విదేశాలు తిరిగి వచ్చాక చాలా అల్లరి పిల్లాడి లాగా తయారయ్యావు…
అత్తయ్య నవ్వుతూ అన్న మాటకి అర్జున్ నవ్వుతూ సంయుక్త నవ్వుతూ సంయుక్త వైపు చూశాడు….
ఆమె మాత్రం అతని వైపు చూడకుండా తన ప్లేట్లో ఉన్న చికెన్ గారెలు లాగించడంలో బిజీ అయిపోయింది….
దీనికి తిండి మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద ఉంటే బాగుండేది…. కాలేజీలో అమ్మాయిల దగ్గరనుంచి ఈరోజు దీని ఫ్రెండ్స్ వరకు నాకు సైట్ కొడుతుంటే ఇది మాత్రం గారెలు కుమ్ముతోంది….
మనవరాలిని కోపంగా చూస్తే మైండ్ వాయిస్ వేసుకుంటున్న మనవడిని గమనించి దాన్ని చూస్తే కడుపు నిండదురా… తింటే కడుతుంది….
అర్జున్ దెబ్బకి నానమ్మ వైపు చూసి నాని అని అరవడంతో అదే రా ప్లేట్ వైపు చూస్తే కడుపు నిండదు ప్లేట్లో ఉన్నది తింటే కడుపు నిండుతుంది అంటున్నాను….