నీ కోసం – 3
వివిధ కోసం వచ్చిన పెళ్లి సంబంధం…
సాయంత్రం….
ఇంటర్వ్యూ ముగించుకుని అలసిపోయిన అడుగులతో ఇంటికి చేరుకుంది వివిధ.
ఇంటి గేటు దగ్గరకు రాగానే లోపల ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు వినిపించాయి.
హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ ఇద్దరు అపరిచితులు కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.
ఒక మధ్యవయస్కురాలు, ఆమెతో పాటు ఒక వ్యక్తి.
రమ్య మాత్రం వాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడుతోంది.
వివిధ లోపలికి రావడం గమనించిన రమ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
ఎక్కడ తిరుగుతున్నావు ఇంతసేపు? అంది కోపంగా.
అమ్మ… ఇంటర్వ్యూ…అని అనసాగింది.
ఆ సరే. ముందు వాళ్లకు నమస్కారం చెప్పు.
వివిధ మౌనంగా నమస్కారం చెప్పింది.
ఆమెను చూసిన ఆ మహిళ చిరునవ్వు నవ్వింది.
అమ్మాయి మేము అనుకున్న దాని కన్నా చాలా అందంగా ఉంది.
ఆ మాట విన్న వెంటనే వివిధకు ఏదో అనుమానం వచ్చింది.
సరే ముందు వెళ్లి అందరికీ కాఫీ తీసుకురాపో అంటూ పురమాయించింది రమ్య.
సరే అని ఏమి మాట్లాడకుండా వివిధ అక్కడి నుండి వంట గదిలోకి వెళ్ళిపోయింది.
కొద్దిసేపటి తర్వాత…
ఆ అతిథులు వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లిన వెంటనే వివిధ తల్లి దగ్గరకు వెళ్లింది.
ఎవరు వాళ్లు అమ్మ?
రమ్య ముఖంలో సంతోషం కనిపించింది.
నీ అదృష్టం.ఏ వాళ్ళు..
అంటే? నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అమ్మ.
నీ కోసం వచ్చిన పెళ్లి సంబంధం.
ఆ మాట వినగానే వివిధ ఒక్కసారిగా షాక్ అయింది.
పెళ్లి సంబంధమా?
అవును.
చూడు అమ్మ… నాకు ఇప్పుడే పెళ్లి వద్దు.
నువ్వు వద్దంటే సరిపోతుందా?
నేను ఇంకా ఉద్యోగం కూడా చేయలేదు.
ఉద్యోగం చేసి ఏం సాధిస్తావు? ఈ సంబంధం వస్తే నీ జీవితం సెటిల్ అయిపోతుంది.”
వివిధ ముఖం ఒక్కసారి గా మసకబారింది.
సరే ఇంతకీ వరుడు ఎవరు?
రమ్య కాసేపు ఆగి చెప్పింది.
అతని పేరు రాజశేఖర్.
ఏం చేస్తారు?
బిజినెస్.
వివిధ తల ఊపింది.
కానీ…
తర్వాత రమ్య చెప్పిన మాట విని ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.
అతని వయసు కొంచం ఎక్కువా..
కొంచెం అంటే ఎంత ఎక్కువ ఏంటి..
ఎంతో కాదు కేవలం అతని వయసు నలభై ఐదు.
ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నువ్వు
అని అంటూ వివిధ ఆశ్చర్యంగా చూసింది.
నలభై ఐదు ఏళ్లు?
అవును. అయితే కోట్ల ఆస్తి ఉంది.
అమ్మా… ఆయన నాకు డబుల్ ఏజ్.
అయితే?
నేను ఆ పెళ్లి చేసుకోను.
రమ్య ముఖం కోపంతో ఎర్రబడింది.
చేస్తావు.
లేదు.
చేస్తావు అన్నాను!
ఆ రాత్రి…
వివిధ తన గదిలో కూర్చుని ఏడుస్తోంది.
తన జీవితంపై తనకే హక్కు లేదా?
డబ్బు కోసం తన తల్లి ఇలా ఎందుకు చేస్తోంది?
అనేక ప్రశ్నలు ఆమె మనసులో తిరుగుతున్నాయి.
అప్పుడే ఫోన్ మోగింది.
అది నేహా.
హాయ్… ఇంటర్వ్యూ ఎలా జరిగింది?
బాగానే జరిగింది.
మరి ఎందుకు ఇంత డల్‌గా ఉన్నావు?
వివిధ జరిగిన విషయం మొత్తం చెప్పింది.
నేహా కూడా షాక్ అయింది.
ఏంటి? నలభై ఐదు ఏళ్ల వ్యక్తితో పెళ్లా?
అవును.
నువ్వు ఒప్పుకోవద్దు.
నేను ఒప్పుకోవడం లేదు. కానీ అమ్మ వినడం లేదు. ఈ పెళ్లి నాకు వద్దు అంటే నా మాట వినేటట్టుగా కూడా ఏమీ కనిపించడం లేదు.
అదే సమయంలో…
నగరంలోని మరో ప్రాంతంలో…
సాకేత్ తన చిన్న గదిలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు.
అప్పుడే అతని స్నేహితుడు అర్జున్ లోపలికి వచ్చాడు.
రా… ఇంకా ఉద్యోగం దొరకలేదా? అని నవ్వాడు.
దొరుకుతుంది.
నువ్వు చాలా కూల్‌గా ఉంటావ్.
అది అలవాటు.
అర్జున్ నవ్వాడు.
సరే. ఈరోజు ఇంటర్వ్యూలో ఏమైనా ప్రత్యేకం జరిగిందా?
సాకేత్ పుస్తకం మూసి కాసేపు ఆలోచించాడు.
అతని కళ్ల ముందు వివిధ ముఖం మెరిసింది.
ప్రత్యేకం ఏమీ లేదు.
అన్నాడు.
కానీ…
అతని మనసు మాత్రం వేరే మాట చెబుతోంది.
ఎందుకో ఆ అమ్మాయి గురించి మళ్లీ మళ్లీ గుర్తొస్తోంది.
ఇదిలా ఉండగా…
రమ్య మాత్రం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది.
వివిధ అభిప్రాయం అడగకుండా…
రెండు రోజుల తర్వాత పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న వివిధ పూర్తిగా కుంగిపోయింది. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు..
తన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంది.
కానీ…
ఆమెకు తెలియదు.
విధి త్వరలోనే తన జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురాబోతోందని.
ఆ మలుపుకు కారణం…
సాకేత్.
తర్వాత భాగం లో…
అనుకోకుండా మళ్లీ కలిసిన సాకేత్
పెళ్లిచూపుల నుంచి తప్పించుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన వివిధ, అనుకోకుండా మళ్లీ సాకేత్‌ను కలుస్తుంది. ఆ పరిచయం స్నేహంగా మారుతుందా? లేక మరో సమస్య మొదలవుతుందా? …
చూద్దాం తర్వాత భాగంలో ఏం జరుగుతుందో…
MK….
Swipe left/right or tap the sides to turn pages