైం అవుతుంది.”
అని డోర్ దాకా వెళ్లి…
“అన్నయ్యా… ఇంతకీ ఊహలో ఫుల్ రొమాన్స్ నా…?”
“రేయ్… ఆగరా! వస్తున్నా.”
“హా… ఉంటారు. అంత లేదు. నీకు దొరికితే ఇంకా ఏం అన్నా ఉందా? అందుకే నేను జంప్.
త్వరగా వచ్చేయ్. అక్కడ నీ కోసం వదిన వెయిటింగ్ చేస్తుంది.”అని చెప్పి మహి వెళ్ళిపోయాడు.
తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి, వాళ్ల అమ్మ ఇచ్చిన డ్రెస్‌ని చూసి తల పట్టుకున్నాడు సిద్ధు.
“మా కి ఏం అయింది…?
ఇలాంటి డ్రెస్సులు నేను వేసుకోను అని తెలుసు కదా! ఇప్పుడు నేను ఇది వేసుకోవాలా…?”
అయినా తప్పక వాళ్ల అమ్మగారిని బాధ పెట్టలేక డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి కష్టంగా డ్రెస్ వేసుకున్నాడు.
మిర్రర్ ముందు తనని తాను చూసుకుని, వాళ్ల అమ్మగారి టేస్ట్‌కి మురిసిపోయి, హెయిర్‌ని కోంబ్‌తో సెట్ చేసుకుని రెడీ అవ్వడంలో బిజీ అయ్యాడు.
ఈలోపు జాను గారు… అలియాస్ జానకి గారు… కింద ఏం చేస్తున్నారో చూద్దాం.
హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు సిద్ధు వాళ్ల నాన్నగారు రాఘురాం గారు.
“ఏమోయ్ జాను… నిదానంగా. ఎందుకు అంత కంగారు పడుతున్నావు?”
“అబ్బా… ఏంటి అండి మీరు! అసలే నా కన్నయ్య ఒప్పుకోక పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఏం లోటు లేకుండా చేయాలి కదా!”
“అందుకని నువ్వు పరిగెడుతూ ఉంటావా? కొంచెం నిదానంగా కూడా చెయ్యచ్చు.”
“అలా చెప్పండి డాడ్. పొద్దున నుంచి కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు. సరి కదా… ఇంకా నాతో ఇంటి పని కూడా చెప్పిస్తుంది!” అంటూ వాళ్ల డాడ్ పక్కన కూర్చున్నాడు మహి.
“రాజమ్మ… మీ చిన్న బాబుగారికి కాఫీ తీసుకురా.”
“ఒరేయ్… నీకే కాదు, నాకు కూడా ఇవ్వలేదు. నేను ఎవరికి చెప్పుకోవాలి రా?” అన్నారు రఘురాం గారు.
“అసలు ఏంటి అండి మీరు? అక్కడ జరిగేది నా కన్నయ్యది. నేను సంబరంగా చేసుకోవాలి. అయినా మీరు ఒక రోజు కాఫీ తాగకపోతే ఏం అవ్వదు.”
“అమ్మగారూ… కాఫీ.”
“హా రాజమ్మ… అవి నాకు ఇచ్చి నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు.”
“నేను ఎందుకు అమ్మా? మీరు వెళ్ళి రండి.”
“లేదు రాజమ్మ. నువ్వు మా ఇంటిలో ఒకదానివి. నువ్వు రాకపోతే ఎలా? ఇది నేను చెప్పేది కాదు… సిద్ధు ఆర్డర్. ఇంకా నువ్వు కూడా రావాలి. అంతే! వెళ్ళి రెడీ అవ్వు పో.”
“రాజమ్మా… రాజమ్మా… నేను ఇక్కడ పిలుస్తుంటే నువ్వు అటువైపు చూస్తున్నావేంటి?”
రాజమ్మ చూస్తున్న వైపు చూసి… అందరూ అలా చూస్తూ ఉండిపోయారు.
రెడ్ కలర్ కుర్తా, క్రీమ్ కలర్ ధోతీ ప్యాంట్, ఒక చేతికి రోలెక్స్ వాచ్, ఇంకో చేతికి కడియం వేసుకుని, ఫోన్ చూసుకుంటూ స్టెప్స్ దిగుతున్నాడు సిద్ధు.
అమ్మాయిల రాకుమారుడిలా ఉన్న సిద్ధుని చూసి… ఎక్కడ కళ్ళు అరుస్తే ఆ క్షణం అద్భుతం మిస్ అవుతామో అన్నట్టు ఉన్నాడు మన
హీరో… సిద్ధార్థ్ వర్మ.
మన సిద్ధు గారు వాళ్ల అమ్మ ముందు వచ్చి…
“మా… ఏంటి అలా ఉండిపోయారు?”
“రాజమ్మ… వెళ్ళి ఎండు మిరపకాయలు, ఉప్పు తీసుకురా. నా కన్నాకి దిష్టి తీయాలి.”
“మా… నేను చిన్నపిల్లాడిని కాదు దిష్టి తీయడానికి.”
“కన్నా… నీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినా, నాకు మాత్రం నువ్వు చిన్నపిల్లాడివే.”
అంటూ తన కళ్ళకు ఉన్న కాటుక తీసి సిద్ధు ఎడమ చెవి వెనుక దిష్టి చుక్కగా పెట్టారు జానకి గారు.
“అన్నయ్యా… అన్నయ్యా… నువ్వు చిన్నపిల్లాడివి కదా! మరి పెళ్లి ఎందుకు చేస్తుంది
అమ్మా నీకు?”
“హాహా… అవును మహి. మంచి విషయం చెప్పావు.”
“రేయ్ చిన్నోడా… లేనిపోని ఐడియాలు ఇవ్వకు. అన్నయ్యకి పెళ్లి అయితేనే నీకు లైన్ క్లియర్ అవుతుంది. అది గుర్తుంచుకో ముందు.”
“అవును అమ్మ. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా అంటే నా వల్ల కాదు. అయినా నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కోరిక ఉంది. అసలే అన్నగారి వైపు మనకి ఎవరు పడటం లేదు. అన్నకి పెళ్లి అయితే నా వైపు చూస్తారు ఏమో… చూడాలి.”
“మహి… ఇంకా చాలు. వెళ్ళి కారు తియ్యి. టైం అవుతుంది. ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాలి.”
“సరే డాడీ.”
“జాను… నువ్వు కావలసినవి తీసి కారులో పెట్టించు.”
“సరే అండి.”
ఎవరి మాటల్లో వారు ఉన్నా… అదేం పట్టించుకోకుండా ఆలోచనలో మునిగిపోయిన సిద్ధుని గమనిస్తున్న రఘురాం గారు, వీళ్ళందరినీ పంపించి…
“నాన్నా సిద్ధూ… ఏం ఆలోచిస్తున్నావు?”
తర్వాత తన కొడుకు దగ్గరికి వచ్చి…
“ది డాడ్… సిద్ధూ, నీకు నేను నాన్నని. నీ గురించి నాకు తెలియదా? మనిషివి ఇక్కడ ఉన్నా… నీ మనసు ఇక్కడ లేదు.”
ఒక్కసారిగా వాళ్ల డాడీని హగ్ చేసుకుని…
“మార్నింగ్ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది డాడ్. ఎంత మరిచిపోదాం అనుకున్నా… నా వల్ల కావడం లేదు.”
“నువ్వే అంటున్నావ్ కదా బ్యాడ్ డ్రీమ్ అని. దాని గురించి వదిలేసి, ఈ రోజు నీ జీవితంలోకి అడుగుపెడుతున్న కోడలిపిల్ల గురించి ఆలోచించు.”
“హ్మ్… సరే డాడ్. మరి వెళ్దామా?”
“హా డాడ్.”
“జాను… అయిందా నీది?”
“హా అండి… వస్తున్నా.”
ఒకసారి హీరో గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం…
రఘురాం గారు — హీరో గారి తండ్రి.
జానకి గారు — హీరో గారి తల్లి.
మహేంద్ర — హీరో గారి తమ్ముడు.
రాజమ్మ — ఇంటి పనిమనిషి.
అని ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాం అనుకుంటున్నారా?
ఈమెతో మనకి చాలా అవసరం ఉంది.
ఇంకా ఉంది…
ఇదేనండి మన హీరో గారి పరిచయం.
నెక్స్ట్ అప్డేట్‌లో హీరోయిన్ గారు వస్తారు.
నా కొత్త స్టోరీ మ్యాక్స్ అందరికీ నచ్చేలా రాయడానికి ట్రై చేస్తా. ప్లీజ్… మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. ❤️❤️❤️
మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
Plz… ఇగ్నోర్ మిస్టేక్స్. 🙏
నా స్టోరీస్ నచ్చితే నన్ను ఫాలో చేయండి. ❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages