నా చిలిపి బావ – 2
దాంతో చేసేది ఏమీ లేక బయటకి వచ్చేసరికి అతను కారులో కూర్చుని వెయిట్ చేస్తూ ఉండడంతో వెళ్లి అతని పక్కన కూర్చోడంతో అతను కార్ స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ఏమైనా అల్లరి చేస్తాడేమోనని కంగారుగా కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుండిపోయింది….
అనుకున్నట్టుగా వెళ్లి కావాల్సిన వస్తువులన్నీ తిరిగి తీసుకొస్తూ ఉండగా ఆమె చేయి అతని చేతిలో బంది కావడంతో కంగారుగా అతని వైపు చూస్తూ ఉంటే “బబుల్గం ఏమైనా నములుతున్నావా?” అని అడగడంతో లేదని కొండపల్లి బొమ్మలాగా తలాడించింది…
“మరెందుకు ఇందాకటి నుంచి మూగ దయ్యం లాగా కూర్చున్నావు?” అనగానే ఆమె మూతి ముడుచుకుని “మరి ఇంకేం చేయాలి?” అంటూ ఉంటే “బావా కోవా అని ఏదో ఒకటి పిలిచి మాట్లాడొచ్చు కదా” అన్నాడు…
“ఇది నువ్వు నువ్వే నా బావ?” అని అడగడంతో అతను అద్దంలో తనని తాను చూసుకుని “ఇంకేమైనా మొహం కనిపిస్తోందా?” అని అడగడంతో “కాదు… పారిస్ నుంచి వచ్చాక తమరు అసలు నా మొహం కూడా చూడలేదు…. ఇప్పుడేమో అలా చేస్తున్నావ్?” అనగానే “ఎలా?” అన్నాడు….
తన నోటితో చెప్పించడానికి కావాలని వేషాలు పడుతున్నాడని అర్థం కావడంతో “ఏమీ లేదు…. ఇంట్లో అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దామని” అనగానే సడన్ బ్రేక్ తో అతను కార్ ఆపడంతో “ఏమైందని?” కంగారుగా అడిగేసరికి “సమాధానం చెప్పకుండా మాట దాటేస్తావేంటి?” అన్నాడు…..
“ఏం సమాధానం చెప్పాలని?” అయోమయంలో అడగడంతో “ఏదో కొత్తగా ప్రవర్తిస్తున్నానని అన్నావు కదా…. ఏం కొత్తదనం ఉందో చెప్పు” అనగానే “నీకు తెలియదా బావ?” అని కోపంగా అడిగేసరికి “తెలీదు మరదలా… నువ్వు చెబితే తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని లంగా వోని వేసుకున్న ఆమె ఏ అచ్చాధనా లేని నడుం మీద వేళ్ళతో మీటాడు….
ఒక్కసారిగా కూర్చున్న సీట్లో నుంచి ఒక జంప్ చేసి “ఇలా అల్లరి చేయకు బావ” అని కంగారుగా అనగానే “నేను ఇంకా పూర్తిగా నా అల్లరి చూపించక ముందే ఇలా భయపడి చస్తే ముందు ముందు ఏమైపోతావో” అన్నాడు…
“కాదు మొదట ఇంట్లో గుర్తులేని బీరకాయ పీచు చుట్టాలను కూడా పలకరించిన నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేశావు… ఇప్పుడెందుకు స్టోర్ రూమ్ లో ముద్దు పెట్టడం ఇక్కడ టచ్ చేయడం” అనగానే “ఓల్డ్ తెలుగు మూవీస్ లో చూపించినట్టు నన్ను చూడగానే బావ అని పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుంటావని అనుకుంటే అసలు నీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని సైలెంట్ గా ఉన్నాను” అన్నాడు….
“మరిప్పుడు ఎందుకు అల్లరి చేస్తున్నావ్?” అనగానే “నేను కూడా సైలెంట్ గా ఉంటే నువ్వు జీవితాంతం అలాగే ఉండేలా ఉన్నావని నాలో ఉన్న లీలలు అన్ని చూపిస్తున్నాను” అని అతను కళ్ళు కొట్టాడు….
ఆరున్నర అడుగుల అందంతో రోజు కసరత్తులు చేయడానికి గుర్తుగా దృఢంగా ఉన్న శరీరంతో చేతుల్లో నరాలు తేలి అతని మ్యాన్లీ పర్సనాలిటీ అర్థమయ్యేలా చేస్తూ ఉంటే కోరమీసం చురుకుగా ఉన్న కళ్ళు అందంగా ఉన్న మొహం తో ఉన్న అతన్ని చూసి గుటకలు మింగుతూ పక్కకు చూసింది….
కాసేపటికి ఇల్లు రావడంతో “వచ్చేసారా?” అంటూ వాళ్ళ నాన్నగారు ఎదురు రావడంతో “వచ్చేసాను నాన్న” అంటూ బావ వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది….
“ఏరా అర్జున్…. అన్ని దొరికాయా?” అనగానే “అన్నీ దొరికాయి మావయ్య” అంటూ అర్జున్ పండ్లతో పాటు పసుపు కుంకుమ కూడా తీసుకొచ్చి తనకంటే ముందు వచ్చిన తన ముద్దుల మరదలు సంయుక్త ఎప్పటిలాగా వాళ్ళ నాన్నమ్మతో గొడవ పడుతూ కనిపించడంతో చిన్నగా పెదవులు సాగదీసి లోపలికి వచ్చాడు…..
తన పక్కనే మనవరాలు కూర్చుని గొడవ పడుతూ ఉంటే ఆమె పక్కన వచ్చి మనవడు కూర్చోడంతో “ఏరా బంగారం అలసి పోయావా?” అనగానే ముసలి అని కోపంగా చూస్తూ “నీ మనవడు మాత్రమే కాదు నేను కూడా బయటికి వెళ్లాను” అనగానే “నువ్వు ఊరికే ఏసీ కార్లో కూర్చోడమే కదా… పాపం వాడు నడపాలి అవన్నీ మోసుకుని రావాలి” అంది….
ఆ మాటకి పెదవులు బిగించి బుసలు కొడుతున్న మరదల్ని కనురెప్ప కొట్టకుండా అర్జున్ చూస్తూ ఉంటే “నీ మనవడు ఏమీ ఎండలో ఎడ్ల బండి తోలుకొని రాలేదు… వాడు కూడా సారీ సారీ నీ మనవడు కూడా ఏసీ కార్లోనే వచ్చాడని” వెటకారంగా చెప్పడంతో “అయితే ఏంటి ఎలా చూసుకుని నీకంటే కొంచెం కష్టం వాడికే ఉంది కదా” అంది….
“తెల్లవారు లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నీ మనవడి జపం చేసుకుంటూ ఉండు” అని కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళుతున్న ఆమెని చూస్తున్న మనవడిని చూసి ముసి ముసిగా నవ్వుకుంటూ “నచ్చిందా?” అని అడగడంతో ఉలిక్కిపడి “ఏంటి?” అన్నాడు….
“అదేరా నీ మరదలు” అనగానే “ఏం మాట్లాడుతున్నావ్ నానమ్మ?” అంటూ ఉంటే “కాదురా నీ మరదలి మాట తీరు బాగుందా అంటున్నాను” అనగానే “కాస్త అల్లరి పిల్లగాని మంచిదే” అనగానే “ఆహా” అంది….
కంటిన్యూస్!!!
Swipe left/right or tap the sides to turn pages