నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 3
నా మనసు దోచిన అతిధి [రాక్షస్ 😈 🖤]
నులువెచ్చని కిరణాలు పరదాలు దాటి గదిలోపలికి రావాలని ఆరాట పడుతున్నాయి
అప్పుడే మోగింది అతడి ఫోన్ కొంచెం డిస్ట్రబ్ అయినట్టు కదిలి అందుకున్నాడు దానిని
ఫోన్ పీక నొక్కి చెవి దగ్గర పెట్టి హెలో కొంచెం మత్తుగా వచ్చింది మాట అప్పుడే లేవడంతో
అన్నయ్యా కెవ్వున అరిచింది ఒకమ్మాయి!!
అతడు ప్చ్ అంటూ ఫోన్ దూరం చేసి చెవిలో వేలు పెట్టి తిప్పుతూ
ఏయ్ రీసౌండ్ వాలా ఏంటా అరుపులు మెల్లగా మాట్లాడలేవా విసుక్కున్నాడు
హి హి సోరీ ఆర్య అన్న గారు పెద్దమ్మ చెప్పింది నీకు మ్యాచ్ ఫిక్సింగ్ అట కదా సంబరంగా అంది తను
హమ్ ఇప్పుడు ఏం చేయాలి అయితే అతడి మాటలో నో ఫీలింగ్స్
అదేంటి అన్నయ్య అంత సింపుల్ గా అనేసావ్ నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా
ఇష్టం అంటే అన్నాడు??
అదేం క్వశ్చన్ అన్నయ్య సాగదీసి నెమ్మదిగా అంది తను
హ్మ్ ఇష్టం అంటే ఏంటి అన్నాను అందులో అర్థం కాకపోవడానికి ఏం ఉంది క్యాజువల్ గా అన్నాడు
ఇష్టం లేకుండా ఒక మనిషిని పెళ్లి చేసుకోం కదా
లవ్ పుట్టాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అప్పుడే గా పెళ్లి చేసుకుంటే అర్థం ఉంటుంది
ఇంకా అన్నాడు జిమ్ ఏరియా కి వెళుతూనే
తను ఏం మాట్లాడకపోతే చూడు ధన చూడగానే ప్రేమ పుట్టదు పుట్టినా అదంతా ఒట్టి టైం పాస్..ప్రేమ
పుడితేనే పెళ్ళంటే ఈలోకంలో సగానికి పైగానే సింగిల్స్ ఉంటారు
నాకు నచ్చడం నచ్చక పోవడం ఏం లేదు మామ్ డాడ్ కి నచ్చింది అడిగారు ఓకే అన్నా నా మ్యారేజ్
తో వాళ్ళు హాపీ ఫీలవుతారు నాకున్న బాధ్యత
తీరుతుంది తర్వాతి లైఫ్ ఎలా ఉండాలో ఐ విల్
మానేచ్ ఈ లవ్వు కొవ్వు తోటకూర ఏం లేవు కావాల్సింది నీడ్స్ ఎవరి అవసరం కోసం వాళ్ళు అండ్ బయట ఎవరూ జడ్జ్ చెయ్యకూడదు మన లైఫ్ ని దట్స్ ఇట్ చాలా తేలిక గా చెప్పేసాడు ఆర్య
ఫోన్ లో ఉన్న ధన పాప మరీ తెలివున్నా ప్రమాదమే
అలాంటోడిని అస్సలు చేసుకోను నేను కాల్ కట్ అయింది !!
“””””””””””””””””””””””””””’
ఒసేయ్ సాహి లేవ్వే బారెడు పొద్దేక్కే దాకా నిద్రపోతావా
మాతా శ్రీ గారికి తెల్లారిపోయింది లేచే వరకు సంపుతూనే ఉంటుంది గొణుక్కుంటూ లేచాను
ఏంటీ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా పడుకోనివ్వవా వాలి పోతున్న రెప్పలను కష్టంగా లేపుతూ అన్నాను
పడుకుంటావే ఎందుకు పడుకోవు రేపు మొగుడింటికి వెళితే నీకేం నిన్నెవరు ఏదనరు ఇదేనా మీ పెంపకం అని మమ్మల్ని దుమ్ముపోస్తారూ ?!
అబ్బా ఈ అమ్మలు ఉన్నారే మారనే మారరు
ఏదైనా అయితే చాలు డైరెక్ట్ గా పెళ్ళి కి ముడేస్తారు
పెళ్లి తప్ప మరో జీవితం లేదని అనుకుంటారు కాబోలు!!
లోపల తల్లి సంఘాన్ని తిట్టిబోస్తూనే లేచింది సాహి
అక్క ని చూడు ఎంత చక్కగా లేచి పనులు ముగించుకుని తన జాబ్ చూసుకుంటుందో ఎప్పటికీ మారతావే
వాష్ రూమ్ కి పోతున్న నాకు మా అమ్మ మాటలు వినబడుతున్నాయి
ప్చ్ నిజమే కావచ్చు అక్క చాలా తెలివైనది చురుకైనది లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసు
తనకి అది చూసి నేనూ ఆనంద పడతాను
కానీ తల్లికి పుట్టినోళ్ళందరూ ఒకేలా ఉండాలా మన చేతికి మొలిచిన వేళ్ళే ఒకటిగా ఉండవూ మనం ఇంతే మారం ఏంటో మరీ నాకు లైఫ్ మీద పెద్ద గోల్స్ లేవు
ఎందుకంటే ఉండే ఈ చిన్ని లైఫ్ లో రోజూ టెన్షన్ టెన్షన్ గా ఆఫీస్ కు పోడం రాడం ఉదయాన్నే హడావిడిగా లేచి పరుగులు తీయడం నచ్చదు
కాస్త లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి తర్వాత తీరిగ్గా మనకు..నొ నొ మనసుకు నచ్చిన పని చేసుకుపోవడమే !!
నాకు మాతాజీ మాటలు వినిపించడం లేదు అంటే
వెళ్ళి పోయింది ఇందుకే నేను ఇక్కడ నా స్టడీస్ కంటిన్యూ చెయ్యనిది నేను అల్లరని రిస్ట్కిక్షన్స్ పెడుతుంది మా అమ్మ
ఎందుకు ఆడపిల్ల అల్లరి చేయకూడదు ఇల్లు అల్లరి
పాలు అవుతుందనా ?? ఏంటో వీళ్ళ బాధ అర్థం కాదు ఒకమ్మాయి చలాకీగా ఉంటే తప్పా దానికే
ఏదో నేరాలు చేసినట్టు నోర్లు నొక్కేసుకుని తిరుగుబోతని సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంది ఈ సొ కాల్డ్ సొసైటీ అయినా సరే మనకు భయం లేదు ఇలా ఉంటే ఏం తప్పుకాదు కాబట్టి వాళ్ళ మాటలు చెవున
పెట్టకూడదు!!
ఆ..ఆలోచనలతోనే బ్రెస్ చేసుకుని వచ్చేసాను
కిందకి వెళితే మరో సుప్రభాతం స్నానం చెయ్యలేదా
అని..అందుకే పక్కనే ఉన్న అక్క గదిలోకి వెళ్ళా
అబ్బబ్బా భలే ఉంటుంది మా అక్క రూం చాలా ఫ్రెష్ గా నీట్ గా మంచి పెయింటింగ్స్ తో అక్క స్నానానికి వెళ్ళింది..ఈరోజు జాబ్ కి పోదు ఎందుకంటే అక్కని
చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నేను వచ్చింది అందుకే మరీ మా అమ్మ తో గొడవేసుకుని మరీను
నేను ఎప్పుడూ సినిమాల్లో చూడటమే పెళ్లి చూపుల్ని
అందుకే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అని ఎగురుకుంటూ వచ్చేసా
నాకు తెలియని నరకం ఇక్కడే పరిచయం అవుతుందని తెలియకా ???
అక్క బాత్ చేస్తుంది అని బయటకొచ్చా మా అమ్మ కింద చేస్తున్న హడావిడి వినబడుతుంది నాకు నవ్వుకున్నాను
ఆడపిల్ల కి చిన్నది జరిగినా సంబరమే పైట వేసినప్పుడు నుంచి తల్లి అయ్యేదాకా వాళ్ళ కంగారు హడావుడి సంబరం అంతా ఇంతా కాదు ప్రతి తల్లి తండ్రి ఇంతేనేమో అనుకుంటూ
నా రూం కి పోయా ఇప్పుడు కిందకి వెళ్ళానో మా ఇంట్లో మరో చీపురు కట్ట బలి హ్మ్ నోనొచ్చి వెళ్ళేలోపు డజను చీపుర్లు స్వోహాయ్ అవుతాయి హ హ హ
స్నానం చేస్తున్నాను ఏవో పిచ్చి పాటలు పాడుతూ
కొంగే జారిపోతుందే అమ్మమ్మో అని పాడుతూ నా పొడువాటి జుట్టు ని వాష్ చేస్తున్నా అక్కడ కాలేజ్ హడావుడిలో నా హెయిర్ ని పెద్దగా రుద్దడం కుదరదు
హాలిడేస్ లో తప్ప అసలకే నాకు జుట్టు పిచ్చి ఎందుకంటే మా అత్త వాళ్ళు ఉండే దగ్గర ఆల్మోస్ట్ అందరికీ పెద్దపెద్ద జుట్టులే అత్త కు కూడా
అందుకే మెయింటైన్ చేసేంత ఓపిక లేకున్నా అత్త చెప్పే టిప్స్ తో నా జుట్టు ను పొడుగ్గా పెంచుకున్న
అలాగే వచ్చా డ్రెస్ వేసుకుని ముందే చెప్పింది మా మదర్ థెరీసా పెళ్లి వాళ్ళు వస్తారు కాస్త మంచి బట్ట కట్టమని
మనం లైట్ తీసుకున్నాం ఎందుకంటే పెళ్లి చూపులు మనకి కాదు కదా 😁
తెలుపు గులాబీ రంగు కలగలిపిన డ్రెస్ వేసుకుని
బాల్కానీలో నా తల తుడుచుకుంటూ ఉన్నాను సడెన్ గా టవల్ జారిపడి పోయింది
ఓ మై గాడ్ మనిషి పడేంత సీన్ లా అరిచా
ఎందుకంటే నేను పడినా మా అమ్మ పట్టించుకుంటుందో లేదో తెలీదుగానీ టవల్
పడిందని చూసిందో అంతే సంగతి సుద్ది శుభ్రం లేదు ఉప్పర్ దానివని చీవాట్లు పెడుతుంది
ఆ కంగారు తోనే టవల్ ఎక్కడ పడింది చూడకుండా
లోపలికి వచ్చా అమ్మొ త్వరగా వెళ్లి తెచ్చెయ్యాలని
రూం బయటకు వచ్చిన నాకు ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఆటోమేటిక్ గా తొంగి చూసాను
అలా చూసిన నా కళ్ళు చాటంత అయ్యాయి గుండె పోటు వచ్చేంత గట్టిగా కొట్టేసుకుంటుంది నా చిట్టి గుండె…!!??
కంటిన్యూస్ 💌
✨✨✨✨✨✨✨✨✨✨✨✨
నేను నేను లానే అనిపిస్తున్నాను కానీ నేను నాలో లేనేలేను💝💝
Swipe left/right or tap the sides to turn pages