New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ కోసం – 4
నీ కోసం 3 min read

నీ కోసం – 4

అనుకోకుండా మళ్లీ కలిసిన సాకేత్

 

 

మరుసటి రోజు…

వివిధ రాత్రంతా సరిగా నిద్రపోలేదు.

రమ్య చెప్పిన మాటలు ఇంకా ఆమె చెవుల్లోనే వినిపిస్తున్నాయి.

ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా…

ఆ మాటలు గుర్తొచ్చిన ప్రతిసారీ ఆమె గుండె బరువెక్కుతోంది.

 

 

 

ఉదయం అల్పాహారం కూడా సరిగా తినకుండా ఇంటి నుంచి బయటకు వచ్చింది.

 

 

ఇంట్లో ఉంటే ఊపిరాడడం లేదు.

ఎక్కడికైనా వెళ్లి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవాలని అనిపించింది.

 

 

అలా నడుచుకుంటూ ఒక చిన్న పార్క్ దగ్గరకు చేరుకుంది.

పార్క్‌లో జనాలు తక్కువగా ఉన్నారు.

ఒక బెంచ్‌పై కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయింది.

 

 

కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

నా జీవితాన్ని నేను నిర్ణయించుకోలేనా?

అని తనలో తాను బాధపడింది.

 

 

అప్పుడే…

ఇంత సీరియస్‌గా ఆలోచిస్తే బెంచ్ కూడా భయపడిపోతుంది.

అనే స్వరం వినిపించింది.

 

 

వివిధ ఒక్కసారిగా తలెత్తి చూసింది.

 

 

ఎదుట నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది.

మీరు…?ఇక్కడ..

 

మళ్లీ కలిశాం.

అని నవ్వాడు సాకేత్.

 

 

వివిధ కూడా తెలియకుండానే నవ్వేసింది.

ఇది మూడోసారి.

 

అవును. ఇప్పుడు మాత్రం విధి ప్లాన్ చేసినట్టే అనిపిస్తోంది.

అన్నాడు సాకేత్.

 

మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అని అడిగింది వివిధ.

 

 

ఉద్యోగం కోసం తిరుగుతూ అలసిపోయాను. కాస్త విశ్రాంతి.

అని చెప్పి పక్కనే కూర్చున్నాడు.

 

 

కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.

 

 

సాకేత్ గమనించాడు.

వివిధ ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతత లేదు.

ఏదో బాధ ఆమెను వెంటాడుతోంది.

ఏమైనా సమస్యా? అని మెల్లగా అడిగాడు.

 

 

వివిధ వెంటనే తల ఊపింది.అటువంటిది 

ఏమీ లేదు.

 

అబద్ధం.

 

ఏంటి?

 

నీ ముఖం చూస్తే తెలుస్తోంది.మీరు ఏదో బాధలో ఉన్నారు అని..

 

 

వివిధ కాసేపు మౌనంగా ఉంది.

తర్వాత చిన్నగా నవ్వింది.

 

 

మీరు జ్యోతిష్యుడా?

 

కాదు. కానీ బాధలో ఉన్నవాళ్లను గుర్తించగలను.

 

ఆ మాట విన్న తర్వాత…

ఎందుకో సాకేత్‌తో మాట్లాడాలని అనిపించింది.

 

 

తన గురించి అంతా కాకపోయినా…

కొంచెం చెప్పింది.

ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి.

 

పెద్దవేనా?

 

 

నాకు మాత్రం చాలా పెద్దవిగా అనిపిస్తున్నాయి.

 

 

పరిష్కారం లేని సమస్యలు ఉండవు.

అన్నాడు సాకేత్.

 

 

ఆ మాట సాధారణంగానే ఉన్నా…

వివిధకు కొంత ధైర్యం ఇచ్చింది.

 

 

అప్పుడే…

సాకేత్ ఫోన్ మోగింది.

అతను చూసి వెంటనే సైలెంట్ చేశాడు.

 

ఎత్తరా?అని అడిగింది వివిధ.

 

అంత ముఖ్యమైన కాల్ కాదు.

అన్నాడు.

 

 

నిజానికి…

ఆ కాల్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, అతని స్నేహితుడు అర్జున్.

 

 

కానీ సాకేత్ ప్రస్తుతం మాట్లాడాలని అనుకోలేదు.

ఎందుకో ఈ క్షణం అతనికి ప్రశాంతంగా అనిపిస్తోంది.

 

 

కొద్దిసేపటి తర్వాత…

కాఫీ తాగుతారా? అని అడిగాడు సాకేత్.

 

నా దగ్గర డబ్బులు లేవు.

అంది వివిధ నిజాయితీగా.

 

సాకేత్ నవ్వాడు.

నేను ఇప్పుడే ఏమీ కోటీశ్వరుడిని అయితే కాదు. రెండు కాఫీలు మాత్రం కొనగలను.

 

 

ఆ మాటకు ఇద్దరూ నవ్వుకున్నారు.

పార్క్ ఎదురుగా ఉన్న చిన్న కేఫ్‌లోకి వెళ్లారు.

 

 

కాఫీ తాగుతూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.

వివిధ తన చిన్ననాటి గురించి చెప్పింది.

 

 

సాకేత్ తన గురించి చాలా తక్కువ చెప్పాడు.

 

 

అతను ఎప్పుడూ తన గతం గురించి మాట్లాడకుండా జాగ్రత్తపడుతున్నట్టు అనిపించింది.

 

మీ కుటుంబం? అని అడిగింది వివిధ.

 

 

ఒక్క క్షణం…

సాకేత్ ముఖం మారిపోయింది.

కానీ వెంటనే చిరునవ్వు తెచ్చుకున్నాడు.

చాలా చిన్న కుటుంబం.

అంతే చెప్పాడు.ఇంకా ఏమీ చెప్పాలి అని అనుకోలేదు.

 

 

వివిధ కూడా ఇంకేమీ అడగలేదు.

 

 

సాయంత్రం అయిపోయింది.

ఇద్దరూ బయటకు వచ్చారు.

సరే… నేను వెళ్తాను.”అంది వివిధ.

 

సరే.అయితే 

మరి మళ్లీ కలుస్తామా?

అని సరదాగా అడిగింది.

 

 

సాకేత్ నవ్వాడు.

మనిద్దరం కలవాలని విధి నిర్ణయించుకుంటే… తప్పకుండా.

 

వివిధ అక్కడ నుండి వెళ్లిపోయింది.

 

 

కానీ…

ఆమె వెళ్లిన దారినే సాకేత్ కొద్దిసేపు చూస్తూ నిలబడ్డాడు.

 

 

అతని మనసులో ఒక ప్రశ్న మెదిలింది.ఎందుకో… ఈ అమ్మాయి బాధ నన్ను ఇంతగా ఎందుకు తాకుతోంది?

అతనికి సమాధానం తెలియదు.

 

ఇంకా…

అది ప్రేమ అని కూడా తెలియదు.

 

 

అదే సమయంలో…

 

 

ఇంటికి చేరుకున్న వివిధకు మరో షాక్ ఎదురైంది.

హాల్లో కూర్చున్న రమ్య ముఖంలో కోపం కనిపిస్తోంది.

 

ఎక్కడికి వెళ్లావు?నువ్వు ఇప్పటి దాకా అని గట్టిగా అడిగింది.

 

అలా బయటికి…

 

 

ఎల్లుండి పెళ్లిచూపులు. గుర్తుందా?

 

వివిధ మౌనంగా నిలబడింది.

 

ఆ రోజు ఎలాంటి డ్రామాలు చేయకు.

అని హెచ్చరించింది రమ్య.

వివిధ గుండెల్లో భయం మొదలైంది.

 

 

ఎల్లుండి తన జీవితాన్ని మార్చే రోజు కావొచ్చు…

లేదా…

అదే రోజు ఆమె జీవితంలోకి సాకేత్ మరింత దగ్గరవచ్చు.

 

తర్వాత భాగంలో…

 

పెళ్లిచూపుల్లో జరిగిన అవమానం

వివిధకు వచ్చిన పెళ్లి సంబంధం వెనుక అసలు నిజం ఏమిటి? పెళ్లిచూపుల్లో ఆమెకు ఎదురయ్యే అవమానం ఏమిటి? ఆ సమయంలో సాకేత్ ఎక్కడ ఉంటాడు? 

 

 

చూద్దాం తర్వాత భాగంలో ఎం జరుగుతుంది…

 

MK…