New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
చూపులు కలిసిన వేళ – 3

చూపులు కలిసిన వేళ – 3

ఇంట్లో తలుపులకి జాగ్రత్తగా తాళాలు వేసి

నువ్వు ఆటోలు వచ్చేయ్.
  బామ్మ గారు గీత గారి నీ కూడా మనతో తీసుకు వెళ్లొచ్చు కదా …. !
లేదు బాబు గీతకి కారు పడదు వాంతులు అవుతాయి ఆటోలో వచ్చేస్తుందిలే, అయినా దానికి అలవాటే…. ఏమే గీత కార్లో వస్తావా….? 
లేదు అమ్మమ్మ  నాకు కారు పడదు కదా ఆటోలోనే వస్తాలే మీరు బయలుదేరండి….!!!
బాబు బయలుదేరుదామా.
సరే బామ్మ  అంటూ కార్ స్టార్ట్ చేసి  ( ఇదే ఎక్కడ ముసలదో వచ్చిన దగ్గిర నుండి  చూస్తున్న ఆ అమ్మాయిని తిడుతూనే ఉంది. 
ఏందో ప్రక్కన కూర్చుంటే ఏదో కాస్త కూస్తో  లైన్లో పెట్టుకునేవాడిని మొత్తం చెడగొట్టేసింది ముసలిది.అలా మనుసులో తిట్టుకుంటూనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు మహి.
కారు వెళ్లే వరకు  అక్కడే ఉన్నా…. గీత   తర్వాత లోపలికి వెళ్లి, తనకు కావలసిన వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ లో సర్దుకుని.  వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టు, ఇంటికి తాళాలు వేసుకొని, ఆటోలో ఫంక్షన్ హాల్ కి బయలుదేరింది.
**********************
కార్ డ్రైవ్ చేస్తు  తన ఆలోచనలో ఉన్న మహికి  రఘురాం గారు ఫంక్షన్ హాల్ కి వచ్చేముందు కాల్ చెయ్యమన్న విషయం మర్చిపోయాడు. 
ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్దాం పదండి.
వచ్చే అతిధులను  ప్రతి ఒక్కరినీ దగ్గర ఉండి. ఆహ్వానిస్తున్నారు. ఇరువురి దంపతులు….!!
రూమ్ లో కి  వెళ్ళిన సిద్ధూ…..తన ప్రాణ స్నేహితుడు అయినా అంకిత్ కి కాల్ చేసాడు. ఇంకా రాలేదు ఏంటి అని..,….!!!
రేయ్ అంకిత్ ఎక్కడున్నావ్…? ఎప్పుడు వస్తున్నావ్…? అసలు ఇంకా ఎందుకు రాలేదు రా…..?? 
రేయ్ మామ ఆగరా  ఆగకుండా  ప్రశ్నలు, వేస్తే నేను ఎప్పుడు రా ఆన్సర్ చేసేది….!! 
సర్లే ఏడవకు ఇప్పుడు చెప్పు ఇంకా ఎందుకు రాలేదు….
అది కాదురా, మామ బాబుకి, హెల్త్ బాలేదు. అందుకే రావడం కుదరలేదు ప్లీజ్ ఏమ్ అనుకోకు కన్ఫామ్ గా వస్తాను……..!!! 
అసలే ఉదయం వచ్చిన కల వల్ల డిస్టర్బ్ గా ఉన్నా సిద్దు కి  అంకిత్   బాబు బాలేదు అనేసరికి కంగారుగా ఏమ్ అయింది రా బాబుకి..!
సిద్దు గొంతులో కంగారు గమనించిన. అంకిత్  రేయ్ మామ ఏమ్ కాలేదు  రా వైరల్ ఫీవర్ అంటారా. నేను లేకపోతే వాడు ఏడుస్తాడు అన్ని రాలేదు…..
హ్మ్మ్ సరే జాగ్రత్తగా చూసుకోండి….!! 
సరే మామ ఇంకా ఉంటా….
అలాగే బాయ్   రా బాబు జాగర్త 
హా ఒకే రా
ఇంకా ఫంక్షన్ కి టైం ఉండేసరికి తన లాప్టాప్ తీసుకొని ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేశాడు. సిద్దు కి  లాప్టాప్ ఎక్కడిది అనుకోకండి సిద్దు దగ్గర ఎప్పుడు లాప్టాప్ ఉంటుంది.
@@@@@@@@@@@@
కార్లో కూర్చున్న అన్విత కోటీశ్వరుడు.  ఇంటి కి కోడలు అవుతున్నందుకు. తన అదృష్టానికి తానే సంబరం పడిపోతుంది. (ఒక విధంగా  చెప్పాలంటే గాల్లో విహరిస్తుందన్నమాట
ఫంక్షన్ హాల్ కి వచ్చేసరికి ఊహల్లో విహరిస్తున్న  తన ఊహకి  బ్రేక్ చెప్పి  కాస్త వినయంగా కారు దిగింది.(మరి సిగ్గు పడాలి కదా)
  • పెళ్ళికూతురు వాళ్ళు రావడంతో లోపల అతిథులు నీ ఆహ్వానిస్తున్న…!! రఘురాం గారు, జాను గారు , బయటకు వచ్చి వాళ్ళని మర్యాద గా , లోపలికి తీసుకెళ్తున్నారు.
(జాను గారు కోడలు పిల్లా కి దిష్టి తీశారు లెండి.)
మన మహి తన స్వప్న లోకం సుందరిని కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. ఈలోపు తన  భుజం మీద చెయ్య పడేసరికి ప్రక్కకి తిరిగేసరికి రఘురాం గారు సీరియస్ టోన్ తో నీకేం చెప్పాను  నువ్వేం చేసావ్…..???
ఏం చెప్పారు నాన్న అయోమయం ఫేస్ తో….!! 
మర్చిపోయావా ఫంక్షన్ హాల్ కి వచ్చే ముందు ఫోన్ చేయమని చెప్పాను లేదా…..?అయ్యో సారీ నాన్న మర్చిపోయాను… !!
ఇంటికి వెళ్ళాక చెప్తారా నీ పని ఇప్పుడు కాదు… సరే పద లోపలికి ఇక్కడ ఉండి ఏం చేస్తావ్…
మీరు పదండి నాన్న  ఫ్రెండ్ వస్తా అన్నాడు  వాడి కోసం వెయిట్ చేస్తున్నా 
వచ్చిన వాడు లోపలకి వస్తాడు పద ముహూర్తానికి టైం అవుతుంది అన్నయ్య  రూమ్ లో ఉన్నాడు వెళ్లు తీసుకురా.
మహి వెనక్కి తిరిగి చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు.
సిద్దు ఉన్న రూమ్ లోకి వెళ్లి అబ్బా అన్నయ్య ఇక్కడ కూడా ఆఫీస్ వర్క్ ఏనా అయినా ఈరోజు నీ ఎంగేజ్మెంట్  దాని పక్కన పడేసి వదిన కోసం వెయిట్ చేయకుండా ఏంటి అన్నయ్య నువ్వు ….
రేయ్ మహి ఇంకా చాలు ఆపు సీరియస్ టోన్ తో….
సర్లే బాబు ఎప్పుడు ఏదో పచ్చిమిర్చి తిన్న కాకి ల అరవకుండా  షుగర్ తిన్న  రామచిలుక ల తీయని పలుకులు పలుకు  
రేయ్……హా అదే నాన్న పిలుస్తున్నారు ముహూర్తం టైం అవుతుంది అంట నువ్వు ఆ లాప్టాప్ ఆఫ్ చేసి వస్తే బాగుంటుంది నీ కోసం వదిన  వెయిటింగ్  చేస్తున్నారు
సిద్దు చేసినా వర్క్ నీ   సేవ్ చేసి లాప్టాప్ ని క్లోజ్ చేసి మహి తో బయటికి వచ్చాడు.
సిద్దు అన్విత స్టేజ్ మీదకి రావడంతో పంతులు గారు సాంప్రదాయం ప్రకారంగా పూజ చేసి ఇరువురి కుటుంబం చేత తాంబూలం ఇప్పి చ్చి అక్కడే  ఉన్న ఎంగేజ్మెంట్ కోసం తీసుకున్న రింగ్స్ ని తీసుకొని బాబు నువ్వు అమ్మాయికి పెట్టు అమ్మ నువ్వు అబ్బాయికి పెట్టు అని ఇద్దరికీ చేరో క ఉంగరం చేతికి ఇచ్చారు.
అన్విత పాప మాత్రం తెగ సిగ్గు పడిపోతూ సిద్ధు చేతికి ఉంగరం పెట్టింది అలానే సిద్ధూ కి తెలియని అలజడి తో అన్వి చేతికి కి ఉంగరం పెట్టడం….!!!! 
గీత ఫంక్షన్ హాల్ లో కి  రావడం ఒకేసారి జరిగింది.గీత ఫంక్షన్ హాల్ లోపల కి  వస్తూ   తన వాళ్ళు స్టేజ్ మీద ఉండడంతో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది.
సిద్దు అన్విత ఫొటోస్ కి స్టిల్స్ ఇవ్వడం లో బిజీ ఉన్నారు  అప్పుడే సిద్దు  ఫోన్ కి  కాల్ రావడంతో కాల్ మాట్లాడి వస్తానని చెప్పి ప్రక్కకి  సిద్దు  అలా వెళ్లడం గీత స్టేజ్ మీద రావడం ఒక్కసారే జరుగుతుంది.
ఫోన్ మాట్లాడుతున్న   సిద్దు కి దగ్గర్లో తనకి కావాల్సింది ఉన్నట్టు మనసు కి అనిపిస్తుంటే చుట్టూ  ఒకసారి చూశాడు అక్కడే దగ్గరలో ఒక స్తంభం వెనుక ఓ బాబు తొంగి తొంగి చూడడం చూసి  తనకే తెలియకుండా తన అడుగులు వేయడం మొదలుపెట్టి ఆ బాబు కూడా అతను రావడం చూసి తనని రమ్మని సైగ చేస్తున్నాడు బాబు ఎదురు నుంచున్న సిద్దు. నీ  ఫాంట్ పట్టుకొని కిందకి లాగడంతో మోకాలు మీద కూర్చొని బాబు చెంప మీద చెయ్యి వేసి తదేకంగా చూస్తూ ఉన్న సిద్దు కి టక్కున బుగ్గన ముద్దు పెట్టి పారిపోయాడు. బాబు
బాబు ముద్దు పెట్టిన వెంటనే సిద్దు తను వెళ్ళి పోవడంతో తన వెనకే వెళ్ళాడు
బాబు తన చిన్ని చిన్ని పాదాలతో పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మమ్మ వెనక దాక్కున్నాడు సిద్దు బాబును ఫాలో అవుతూ వాళ్ళ అమ్మమ్మ వెనుక దాగున్న బాబు నీ చూస్తూ ఉన్నాడు
అయ్యో అల్లుడు గారు  ఏంటి అలా చూస్తున్నారు బాబు ఏమన్నా  అల్లరి చేశాడా .,.,.
లేదు అత్తయ్య గారు ఆ బాబు ఎవరో అని చూస్తున్నా తను నన్ను పిలిచి బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోయి వచ్చాడు మీ దగ్గరికి  నేను ఏమ్మ న్నా అంటాను అని భయపడి వచ్చినట్టు ఉన్నాడు.
ఏంటి బాబు మీరు అనేది బాబు ఏంటి మిమ్మల్ని పిలవడం ఏంటి
పిలిచి ముద్దు పెట్టాడు నేనేమన్నా అంటానేమో అని భయపడి వచ్చాడు
బాబు వాళ్ళ అమ్మమ్మ ఆశ్చర్యంతో బాబు మీరు ఏదో పొరపడి నట్టున్నారు తన పిలవడం ఏంటి  వాడికి మాటలు రావు కదా
ఏం మాట్లాడుతున్నారు  అత్తయ్య బాబు  కి మాట్లాడకపోవడం ఏంటి? అయినా ఆ బాబు ఎవరు   ఆ బాబు మీకేమవుతారు…..??
ఇంకా ఉంది:
తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి.