New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ కోసం – 5
నీ కోసం 3 min read

నీ కోసం – 5

పెళ్లిచూపుల్లో జరిగిన అవమానం

ఎల్లుండి…

 

వివిధకు అస్సలు రావద్దనిపించిన రోజు రానే వచ్చేసింది.

 

 

ఉదయం నుంచే రమ్య ఇంట్లో హడావిడి మొదలుపెట్టింది.

ఇల్లు శుభ్రం చెయ్యి… ఆ కర్టెన్లు మార్చు… టేబుల్ మీద పూలు పెట్టు…

అంటూ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనివ్వలేదు.

 

 

వివిధ మాత్రం మౌనంగా అన్ని పనులు చేస్తోంది.

ఆమె మనసులో ఒక్కటే ఆలోచన.

ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి…

 

మధ్యాహ్నం…

 

రమ్య ఒక కొత్త చీర తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టింది.

ఇది కట్టుకో.అందంగా రెడీ అవ్వు..

 

అమ్మ… నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.

 

నాకు ఇష్టం ఉంది. అదే చాలు.నీ ఇష్టం తో పని లేదు ఇక్కడ..

అని కఠినంగా చెప్పింది.

 

 

ఆ మాటలకి వివిధ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కానీ ఎదురు చెప్పే పరిస్థితి లేదు.

 

 

సాయంత్రం నాలుగు గంటలు.

 

వరుడి కుటుంబం వచ్చింది.

హాల్లో అందరూ కూర్చున్నారు.

 

 

వివిధ తన గదిలో ఉంది.

గుండె బలంగా కొట్టుకుంటోంది.

 

 

కొద్దిసేపటి తర్వాత…

అమ్మాయిని పిలవండి.

అని బయట నుంచి వినిపించింది.

 

 

రమ్య వచ్చి,

రా.మొహం అలా పెట్టుకోకు… చక్కగా ఉండు అని అంది.

 

 

వివిధ నెమ్మదిగా బయటకు వచ్చింది.

హాల్లో కూర్చున్న వ్యక్తిని చూసి ఆమె గుండె ఒక్కసారిగా భారంగా మారింది.

 

 

రాజశేఖర్.

వయసు నలభై ఐదు దాటిపోయింది.

ముఖంలో గర్వం స్పష్టంగా కనిపిస్తోంది.

అతని పక్కన అతని చెల్లెలు, బావ కూర్చున్నారు.

 

 

వివిధ వచ్చి కూర్చుంది.

 

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

తర్వాత రాజశేఖర్ మాట్లాడాడు.

వంట చేయగలవా?

 

వచ్చు.. చేయగలను..

 

ఉద్యోగం చేయాలని ఉందట కదా?

 

అవును.

 

అతను చిన్నగా నవ్వాడు.

పెళ్లి తర్వాత అవసరం లేదు.

 

ఆ మాట విన్న వెంటనే వివిధ ముఖం మారిపోయింది.

ఎందుకు?” అని అడిగింది.

 

 

రాజశేఖర్ ఆశ్చర్యంగా చూశాడు.

ఎందుకంటే నా భార్య ఇంట్లోనే ఉండాలి.నా పనులు చూస్తే చాలు..

 

కానీ నాకు నా కలలు ఉన్నాయి.

అంది వివిధ.

 

 

ఆ మాట విన్న వెంటనే అక్కడి వాతావరణం మారిపోయింది.

 

 

రాజశేఖర్ చెల్లెలు అసహనంగా చూసింది.

ఇప్పటి అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడుతున్నారు.అంది.

 

తర్వాత…

రాజశేఖర్ వివిధ వైపు చూస్తూ అన్నాడు.

పెళ్లి తర్వాత నా మాటే చివరి మాట.

 

 

ఆ మాట విన్న క్షణం…

వివిధకు కోపం వచ్చింది.

 

ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఆమె మొదటిసారి ధైర్యంగా మాట్లాడింది.

నన్ను క్షమించండి.

అంది.

 

అందరూ ఆశ్చర్యంగా చూశారు.

ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.

 

హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

 

రమ్య ముఖం తెల్లబడిపోయింది.

 

వివిధ!

అని కోపంగా అరిచింది.

 

 

కానీ వివిధ ఆగలేదు.ఆమె మాట వినాలి అని అనుకోలేదు..

 

నేను ఎవరి జీవితంలోనూ బలవంతంగా వెళ్లాలనుకోవడం లేదు. అలాగే నా జీవితాన్ని కూడా ఎవరి చేతుల్లో పెట్టాలనుకోవడం లేదు.

 

ఆ మాటలకి రాజశేఖర్ ముఖం ఎర్రబడిపోయింది.

అంటే నన్ను తిరస్కరిస్తున్నావా?

అని అడిగాడు.

 

 

అవును.అదేగా అంటున్న అని 

అంది వివిధ.

 

 

ఆ మాటతో అతను కోపంగా లేచాడు.

ఇంత గర్వం మంచిది కాదు.

అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.

 

 

అతని వెనుకే అతని కుటుంబం కూడా వెళ్లిపోయింది.

 

వాళ్లు వెళ్లగానే…

రమ్య కోపంతో ఊగిపోయింది.

ఏం చేశావో తెలుసా?

అని గట్టిగా అరిచింది.

 

 

నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను..

 

 

అతని దగ్గర కోట్ల ఆస్తి ఉంది.

 

నాకు డబ్బు కంటే నా జీవితం ముఖ్యం.అని వివిధ అంటూ ఉండగానే 

 

 

చటాక్!

అనుకోకుండా రమ్య వివిధ చెంపపై కొట్టింది.

 

 

వివిధ ఒక్కసారిగా వెనక్కి తూలింది.

కళ్లల్లో కన్నీళ్లు ఉబికాయి.

 

 

నా పరువు మొత్తం తీసేసావు.

అని రమ్య కోపంగా అరిచింది.

 

 

ఆ రాత్రి…

వివిధ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది.

తల్లి చేత దెబ్బ తినడం ఆమెకు కొత్త కాదు.

కానీ…

ఈరోజు చాలా బాధగా అనిపించింది.

 

 

ఎందుకంటే…

తనకు అండగా నిలబడే ఒక్క వ్యక్తి కూడా లేడని అనిపించింది.

 

 

అదే సమయంలో…

సాకేత్ తన గదిలో కూర్చుని ఉన్నాడు.

ఎందుకో ఈరోజంతా వివిధ గురించే ఆలోచిస్తున్నాడు.

ఆమె బాధతో ఉన్న ముఖం పదేపదే గుర్తొస్తోంది.

ఆమె బాగానే ఉందో లేదో…

అని తనలో తాను అనుకున్నాడు.

 

 

మరుసటి రోజు…

 

వివిధకు ఒక కాల్ వచ్చింది.

ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన కంపెనీ నుంచే.

 

 

ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.

ఫోన్ ఎత్తింది.

అవతల నుంచి వచ్చిన వార్త విని…

ఆమె కళ్లల్లో ఆనందభాష్పాలు మెరిశాయి.

 

 

ఎందుకంటే…

ఆమెకు ఉద్యోగం వచ్చింది!

 

 

కానీ…

 

 

ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది?

రమ్య ఆ ఉద్యోగాన్ని చేయనిస్తుందా?

లేక మరో కొత్త సమస్య మొదలవుతుందా?

 

తర్వాత భాగంలో…

 

వివిధ జీవితంలో మొదటి సంతోషం

ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఉన్న వివిధకు రమ్య మరో షాక్ ఇస్తుంది. అదే సమయంలో సాకేత్ జీవితంలో కూడా ఒక అనుకోని సంఘటన జరుగుతుంది…

 

 

చూద్దాం తర్వాత భాగంలో ఎం జరుగుతుంది…

 

 

MK….