నా చిలిపి బావ – 1
“ఎంతసేపే!!!! పువ్వులు తీసుకురావడానికి ఇంత టైం పడుతుందా?” అని బయట నుంచి అరుస్తున్న తల్లి అరుపులకి ‘లైట్లేని స్టోర్ రూమ్ లోకి పంపించి త్వరగా కావాలంటే ఏం చేయమంటావు నా బొంద’ అని కోపంగా చూస్తూ అక్కడ ఉన్న ప్రతి వస్తువు టచ్ చేసి చూస్తుంది….
అక్కడ ఉన్న ప్లేట్స్ లో ఉన్న పదార్థాలను బట్టి ఒకదాంట్లో పసుపు ఒకదాంట్లో కుంకుమ, మరొక దాంట్లో పెళ్ళికి పెట్టాల్సిన బట్టలు, ఇంకొక దాంట్లో ఏమో నగలు కనిపించడంతో ‘మా అమ్మే…. నగలు ఇలా ఓపెన్ గా స్టోర్ రూమ్ లో పెట్టింది చూడు’ అని తిట్టుకుంటుంది 24 ఏళ్ల అమ్మాయి…..
వెనక్కి తిరిగే క్రమంలో కాలుకి కొబ్బరి బోండాలు తట్టుకుని వెనక్కి పడబోతుంటే ఆమె నడుముకి ఆసరాగా పడతాయి రెండు చేతులు….
ఏ అచ్చాధనాలేని లంగా వోని వేసుకున్న తన నడుము మీద పడిన చేతుల స్పర్శకి ఒక్కసారిగా ఉలిక్కిపడి తల తిప్పి చూడడంతో వెంటిలేటర్ వెలుతురులో అతని జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది కానీ తన వైపు తిరిగి ఉండడంతో వెనుక నుంచి పడుతున్న వెంటిలేటర్ వెల్తురుకి అతని మొహం కనిపించదు…..
ఆమె గొంతులో గుటకలు పడుతూ ఉండగానే నెమ్మదిగా అతను దగ్గర అయ్యి ఆమె పెదవులని అందుకుంటాడు….
మళ్లీ ఇంకొకసారి వాళ్ళ అమ్మ గొంతు వినిపించడంతో ఆమెని సరిగ్గా నిలబెట్టి అతను బయటికి వెళ్లడంతో అతను వేసుకున్న చొక్కాబట్టి అతను ఎవరు అన్నది అర్థం కావడంతో కళ్ళు మిటకరించి చూస్తూ కింద పెదవి ముడుచుకుంటుంది….
కాస్త వెనక్కి తిరిగి పైన ఉన్న పూల పళ్లెం తీసుకుని ‘ఇవన్నీ ఎవడైనా స్టోర్ రూమ్ లో పెట్టుకుంటారా?’ అని కోపంగా బయటికి వచ్చి విసురుగా వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి వెళ్లబోతుంటే “ఎందుకే అంత కోపం?” అంటుంది….
“స్టోర్ రూమ్ లో పెట్టాల్సిన వస్తువులు హాల్లో పెట్టుకొని హాల్లో బెడ్రూంలో పెట్టాల్సిన వస్తువులు స్టోర్ రూమ్ లో పెట్టావని” కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంటే “ఒక నిమిషం ఆగవే” అని వాళ్ళ అమ్మమ్మ పిలవడంతో వెనక్కి తిరిగిన ఆమె పెదవి వైపు చూస్తూ “గండు చీమకుట్టినట్టు పెదవి ఉబ్బిపోయిందేంటి?” అంటుంది ఆవిడ….
దాంతో ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి ‘అమ్మ ముసలి…. ఈ వయసులో కూడా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయని’ అనుకుంటూ “అందర్నీ బెదిరించి మా అన్నయ్యకి పెళ్లి జరిగే వరకు హింసించావు… ఇప్పుడు చూస్తే గుండ్రాయిలాగా కూర్చొని అందరికీ ఆర్డర్లు వేస్తున్నావని” అనగానే పెద్ద ఆవిడ మూతి ముడుచుకోవడంతో “స్టోర్ రూమ్ లోకి వెళ్తే గండుచిమ ఏంటి పందికొక్కులు ఎలకలు కూడా కరుస్తాయి” అంటున్న ఆమె నెత్తి మీద టప్పున ఎదో పడ్డంతో అమ్మ అని అరుస్తూ తలపైకెత్తి చూస్తుంది….
‘నేను నీకు ఎలక లాగా కనిపిస్తున్నానా?’ అన్నట్టుగా అతను చూస్తున్న చూపుకి మొహం నల్లగా పెట్టుకుంటే “ఏమైందే?” అనగానే “పైనుంచి నెత్తి మీద ఏదో పడింది” అనగానే “ఏదో కాదు… ఎండిపోయిన కొబ్బరి టెంక పడింది” అని అక్కడే తనకి కాబోయే వదిన కూర్చొని ఉండి కింద పడిన టెంకవైపు చూపిస్తూ చెబుతుంది…..
ఇంతలోనే వాళ్ళ నాన్నగారు మావయ్య లోపలికి రావడంతో ఆమె లోపలికి వెళ్ళిపోతే ఇంకా పెద్ద వాళ్ళు మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండిపోతారు….
‘నిజంగానే నాకు ముద్దు పెట్టాడా?’ అని ఆమె నోట్లో వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటేనే అక్క అంటూ పిల్లలు తన చుట్టూ చేరడంతో ఏంటే అని వాళ్ళందరినీ చూడగానే “ఏమైనా ఆడుకుందాం… బోర్ కొడుతోంది” అనగానే “ఆడుకోవాలని ఉన్నా కూడా ఆడుకునే వయసు నాది కాదమ్మా…. పైగా మొన్నటి వరకు కుటుంబాన్ని విడదీస్తానని కళ్ళు పెద్దవి ఇప్పుడు ఆర్డర్లు వేస్తోంది చూడు… ఆవిడ గనుక నేను ఆడటం చూసింది అనుకో… మళ్లీ నా పెళ్లి చేయడానికి ఇంకొక నాటకం ఆడుతుంది” అని చెబుతుంది ఆ అమ్మాయి….
పిల్లలందరూ నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో మళ్లీ ముద్దు గురించి ఆలోచిస్తూ ఉంటుంది పాప….
“చిన్ని చిన్ని” అని వాళ్ళ నాన్నగారు పిలుస్తున్న కూడా ఈ ప్రపంచంలో లేకుండా ఆలోచిస్తున్నా మనవరాలి తల మీద ఒక దెబ్బ వేసి “మీ నాన్నగారు పిలుస్తుంటే ఎక్కడ తప్పిపోయావే” అని వాళ్ళ అమ్మమ్మ కొట్టిన దెబ్బకి కొరకోర చూస్తూ “ఏంటి నాన్న?” అంటూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది…
“బావతోపాటు బయటికి వెళ్లి అరటిపండ్లు తీసుకుని రా” అని చెప్పడంతో ఆమె కళ్ళు పెద్దగా చేసి “ఏంటి బావతో పాటు వెళ్లాలా?” అంటుంది…
“అవునమ్మా!!! ఏమైంది!? ఏమైనా సమస్య!?” అని అడిగాడు ఆయన…
ఆమె గుటకలు మింగుతూ “అంటే నాన్న” అంటూ ఉంటే “త్వరగా వెళ్లవే…. టైం లేదు” అని ఒక వైపు నుంచి వాళ్ళ పిన్ని కేకలు వేస్తూ ఉండడంతో “ఇంకెవరినైనా పంపొచ్చు కదా పిన్ని… శ్రీను అన్నయ్య ఉన్నాడు కదా” అనగానే “వాడు ఇందాకే పసుపు కుంకుమ తక్కువ పడితే తీసుకురావడానికి వెళ్ళాడు” అని చెప్పింది…
“స్టోర్ రూమ్ లో చాలా పసుపు కుంకుమ ఉంది కదా!! మళ్లీ ఎందుకు పంపించావని” అడగడంతో “అది పూజకు ఉపయోగించే పసుపు కుంకుమ… వీడు వెళ్ళింది పెళ్లికూతురుకి నలుగు పెట్టడానికి… అలా బయట నుంచి తెప్పించిన పసుపు పెడితే స్కిన్ పాడైపోతుందని వేరే పసుపు కొమ్ములు పట్టించిన పసుపు తీసుకురావడానికి వెళ్ళాడు” అనగానే ఆమె తల కొట్టుకుంటూ “తప్పదా?” అని అడగడంతో “వెళ్ళు తల్లి” అన్నాడు వాళ్ళ నాన్న….
కంటిన్యూస్!!!
Swipe left/right or tap the sides to turn pages