PSYCHO 👿 – SMART RABBIT 🩷 – 3
వేడి వేడి కాఫీ ముఖం మీద పడగానే CI శ్రీను అరుపు హైదరాబాద్ మొత్తం వినిపించేలా అరిచాడు.
అధ్వయ్ అసలేం జరగనట్టే వాడి వైపు చూస్తూ తీసుకురావడానికి లేట్ అయింది ..అందుకే పనిష్మెంట్ .. పో పోయి బాత్రూమ్స్ క్లీన్ చెయ్యి అన్నాడు.
అప్పటికే అధ్వయ్ అంటే ఒకలాంటి భయం ఏర్పడిన శ్రీను …సార్ నేను ఈ స్టేషన్ CI ని సార్. నేనులంటివి చేస్తే నాకింద పని చేసే వాళ్ళకి …అంటూ మెల్లగా బ్రతిమలినట్టు నసుగుతాడు.
అచ్చ…నీకింద పని చేసే వాళ్ళ ముందు బాత్రూమ్ కడగానికి నామోషీ… మరి వాళ్ళ ముందు చేసే తుప్పాసి పనులకి లేదేంట్రా నీకు నామోషీ.. ఎవడి మోచేతి నీళ్ళు తాగే నీకు ఎందుకు రా నామోషీ.. పో పోయి పని చూడు అని వంశీ తీసుకొచ్చిన ఫైల్స్ చూసి మళ్ళీ శ్రీను నీ చంపేసేలా చూసాడు.
అన్నున్నాయి మరి ఫైల్స్ అక్కడ. అధ్వయ్ చూపుకే బిక్క చచ్చిపోయిన శ్రీను మళ్ళీ ఏం చేస్తాడో అని వణికిపోతూ నిల్చుంటాడు.
శ్రీను ని అలా చూసిన తర్వాత అధ్వయ్ ఫేస్ లో సాడిస్టిక్ స్మైల్ చేస్తూ …నీ భయం ఉంది చూసావా…?? నీ భయాన్ని చూస్తుంటే ఇక్కడ ఇక్కడ బ్లడీ సాటిస్ఫాక్షన్ గా ఉంది రా హార్ట్ మీద చెయ్యి వేసి చూపిస్తూ తల పక్కకి వంచి అదో రకంగా చూసాడు.
ఆ చూపుకే పాంట్ తడిచిపోతుంటే … సార్ అంటూ అధ్వయ్ కాళ్లు పట్టేసుకుని పెళ్ళాం పిల్లలు గల వాడిని సార్ ..అందుకే ఎవరేం పని చెప్పిన నాలుగు రూపాయలు వస్తాయని కక్కుర్తి పడ్డాను ..ఇంకెప్పుడు అలా చేయను సార్ అంటూ ప్రాధేయపడ్డాడు శ్రీను.
చ్.. చ్.. చు.. చు…గంట లోనే ఇంత మార్పా …?? నమ్మాలని లేదే ?? చూద్దాం … కమ్ అంటూ వెళ్ళి తన చైర్ లో కూర్చున్నాడు.
అది చూసిన శ్రీను కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. వంశీ కి మాత్రం పిచ్చ హ్యాపీ గా ఉంది ..వచ్చిన గంటకే అధ్వయ్ విశ్వ రూపం చూసి కాళ్ళ మీద పడ్డా శ్రీను ని చూసి ఆ ఆనందం.
ఫైల్స్ అన్ని చూస్తున్నాడు … అన్ని కూడా అన్సాల్వ్డ్ కేసెస్. కొన్ని సరైన ఇన్ఫర్మేషన్ లేకుండానే క్లోజ్ చేసేసారు.
అన్ని ఫైల్స్ లో అధ్వయ్ చూపు ఒక్క ఫైల్ మీద ఆగిపోయింది.
క్షణం లో అతని లోని బీస్ట్ నిద్ర లేచాడు. పచ్చని నరాలు మెడ పై చేతుల మీద ఉబ్బి కనిపిస్తుంటే , కళ్ళు ఎరుపు రంగు ని పూసుకున్నాయి, దవడ కండరాలు బిగుసుకుని గట్టిగా కళ్ళు మూసి తెరిచి లేచి శ్రీను ని లాగి పెట్టీ పీకుతాడు.
ఏమైందో తెలిసే లోపు వెళ్ళి నేల కి కరుచుకున్న శ్రీను అయోమయం మరియు అవమానం కలిపి చూస్తున్నాడు.
నువ్వు ఈ వృత్తి లోకి ఎందుకొచ్చావు రా ?? అని సూటిగా అడిగాడు.
ప్రజలకి న్యాయం చేయడానికి సార్ అని చిన్నగా అన్నాడు.
మరి చేస్తున్నావా ?? కనీసం ఒక్కసారి చేసావా ?? అన్నాడు .
తల దించుకొని నిలబడ్డాడు శ్రీను .
ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ 12 ఏళ్ల పాప పై రేప్ అండ్ మర్డర్ జరిగినట్టు కంప్లైంట్ ఫైల్ అయితే ….కాస్ ఆఫ్ డెత్ సూసైడ్ అని కంక్లూజన్ ఇచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏవీ ఇందులో ?? అన్నాడు గట్టిగా.
సార్ … అది జరిగి మూడు సంవత్సరాలు అవుతుంది సార్..పైగా ఆ పిల్ల స్కూల్ లో ఎవర్నో ప్రేమించిందని మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది .
ఆ విషయం అందరికీ తెలియడం తో పాప భయం తో సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. రిపోర్ట్స్ లో క్లియర్ గా రాసుంది కదా సార్ అని టెన్షన్ తో పట్టిన చెమటలు తుడుచుకుంటాడు.
ఒక వైపు అతన్ని గమనిస్తూనే మరి వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ ఎందుకు కేసు రీ ఓపెన్ చేయించారు?? ఆ పాప ది సూసైడ్ కాదు మర్డర్ అని ఎలా చెప్తున్నారు ?? మళ్ళీ మీరెందుకు ఈ కేస్ ను స్టడీ చేయలేదు ?? అని అన్నాడు అధ్వయ్.
సార్..ఆది ..కొత్త కేసులు ఎక్కువై పాత వి అలా ఉంచేశాం సార్ . వాళ్ళు కూడా సంవత్సరం క్రితం రావడమే మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు . వాళ్ళకే లేనిది మాకెందుకు అని పక్కకి పెట్టీ మిగతా వాటిలో బిజీ గా ఉన్నాం సార్ అంటూ చెప్తాడు.
ఆహా…!! ఏం బిజీ ?? సె** వీడియోలు చూడడం లోన ?? అన్నాడు అధ్వయ్ .
ఆ మాటకి తల దించుకున్నాడు శ్రీను.
పాప పేరెంట్స్ కి కబురు పెట్టు . తన కి సంబంధించిన ప్రతి డీటెయిల్ అరగంట లో నా టేబుల్ మీద ఉండాలి క్విక్ అని అరిచాడు అధ్వయ్ .
ఎస్ సార్ …అని అని పరుగులాంటి నడకతో బయటకి వచ్చి తన కేబిన్ కి వెళ్తూ అన్న కి చెప్పనా ?? ఆ కేసు ని క్లోజ్ చేయించేశాం గా మళ్ళీ ఇప్పుడు వీడి కంట నే పడాల?? తీగ లాగితే డొంకంతా కదిలినట్టు … ఈ కేస్ రీ ఓపెన్ చేస్తే మన కుర్రాళ్ళందరూ బయటకి వస్తారు. దీన్ని కప్పి పుచ్చడానికి చేసినవన్నీ తిరిగొస్తాయి… ఇప్పుడెలా?? అన్న కి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని bp తెచ్చుకుంటాడు శ్రీను.
ఆ కేస్ వెనుక ఎవరున్నారు ??
నిజంగా పాప ది రేప్ అండ్ మర్డర్ నా ??
స్వీటీ …..❤️
Continues……
Swipe left/right or tap the sides to turn pages