మానసచోరుడు❤️🔥 – 1
🩸 రక్తంతో రాసిన చరిత్రకు వారసుడు అతను… 👑
🥀 కన్నీళ్లతోనైనా ఓ ప్రాణాన్ని కాపాడాలనుకునేంత కోమలమైన మనసు ఆమెది… ❤️
🌑 చీకటినే తన కిరీటంగా చేసుకుని ఓ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి అతను… 👑
🌙 అదే చీకటి తన చుట్టూ కమ్ముకుంటే అడుగు ముందుకు వేయలేని వెన్నెలలాంటి అమ్మాయి ఆమె… ❤️
👁️ కనుచూపుతోనే ఓ ప్రపంచాన్ని శాసించగల సామ్రాట్ అతను…
🌸 అమాయకపు చూపులతోనే చూపరుల మనసులను దోచుకునే సుకుమారి ఆమె…
🖤 అతని గంభీరమైన గొంతు వినిపిస్తే శత్రువుల గుండెల్లోనే వణుకు పుడుతుంది…
🪷 ఆమె కోమలమైన గొంతు వినిపిస్తే మాత్రం ఆ కన్నయ్య సన్నిధిలో భక్తి పరిమళిస్తుంది… 🦚
🔫 నిత్యం తుపాకులతో సావాసం చేస్తూ, రక్తాన్ని చూసినా చలించని రాక్షసుడు అతను…
🥺 రక్తం అనే మాట విన్నా గుండె దడపడేంత సున్నితమైన మనసు ఆమెది…
👑 అందనంత ఎత్తులో అతను ఉంటే…
🌷 అందెంత దూరంలో ఆమె…
🌌 ఇలాంటి రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ప్రేమ అనే బంధం ఎలా ఏర్పడుతుంది…? ❤️🔥
🎶 తన కనుచూపుతో ప్రపంచాన్ని శాసించే ఆ సామ్రాట్‌ను…
🌸 ఈ కోమలాంగి తన సుమధురమైన స్వరంతో, కోలకళ్లతో ఎలా ఆకట్టుకుంటుంది…?
💞 అతని హృదయ సామ్రాజ్యానికి పట్టపురాణిగా ఆమె ఎలా మారుతుంది…? 👑
🔫 నిత్యం తుపాకులతోనే సావాసం చేసే ఆ మాన్స్టర్…
🥀 రక్తం చూస్తేనే తట్టుకోలేని ఈ సుకుమారిని నిజంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తాడా…?
🤫 కానీ… ఈ ప్రేమకథ వెనుక ఎవరికీ తెలియని ఓ నిజం దాగుంది… 🖤
👩👦 తనకే తెలియకుండా తన బిడ్డను ఒడిలో పెంచుకుంటున్న ఈ కోమలాంగి ఎవరు…?
💔 ఆ బిడ్డకు తండ్రి…
❤️🔥 తన మనసును దోచుకున్న ఆ మానసచోరుడే అని ఆమెకు తెలిస్తే…?
⚡ తానే ఆ బిడ్డకు తండ్రినని ఆ మాన్స్టర్‌కు తెలిస్తే…?
🌪️ అప్పుడు అతని చీకటి సామ్రాజ్యంలో ఎలాంటి తుఫాను చెలరేగుతుంది…?
❤️ ఆమె తన ప్రేమను ఎంచుకుంటుందా…?
👩👦 లేక తన బిడ్డ భవిష్యత్తు కోసం అతనికి శాశ్వతంగా దూరమవుతుందా…?
🖤 ఇది ప్రేమకు…
⏳ విధికి…
🥀 గతానికి మధ్య సాగే ఓ అసాధారణ పోరాటం… ❤️🔥
🌿🌿🌷🌷🌿🌿🌷🌷🌿🌿
ముంబై మహానగరం…
వెలుగుల వెనుక చీకటి సామ్రాజ్యాలను శ్వాసించే నగరం.
మాఫియా అనే మాటకు మరో పేరు లాగా నిలిచే ఈ మహానగరంలో…
ఒక పేరు మోసిన పబ్‌కి చెందిన అండర్‌గ్రౌండ్‌లో, నగరానికి తెలియని ఓ చీకటి సమావేశం మొదలైంది.
టేబుల్‌పై అక్రమ డ్రగ్స్… పక్కనే ఆయుధాలు…
వాటి మధ్య కోట్ల రూపాయల డీల్ గురించి చర్చ జరుగుతోంది.
పెద్ద టేబుల్ చుట్టూ కూర్చున్న కొందరు వ్యక్తులు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు.
దామోదర్: ఏంటి! వాడు లేని టైమ్‌లో మీటింగ్ పెట్టారు? ఈ విషయం కానీ డెవిల్‌కి తెలిస్తే, ఇక్కడున్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్లరు. జాగ్రత్త!
అంటూ అక్కడున్న వాళ్లందరినీ హెచ్చరించి, తన అసిస్టెంట్‌తో కలిసి బయటికి వెళ్లిపోయాడు.
అతను వెళ్లగానే అక్కడున్న ఒక వ్యక్తి వెటకారంగా నవ్వాడు.
మెంబర్ 2: ఈయన ఏంటి? ఏదో డెవిల్ అంట! ఈ సామ్రాజ్యానికి రాజు, పెద్ద కింగ్ అని మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నాడా?
మెంబర్ 6: ఉష్! నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఈ మాటలు గుణ వింటే, డెవిల్ కంటే ముందే నీ నాలుకను నీ చేతిలో పెడతాడు. జాగ్రత్త!
మెంబర్ 3: ఆపవయ్యా! ఏదో అతను రాక్షసుడు అన్నట్టు మాట్లాడుతున్నావ్. ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ మాఫియాని ఏలుతున్నాం. మొన్న వచ్చిన ఆ పిల్ల బచ్చ కోసం ఇంత బిల్డప్ అవసరమా?
మెంబర్ 8: మరే! ఇంత అనుభవం ఉన్న మనం ఆ బచ్చ మాట విని డ్రగ్స్ బిజినెస్ ఆపేయాలట!
మెంబర్ 11: అసలు మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేదే ఈ డ్రగ్స్ వల్ల. అలాంటప్పుడు ఈ బిజినెస్ ఎలా ఆపేస్తాం?
మెంబర్ 1: మనం ఇక్కడికి వచ్చిన విషయం తప్ప మిగతావన్నీ మాట్లాడుతున్నారు మీరు!
అంటూ అందరినీ వారించాడు.
మెంబర్ 9: ముందు నేను చెప్పేది వినండి. ఈ జియాజ్ వరల్డ్ వైడ్‌గా డ్రగ్స్ బిజినెస్, వెపన్స్ డీలింగ్ చేస్తున్న వాళ్లందరికీ డిస్ట్రిబ్యూటర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఇతనికి తెలియని డ్రగ్ ఫార్ములా లేదు. పాతకాలం నుంచి లేటెస్ట్ వరకు ఉన్న వెపన్స్ గురించి కూడా అన్నీ తెలుసు. మన బిజినెస్‌కి ఇతను చాలా అవసరం.
మెంబర్ 2: సరేనయ్యా! అన్నీ ఓకే. కానీ మన బిజినెస్‌కి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఆ విషయం మాత్రం గుర్తుంచుకోండి.
మెంబర్ 3: నా ఇన్వెస్ట్‌మెంట్ పాతిక కోట్లు!
మెంబర్ 1: నా ఇన్వెస్ట్‌మెంట్ కూడా పాతిక కోట్లు!
ఒక్కొక్కరుగా తమ పెట్టుబడుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
లాభాల లెక్కల్లో మునిగిపోయిన వాళ్లకు…
తమ జీవితాలనే తలకిందులు చేయబోయే ఓ తుఫాను అప్పటికే తమవైపు దూసుకొస్తోందని తెలియదు.
వాళ్లకు కావాల్సింది డబ్బు.
ఆ డబ్బు సంపాదించడానికి ఎలాంటి హద్దులైనా దాటడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ ఒక విషయం మర్చిపోయారు.
వాళ్లు ఆడుతున్న ఆటకు నియమాలు పెట్టేది వాళ్లు కాదు! అని
అందరూ తమ డీల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందని సంబరపడుతున్న సమయంలో…
ధడేల్!
అని శబ్దం
కొనసాగుతుంది.
Swipe left/right or tap the sides to turn pages