నీ చూపులే నా ఊపిరి💕 – 1
“ప్రాణంగా ప్రేమించిన వారి కంట వచ్చే చిన్న కన్నీటి బొట్టును అయినా భరించలేము కదా!?“
| సమయం ఉదయం 11:00 గంటలు |
“మా మా ఒక గుడ్ న్యూస్” అంటూ ఎంతో ఎక్సైటింగ్గా లోపలికి వస్తూనే కిచెన్ వైపు ఆత్రుతగా చూస్తూ హాల్ఉ లోనే ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ఎం తో ఎంతో సంబరంగా చెబుతున్నాడు వినయ్.
బిడ్డ సంతోషం చూసి, “ఆహా! విన్ను ఏమైంది రా అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి ఏంటి ఆ గుడ్ న్యూస్?” అంటూ తన తల్లి కవిత తనలానే ఎక్సైట్ అవుతూ అడుగుతుంటే,
“హా! మా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా కల ఇవాళ్టికి నెరవేరింది ఐ యాం సో హ్యాపీ తెలుసా.”
“అరే! అంత సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాము కద రా” అంటూ అంటున్న తన అమ్మమ్మ మాటలకి,
“హా! అమ్ము చెప్తా ఇంట్లో వాళ్లంతా రానీ” అంటూ మళ్లీ అదే ఆత్రుతతో కిచెన్ వైపుగానే చూస్తున్నాడు వినయ్.
తన చూపులు చూసి, “ఇంట్లో వాళ్లంతా ఇక్కడే ఉన్నారు కద రా ఇంకెవరు ఉన్నారని అడుగుతున్నావు?” అంటూ మనవడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో అర్థమయ్యి కూడా కావాలనే అనింది గౌరమ్మ అదే వినయ్ వాళ్ళ అమ్మమ్మ.
ఆవిడ మాటలకి తను కావాలనే అంటుంది అని అర్థమై, “ప్చ్…! ఇప్పుడు నీతో గొడవ పడేంత ఓపిక నాకు లేదులే కానీ మిన్ను మిన్ను లోపల ఏం చేస్తున్నావే రా బయటికి” అంటూ తను అంతగా అరుస్తున్నా బయటికి రాని పెళ్ళాన్ని ఈసారి కాస్త గట్టిగానే అరిచి మరీ పిలిచాడు వినయ్.
తన పిలుపుకి అత్త మామలు నార్మల్ గానే ఉంటే, అది విన్న గౌరమ్మ మాత్రం మూతి ముప్పై వంకర్లు తిప్పేసుకుంది.
“అబ్బో! ఇప్పుడు అది లేకపోతే ఏం ఒరిగిందంటా ఈ మధ్య వీడు ఎప్పుడు చూడు దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఏం మాయ చేసిందో ఏమో మహాతల్లి” అంటూ భర్త పిలుపు విన్న మిన్ను అలియాస్ ‘మీనాక్షి’ తను చేస్తున్న పనిని ఆపేసి చేతులు తుడుచుకుంటూ బయటికి వస్తున్న తననే చూస్తూ ఆవిడలో ఆవిడ చాలా కసిగా అనుకుంది.
భార్యని చూడగానే ముఖం ఇంకాస్త విప్పారి, “రా రా నేను వచ్చి ఇంత సేపైనా లోపల ఏం చేస్తున్నావే” అంటూ దగ్గరకు వచ్చిన పెళ్ళాం భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకొని,
“హ! మ్మా ఇప్పుడు చెప్తా ఆ గుడ్ న్యూస్ ఏంటో” అంటూ ఒక్కసారిగా ఊపిరిని బలంగా పీల్చుకొని వదిలి ఒకసారి ప్రేమగా భార్యని చూసి తన తల్లిదండ్రుల వైపుగా చూపు తిప్పి,
“నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్న ప్రమోషన్ ఇప్పుడు నాకు గ్రాంటెడ్ అయ్యింది నాన్న.”
చెప్పిన అతని మాటలకి సంబరం నిండిన కళ్ళతో ఎంతో సంతోషంగా భర్త వైపు చూసింది మీనాక్షి.
తన చూపులని గమనించిన గౌరమ్మ, “అబ్బో! ఎంత మెరుపో ఆ కళ్ళల్లో ఇప్పటి దాకా వాడిని నాకిస్తుంది చాల్లేదన్నట్టు ఈ ప్రమోషన్ వల్ల ఇంకాస్త డబ్బులు ఎక్కువ లాగొచ్చు అన్న ఆలోచనలు కూడా అప్పుడే వచ్చేశాయేంటే నీకు” అంటూ వచ్చిన ఆ సంతోషాన్ని క్షణం కూడా ఉండనివ్వక వెంటనే తన ముఖంలో బాధని రప్పించేలా చేసేసింది గౌరమ్మ.
ఆ మాట విన్న మీనా ఏదో తెలియని గుండె భారంతో అప్పటికే కళ్ళల్లో చేరుకున్న నీటి పొరతో మౌనంగా ఆవిడ వైపే చూస్తే, ఈ న్యూస్ వినగానే తన భార్య కళ్ళల్లో మెరిసే మెరుపుని ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ ఎంతగానో ఎదురు చూసిన వినయ్ కి తను కోరుకునే ఆ మెరుపు వచ్చి రాకముందే సెకండ్ పాటు కూడా లేకుండా చేసింది అన్న కోపం రాగానే,
మీనా భుజంపై ఉన్న చేతిని గట్టిగా బిగిస్తూ, “నువ్విక ఎప్పటికీ మారవా అమ్మమ్మ..? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది నీకేం చేసిందని ఎప్పుడు చూడు దాని మీద పడి ఏడుస్తావు? కొంచెం సేపు కూడా మమ్మల్ని సంతోషంగా ఉందనివ్వవా?” అంటూ తను హైపర్ అయిపోతుంటేనే,
ఆవిడ అన్న మాటలను తీసుకోలేక, “కంగ్రాట్స్ అండి మీకు వాటర్ తీసుకొస్తాను” అంటూ వణుకుతున్న గొంతుతోనే తన భుజం పై వేసిన అతని చేతిని బలంగా వెనక్కి తీసేసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి.
కోడలి బాధ అర్థం అవుతుంటే ఆ పెద్ద జంటకి కూడా ఆవిడ పై కోపం ఆగట్లేదు.
కొనసాగుతుంది….
ఎందుకని గౌరమ్మకి మీనాక్షి అంటే అంత కోపం?
నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యరా.. అలాగే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..
నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…
ఇట్లు
మీ కీర్తి💕
Swipe left/right or tap the sides to turn pages