New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ కోసం – 2
నీ కోసం 3 min read

నీ కోసం – 2

ఇంటర్వ్యూలో ఎదురైన ఆశ్చర్యం…

 

 

బస్ స్టాప్ నుంచి బయలుదేరిన వివిధ నేరుగా ఇంటర్వ్యూ జరుగుతున్న కంపెనీకి చేరుకుంది.

 

 

అది పెద్ద కంపెనీ కాకపోయినా, మంచి పేరు ఉన్న సంస్థ.

 

 

గేటు దగ్గరికి వెళ్లగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.

“ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం… దేవుడా, ఈసారి అయినా నాకు సహాయం చేయి…” అని మనసులో ప్రార్థించుకుంది.

 

 

రిసెప్షన్‌లో తన పేరు నమోదు చేసుకుని వెయిటింగ్ హాల్‌లో కూర్చుంది.

 

 

అక్కడ దాదాపు ఇరవై మంది అభ్యర్థులు ఉన్నారు.

 

 

అందరూ తమ తమ ఫైళ్లను చూస్తూ, ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నారు.

వివిధ కూడా తన ఫైల్ తెరిచి చూడబోతుండగా…

 

 

అకస్మాత్తుగా ఒక పరిచయమైన స్వరం వినిపించింది.

“ఎక్స్క్యూజ్ మీ… ఈ సీట్ ఖాళీగా ఉందా? లేక ఇక్కడ ఎవరైనా ఉన్నారా..

 

 

వివిధ తలెత్తి చూసింది.

ఆమె కళ్లలో ఆశ్చర్యం మెరిసింది.

మీరు…?

 

 

ఆ యువకుడు కూడా ఆశ్చర్యంగా చూశాడు.

అరే… రోడ్డు దగ్గర…

 

 

అవును! అని నవ్వింది వివిధ.

 

 

అతడే సాకేత్.

 

మీరు ఇక్కడ?

 

ఇంటర్వ్యూకి వచ్చాను, అన్నాడు సాకేత్.

 

నేను కూడా.

 

 సరే ఇక్కడ ఖాళీగానే ఉంది నా పక్కన కూర్చుండి అంటూ ఆ ఖాళీ చైర్చూ ని పించింది వివిధ..

 

 

ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

 

 

ఉదయం జరిగిన సంఘటన తర్వాత మళ్లీ కలవడం ఇద్దరికీ ఆశ్చర్యంగానే అనిపించింది.

 

 

అంటే మనిద్దరం ఒకే ఉద్యోగం కోసం పోటీ పడుతున్నామన్నమాట.

 

అలా అనుకోవచ్చు,”అన్నాడు సాకేత్. అలా ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు.

 

 

కొద్దిసేపటి తర్వాత…

 

 

ఇంటర్వ్యూలు మొదలయ్యాయి.

ఒక్కొక్కరిని లోపలికి పిలుస్తున్నారు.

వివిధ పేరు ఇంకా రాలేదు.

 

 

అంతలో సాకేత్ పేరు పిలిచారు.

మిస్టర్ సాకేత్…

 

వస్తున్నాను.

అని లేచి నిలబడ్డాడు.

 

 

లోపలికి వెళ్లే ముందు వివిధ వైపు తిరిగి…

ఆల్ ది బెస్ట్.

అన్నాడు.

 

 

మీకు కూడా. అయినా ఇంటర్వ్యూకి లోపలికి వెళుతుంది మీరు. నేను ముందు మీకు చెప్పాలి కానీ మీరు నాకు చెబుతున్నారు ఏంటి..

 

 

 ఊరికే చెప్పాలనిపించింది అని అంటూ..సాకేత్ చిరునవ్వుతో లోపలికి వెళ్లిపోయాడు.

 

 

దాదాపు పదిహేను నిమిషాల తర్వాత అతను బయటకు వచ్చాడు.

అయితే అతని ముఖంలో ఎలాంటి టెన్షన్ కనిపించలేదు.

 

 

ఎవరితోనో సాధారణంగా మాట్లాడినట్టు ప్రశాంతంగా ఉన్నాడు.

 

 

ఎలా జరిగింది? అని అడిగింది వివిధ.

 

 

బాగానే జరిగింది.

 

 మీరు అసలు అంత కూల్‌గా ఎలా ఉంటారు?

 

 ఆ మాటకు సాకేత్ నవ్వాడు.

భయపడితే ప్రశ్నలు మారవు కదా.

 

 

ఆ మాట విని వివిధ కూడా నవ్వింది.

 

కొద్దిసేపటికి…

 

మిస్ వివిధ…

అని పిలుపు వచ్చింది.

 

 

వివిధ గుండె వేగంగా కొట్టుకుంది.

ఆమె లోపలికి వెళ్లింది.

ఇంటర్వ్యూ దాదాపు ఇరవై నిమిషాలు సాగింది.

 

 

ప్రశ్నలు బాగానే వచ్చాయి.

కానీ ఫలితం ఎలా ఉంటుందో అర్థం కాలేదు.

 

 

బయటకు వచ్చేసరికి సాకేత్ ఇంకా అక్కడే ఉన్నాడు.

 మీరు ఇంకా వెళ్లలేదా?అని అడిగింది.

 

ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను.

అన్నాడు.

అసలు అతను అబద్ధం చెప్పాడు.

 

 

ఎందుకో తెలియదు కానీ… వివిధ బయటకు వచ్చే వరకు అక్కడి నుంచి వెళ్లాలని అతనికి అనిపించలేదు. ఆ మాట అంటే బాగోదు అని ఫ్రెండ్ కోసం అని ఒక చిన్న అబద్ధం చెప్పాడు.

 

 

ఇద్దరూ కలిసి బయటకు నడిచారు.

అప్పుడే కంపెనీ గేటు దగ్గర ఒక సంఘటన జరిగింది.

 

 

ఒక వృద్ధుడు రోడ్డుపై జారి పడిపోయాడు.

చుట్టూ చాలామంది ఉన్నా…

ఎవరూ ముందుకు రాలేదు.

 

 

వెంటనే సాకేత్ పరుగెత్తి వెళ్లి అతన్ని లేపాడు.

తాతయ్య… బాగున్నారా?

అని అడిగాడు.

 

 

నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు.

 

 

వివిధ కూడా సహాయం చేసింది.

 

 

కొద్దిసేపటికి వృద్ధుడు కోలుకున్నాడు.

చాలా మంచివాళ్లు బాబూ మీరు… అన్నాడు.

 

 

సాకేత్ మాత్రం చిన్నగా నవ్వాడు.

ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు తాతయ్య.

 

 

ఆ సంఘటన చూసిన వివిధ మనసులో ఒక కొత్త భావన కలిగింది.

 

 

ఉదయం తన ప్రాణాలు కాపాడాడు.

ఇప్పుడు ఒక అపరిచితుడికి సహాయం చేశాడు. ఇతనిలో సహాయం చేసే గుణం బాగా ఉంది అని అనుకుంది ఆమె.

 

 

సాకేత్ గురించి ఎంత ఆలోచించినా…

అతను సాధారణ వ్యక్తిలా అనిపించడం లేదు.

 

 

అయినా అతని గురించి తనకు ఏమీ 

తెలియదు.

సరే… ఇక నేను వెళ్తాను,అంది వివిధ.

 

సరే.

 

మళ్లీ కలుస్తామో లేదో.

అంది నవ్వుతూ.

 

 

సాకేత్ క్షణం పాటు ఆమె వైపు చూశాడు.

విధి అనుకుంటే తప్పకుండా కలుస్తాం.

అన్నాడు.

 

 

ఆ మాట విన్న వివిధ తెలియకుండానే చిరునవ్వు నవ్వింది.

 

 

ఇద్దరూ తమ తమ దారిలో వెళ్లిపోయారు.

కానీ…వారికి తెలియదు.

 

 

ఆ రోజుతో వారి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని.

 

 

 

తర్వాత భాగంలో…

వివిధ కోసం వచ్చిన పెళ్లి సంబంధం

ఇంటికి వెళ్లిన వివిధకు షాక్ ఎదురవుతుంది. రమ్య ఒక ధనవంతుడి పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తుంది. వివిధ జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకోబోతోంది…

 

 

 చూద్దాం తర్వాత భాగంలో ఏం జరుగుతుందో..

 

 

Mk…