New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నిను ప్రేమించే నేను 💗💗 – 1

నిను ప్రేమించే నేను 💗💗 – 1

 

 

 

 

 

 

 

 

  నిను ప్రేమించే నేను  💗💗

 

ఎపిసోడ్ 1:……. 

 

 

డాడ్ ఇప్పుడు ఎందుకు ఇంత త్వరగా నన్ను  హైదరాబాద్ పంపిస్తున్నారు…    అందరం ఒకే సారీ వెళ్ళే వాళ్ళం కదా..     అని ఏడుపు మొఖం పెట్టీ తన తండ్రి వైపు చూస్తూ అంటుంది…..  

 

బంగారం మాతో పాటు అయితే నీ చదువు  సంగతి ఏమ్ అవ్వాలి చెప్పు…..  మేము ఎలాగో నెక్స్ట్ మంత్ వచేస్తాము కదా …    అప్పటి వరకు నువ్వు మా  ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వుంటున్నావు…… వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు …… ఆ పక్క ఇల్లే మనది కాని నిన్ను అక్కడ ఒంటరిగా వుంచడం  ఇష్టం  లేదు….. నువ్వు ఇబ్బంది పడకూడదు అనే ఆంటీ నిన్ను వాళ్ళింట్లో ఉండమన్నారు……  ఎల్లుండి నుండే నువ్వు నీ కొత్త కాలేజ్ కీ వెల్ల బోతున్నవు…… 

 

దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ అన్ని అంకుల్ చూసుకుంటాను అన్నారు. … సో నువ్వు వెళ్ళిన వెంటనే కొత్త కాలేజ్ లో జాయిన్ అయిపోవచ్చు….. 

 

అమ్మ నీ లగేజ్ మొత్తం సర్దింది…   ఇంకా ఎదైన అవసరం అయితే అక్కడ తీసుకో బంగారం అని అంటారు…..

 

ఆ మాటలకి హర్షి అసహనం గా…. కానీ ఈ విషయం నన్నిలా ట్రైన్ ఎక్కించడానికి తీసుకు వెళ్తూ చెప్తారా ..   

 

నేను వెళ్ళేది నెక్స్ట్ మంత్ అనుకుని ఈ మంత్ లో నేను నా ఫ్రెండ్స్ తో ఎన్ని ప్లాన్స్ అనుకున్నాను….. ఇలా సడెన్ గా నన్ను కాలజ్ నుండి తీసుకు వచ్చి హైదరాబాద్ ట్రైన్ ఎక్కిస్తూ ఇదంతా చెప్పడం ఏమైనా బాగుందా…   !!!! అని అడుగు తుంది…  

 

దానికి అరుణ గారు …   అది కాదు తల్లి ఈ విషయం నీకు ముందే చెప్తే …..ఎక్కడ వెళ్ళడానికి ఒప్పుకోవో అని ఇలా ఇక్కడికి తీసుకు వచ్చి చెప్తున్నము రా… ఇప్పుడు అనుకో వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ వుండదు….. నువ్వు ఇదే చెప్తావు కదా…. !!!  అవతల వాళ్లకి ఆలోచించే ఛాన్స్ ఇస్తే మన మాట వినరు అని అందుకే ఇలా చేసాము అని అంటారు….

 

ఆ మాటలకి హర్షి చాలు ఇంకా ఆపండి ….. నేను చెప్పినవి అన్ని  నా మీదే  అప్లై చేస్తారా….!!! అయిన నాకు  ఎవరో తెలియని వాళ్ళింట్లో ఎలా వుంటాను ఆని చిరాకుగా అడుగు తుంది……

దానికి మహేష్ గారు…. వాళ్ళు నికు తెలియక పోవడం ఎంటి రా.    రాజేష్ అంకుల్ మహి ఆంటీ తెలియదా నీకు….   నువ్వు వాళ్ళింట్లో వుంటేనే మేము ఇక్కడ ప్రశాంతం గా వుండ గలము…..

 

అయిన ఒక్క నెలే కదా బంగారు తల్లి …  పైగా నీకు ఎగ్జామ్స్ కూడా వున్నాయి …… వాటిని మిస్ అయితే ఎలా..   ఆంటీ అంకుల్ నిన్ను బాగా చూసుకుంటారు…   అదిగో ట్రైన్ కూడా వచ్చేసింది త్వరగా ఎక్కు …. నువ్వెక్కడకి రీచ్ అయ్యే సరికే అంకుల్ నీకోసం వుంటారు…    సో నువ్వు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు అని ట్రైన్ ఎక్కిస్తూ అంటారు..   

 

దానికి హర్షినీ ట్రైన్ ఎక్కితు.. మిమ్మల్ని కూడా మి వైఫ్ మార్చేసింది డాడ్.  నన్ను బలవంతంగా పంపిస్తున్నారు కదా…. అక్కడ నాకు కొంచెం నఛ్చక పోయిన సరే  వెంటనే ఇదే ట్రైన్ ఎక్కి వచ్చేస్తాను…. అని కోపంగా అంటుంది…..

 

ఆ మాటలకి అరుణ గారు…. సరే బంగారం జాగ్రత…. వాళ్లని  ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా బుధ్ధిగా వుండు అని చెప్తారు .. 

 

దానికి హర్షిని…. హా సర్లే మీరు త్వరగా రండి…. బై అని చెప్పి తన సీట్ లోకి వెళ్లి కూర్చుంటుంది…..

 

ట్రైన్ వెళ్ళే దాకా అక్కడే వున్న  అరుణ మహేష్ గారు…..  ట్రైన్ వెళ్లి పోవడం తో …. మి కూతురు అక్కడ బానే ఉంటుంది కదా…. మళ్ళీ ఎదో ఒక అల్లరి పని చేసి  వాళ్లకేం ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టదు కదా అని అడుగు తారు….

 

దానికి మహేష్ గారు..   ఇక్కడ వుంటే బాగా అల్లరి చేస్తుంది అనే కదా….. నన్ను ఒప్పించి మరి  నా కూతురిని నాకు దూరంగా   పంపిస్తుంది….. నేను లేకుండా నా కూతురు అక్కడ ఎలా వుంటుందో అని బయ పడుతుంటే…  నువ్వేంటి… అని అంటారు.   

 

ఆ మాటలకి అరుణ గారు నాది అదే బయం ….. అది ఏమ్ చేసిన వెనకేసుకు వస్తారు……. మీ గారం వల్లే అది ఇలా తయారు అయ్యింది….. మీకు కాస్త దూరం గా పంపిస్తే అయిన ఆ అల్లరి తగ్గుతుందేమో చూడాలి ….. మి కూతురు వెళ్లి రెండు నిమషాలు కూడా కాలేదు అప్పుడే బెంగ పెట్టుకున్నారా….. !!! ఒక్క నెల రోజులే కదా ఓపిక పట్టండి… అని అంటారు….

 

దానికి మహేష్ గారు.   కార్ డ్రైవ్ చేస్తూ……   తన ఫ్రెండ్  రాజేష్ కీ కాల్ చేసి…. నా బంగారు వస్తుంది రా…..  కాస్త  జాగ్రత్త గా చూసుకోండి రా అని అంటాడు….

 

ఆ మాటలకి  రాజేష్ గారు… రేయ్ ఇప్పటికీ ఇది ఒక వంద సార్లు అయిన చెప్పి వుంటావు….. మేము చూసుకుంటాము లేరా … నువ్వేం కంగారు పడకు రా ఆని అంటాడు…. అంతలోనే రాజేష్ గారి చేతిలోని ఫోన్  మహి గారు లాక్కుని అన్నయ్య నువ్వేం కంగారు పడకు….. హర్షిని నీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది ….. మీరు  మి పనులు అన్నీ చూసుకుని రండి అని అంటారు….

దానికి మహేష్ గారు…. మీరు సరిగ్గా చూసుకోరు అని కాదు రా…. మేము లేకుండా ఒక్కరోజు కూడా లేదు అందుకే బయం అంటారు….

దానికి ఫోన్ రాజేష్ గారు తీసుకుంటూ….  అబ్బా మరి అంత కంగారు పడకులెర… మీరు కూడా గుర్తు రానంత బాగా చూసుకుంటాము సరేనా…. ఇంకా వెళ్లి నీ పనులు చూసుకో అంటారు….

 

 

మరో వైపు ట్రైన్ లో కుర్చుని వున్న హర్షి తన లగేజ్ పక్కన పెట్టి…. తన బాగ్ లో వున్న   డైరీ ఓపెన్ చేసుకుని……

 

లైఫ్  లో ఎప్పుడు ఎది జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు కదా…..  నేను వచ్చే నెల కదా వెళ్ళేది అని ఈ నెల అంతా బోలెడు అన్ని ప్లాన్నింగ్స్ చేసుకున్నాను…. కానీ ఆ ప్లాన్స్ అన్ని కాన్సిల్ అయిపోయి …. ఇలా అకస్మాత్తుగ వెళ్లాల్సి వస్తుంది…… Maybe ఇదే లైఫ్ అనుకుంటా….. మన ప్లాన్స్ అన్ని destroy చేసి ఎది జరగాలి అని వుంటే అదే జరగడమే డెస్టినీ అయి వుండచ్చు ….. అని రాస్తూ…. 

 

అంతలోనే  హర్షి ఏంటిది…..  సడెన్ ప్రయాణం  నిలో ఇంత మార్పు తీసుకు వచ్చింది…..  లైఫ్ డెస్టినీ లాంటి పెద్ద పెద్ద పదాలు రాసేస్తున్నావు….  నీ డైరీ అంత బారాన్ని బరించలేదు… టాపిక్ మార్చు అని రాసి…  

 

ఎప్పుడో చిన్నప్పుడు చూసాను…. మహి ఆంటీ నీ  రాజేష్ అంకుల్ నీ….. నన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళు కానీ…. ఇన్ని సవంత్సరాల తర్వాత వాళ్ళని కలవ బోతున్నాను ఫీలింగ్ ఎక్సైటెడ్…. అండ్ ఫీలింగ్ లిటిల్ బిట్ సాడ్…. ఇక్కడ అందరినీ వదిలి వెళ్తున్నందుకు..    బట్ పో చూద్దాము అక్కడ ఎలా వుంటుందో అని రాసి…. డైరీ నీ క్లోజ్ చేసి విండో లోనుండి బయటకు చూస్తూ వుంటుంది……

 

మరో వైపు ఒక బాక్సింగ్ కోర్ట్ లో ఒక అబ్బాయి  అవతలి వ్యక్తి మొఖం పచ్చడి అయ్యేంత దారుణం గా కొడుతున్నాడు…    కానీ అక్కడ వున్న వాళ్లకి అది చూసి కూడా కొంచెం కూడా జాలి లేకుండా కొడుతున్న వ్యక్తి నీ శ్రీ……శ్రీ …..  శ్రీ….. శ్రీ  అని అరుస్తూ వున్నారు…….. 

కింద నుండి అది చూస్తున్న శ్రీ ఫ్రెండ్స్….. రేయ్ శ్రీ ఇంకా అపరా…..!!! వాడు చచ్చేలా వున్నాడు… అని అంటున్నారు…. అయిన సరే శ్రీ వాడిని ఆవేశంగా కొడుతూ…. వాడు పూర్తిగా స్పృహ తప్పి పోవడం తో…. నేల మీద పాడేసి…. బాక్సింగ్ గ్లౌజ్ తీసి పక్కకి విశిరెస్తూ..   అటిట్యూడ్ గా  తన ఫ్రెండ్స్ దగ్గరకి వస్తాడు……

శ్రీ రావడం తో….  ఆకాష్  రేయ్ శ్రీయాన్ష్ వాడు చస్తే ఏమ్ చేస్తావు రా…. అంతలా కొట్టావు అని కాస్త సీరియస్ గా అడుగు తాడు….

 

దానికి శ్రీ రెక్లస్ గా… I don’t care….  వాడు నాతో పెట్టుకోక ముందు అది ఆలోచించాలి….. వాడిని నాతో బెట్  వేయమని నేన చెప్పింది …. అని చెప్పి  పదండి వెళ్దాం అని అక్కడి నుండి వెళ్లి పోతాడు….

 

అప్పటి వరకు శ్రీ …శ్రీ… అని అరుస్తున్న అమ్మాయిలు కూడా శ్రీ వెళ్లి పోవడం తో అక్కడి నుండి వెళ్లి పోతారు…..

 

శ్రీ మాటలు విన్న ఆకాష్ కూడా…. అబ్బా వీడి అటిట్యూడ్ తో చస్తున్నాను కదా ….. ఈ అమ్మాయిలు కూడా ఇంతే వీడంటే పడి చస్తున్నారు…. కానీ అయ్యగారు మాత్రం ఒక్క పిల్లను కూడా పట్టించు కోరు అని అనుకుంటూ…. శ్రీ వెళ్లి పోవడం తో…. ఆకాష్  కూడా పరుగు లాంటి నడకతో శ్రీ వెనకాల వెళ్తాడు…….

 

శ్రీ ఆ కాలేజ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్…. కానీ అయ్య గారు మాత్రం అమ్మాయిలను కనీసం కేర్ కూడా చేయరు….. పొరపాటున ఎవరైనా అమ్మాయి దగ్గరకి వచ్చిందా….. ఆ అమ్మయి పని అయిపోయినట్టే….. వెంటనే కాలేజ్ నుండి వెళ్లి పోయేలా చేస్తాడు…. అందుకే  అమ్మాయిలు ఎంతలా శ్రీ నీ లైక్ చేస్తున్న కాస్త దూరం గానే వుంటారు………

 

ఇదండీ మన హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్…. ఇంకో కొత్త  స్టోరీ రాయబోతున్నాను…. ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను…. ఎలా వుందో కామెంట్ చేయండి….

 

 

To be continued……… 

 

టాగ్ యువర్ కామెంట్స్ బంగారాలు❤️ …. 

 

కొంచం స్పీడ్ గా కామెంట్స్ ఇస్తే ఎపిసోడ్ కొంచం స్పీడ్ గా వస్తుంది  బంగారాలు ❤️