New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 12

నా చిలిపి బావ – 12

పెళ్ళికి ఇంకొక్క రోజు మాత్రమే ఉండడంతో వియ్యపురాలు పిలుస్తోందని కలిసి వస్తానని కాంతమ్మకి చెప్పి సంయుక్త ని తీసుకుని సంయుక్త వాళ్ళ అమ్మగారు విడిది ఇంటికి బయలుదేరింది..

 

ఇప్పుడు ఎందుకమ్మా అక్కడికి….

 

మీ అత్త ఏదో మాట్లాడాలని పిలిస్తే వెళ్తున్నాను…. నువ్వేదో రాళ్లు కొట్టడానికి వస్తున్నట్టుగా ఫీల్ అవుతావ్ ఏంటి….

 

వాళ్ళ అమ్మ వెటకారానికి మూతి తిప్పుకుంటూ సంయుక్త తల్లి వెనుక విడిది ఇంటికి వెళ్లి తల్లిని ఒక క్షణం కూడా వదలకుండా అంటిపెట్టుకుంది….

 

శ్రావణి వాళ్ళ అమ్మగారు ఆడపడుచుని తీసుకుని తన గదిలోకి వెళ్లి నగలు ఏవో చూపిస్తూ ఉంటే అక్కడ కూర్చుని బోర్ కొడుతూ ఉండడంతో శ్రావణి ఫ్రెండ్స్ కనపడితే వాళ్ళతో మాట్లాడడానికి బయటికి వచ్చేసింది సంయుక్త….

 

వదిన ఈ నక్లెస్ చూసావా అంటూ మొత్తం గోల్డ్ తో తయారు చేసి లాకెట్ మాత్రం ఎరుపు ఆకుపచ్చ రాళ్లతో అందంగా ఉన్న గోల్డ్ నక్లెస్ చూపించడంతో చాలా బాగుంది వదిన అంది సంయుక్త వాళ్ళ అమ్మ…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue