🌸 🕊️ నా రాక్షసి వే – 17 🌸 🕊️
కీతూ రూం కి వెళ్ళాక కార్తి ఆనికి వాళ్ళ కోసం చేసిన షాపింగ్ బ్యాగ్ ఇచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి..
ఆనితో మెల్లగా అన్ని చూసుకున్నాక నా రూంకి రా అని చెప్పి వెళ్ళిపోతాడు..
అన్న బాధని అర్థం చేసుకున్న ఆ చెల్లి.. ఆనిని చూస్తూ..
” హ్మ్మ్! వదిన డార్లింగ్ టుడే చాలా టైర్డ్ అయిపోయాం కదా.. నైట్ ఆర్ టుమారో చూసుకుందాంలే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో , నేను కూడా కొంచెం సేపు బజ్జుంటా అనిఆవలిస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ.. అంటుంది కీతూ…
కీతూ నిద్ర వచ్చినట్టుగా యాక్ట్ చేస్తూ బెడ్ పైన వాలాగా ఆని కీతూని ఒకసారి చూసి.. కావాలి అనే చూస్తుంది బేబీ అని అనుకుంటూ కీతూని చూసి చిన్నగా నవ్వుకొని కార్తి కోసం కార్తి రూమ్ కి వెళ్తుంది…