New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ జతే నే కోరుకున్న – 3

నీ జతే నే కోరుకున్న – 3

శ్రీ రామ చంద్ర…. మన హీరో నేమ్….

 

తండ్రి :రఘరం.

తల్లి :సుప్రజ.

తాత :రాజారామ్.

నానమ్మ :మహాలక్ష్మి.

 

ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటారు కానీ… ఇప్పుడు చెప్పను…. ముందు ముందు ఆడ్ అవుతారు.

 

 

రామ్ వాళ్ళ పూర్వికులు…. హైదరాబాద్ వాళ్లే… హిందువులే… కానీ…. వ్యాపారం పరంగా రాజస్థాన్ కి వెళ్లిపోయారు…. ఆలా రాజస్థాన్ లో స్థిరపడి…. వ్యాపారం లో రానించి…. ఒక పేరు మోపుకున్నారు…. అక్కడ ఉన్న ప్రజలకు కూడా అవసరానికి ఆదుకుంటూ….. అక్కడ ఉన్న ప్రజలకి దేవుడుగా…. పాలించే రాజు గా… నిలిచిపోయారు.

 

 

నెమ్మదిగా నెమ్మదిగా…. వ్యాపారం లో రానించి…. తమకాంటూ ఒక బ్రాండ్ అన్నది నిలుపుకొని…. తమాదైనా పేరు ను నిలుపుకున్నారు.

 

 

మెల్లిగా మెల్లిగా వారి ఆస్తులతో పాటు…. ఇంకా బిసినెస్ లు కూడా పెరుగుతూ…. కొన్ని వేల కోట్ల ఆస్తిని సంపాదించారు.

 

 

రాజస్థాన్ లో జైపూర్ లో…. ఉన్న ప్రతి ఒక్కరికి…. ఆదుకుంటారు… వాళ్ళకి ఏ సహాయం చేయాలి అన్న వెనుకదారు.

 

 

ఆలా వీళ్ళు ఒక రాజవంశీ్యులుగా అక్కడ పేరు మోసారు…. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా వీళ్ళ కుటుంబాన్ని ఒక దేవుడిగా కొలుస్తారు.

 

 

ఆ రాజవమశియుల ఫ్యామిలీ నే మన హీరో ది.

 

కొన్ని వేల కోట్ల ఆస్థి కి మొదటి వారసుడు….. చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉండి తన చదువును సాగించాడు… ఒక ఏజ్ కి వచ్చాక…. చదువుతూనే…. తన ఫాదర్ బిసినెస్ ని హ్యాండిల్ చేసేవాడు….. ఇప్పుడు చదువు అంత కూడా కంప్లీట్ చేసుకొని…. బిసినెస్ ని తన హ్యాండోవర్ చేసుకొని…. ప్రస్తుతం… ఇప్పుడు బిసినెస్ చూసుకునే పనిలో ఉన్నాడు.

 

 

 

 

రామ్ గురించి చెప్పాలి అంటే….. బాబు కి బాగా పొగరు… బలుపు…. ఆటిట్యూడ్… అన్ని కలగాలిపి చెప్పాలి అంటే… మోడరన్ మన్మధుడు.

 

 

అమ్మాయిల కలల రాకుమారుడు….6.2 height…

కండలు తిరిగిన బాడీ…. సిల్కీ హెయిర్… వత్తాయినా కనుబొమ్మలు…. షేర్ప్ అయిస్…. పింకీష్ లిప్స్…. మగసిరి ఉట్టి పడే మీసా కట్టు.

 

 

ఇంకా బాబు కి.. ఎప్పుడు కూడా కోపం అనేది పక్కనే ఉంటుంది…. బాబు ని చూసి…. బాబు కోపం చూసి అందరూ వణికిపోవలసిందే….. ఎందుకంటే బాబు గారి కోపం ఆ రేంజ్ లో ఉంటుంది ముందు ముందు మిరే చుడండి.

 

బాబు గారికి కోపం… ఎక్కువగా ఉంటే…. సిగరేట్స్ బాగా తాగుతాడు….. ఇంకా ఒక రేంజ్ లో ఉంది అంటే బాబు కచ్చితంగా జీమ్ చేస్తూ ఉంటాడు… అది ఏ టైం అయినా సరే.

 

 

బాబు మార్నింగ్ టైం లో కచ్చితంగా జీమ్ చేస్తాడ్డు…. ఇప్పటి వరకు ఒక్క సరి కూడా జీమ్ మిస్ చేయాలె…..

 

ఇంకా బాబు కి తన అమ్మ తన గ్రాని అంటే ప్రాణం.

 

 

వాళ్ళ అమ్మ కన్నా తన గ్రాని దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు…

 

చిన్నప్పటి నుంచి… తన గ్రాని హెడ్ మసాజ్ అంటే రామ్ కి బాగా ఇష్టం….. అమెరికాలో ఉన్నప్పుడు బాగా మిస్ ఐయ్యేవాడు…. కానీ తన గ్రాని దగ్గరకు వచ్చినప్పుడు…. కచ్చితంగా డైలీ 2 టైమ్స్ హెడ్ మసాజ్ చేపించుకుంటాడు…. మాటలతో.

 

ఆ హెడ్ మసాజ్ చేసేటప్పుడు మాటల్లో…. తన గ్రాని కి ఎంతో బాగా ముచ్చట్లో మునిగిపోతాడు బాబు.

 

 

ఇంకా రామ్ వాళ్ళ అమ్మ చేతి వంట అంటే బాబు కి బాగా ఇష్టం…. వాళ్ళ అమ్మ వంట ని ఎంతో ఇష్టంగా కడుపు నిండా తింటాడు.

 

 

ఈ ఇద్దరి దగ్గరే బాబు బాగా కూల్ గా…. హ్యాపీ గా… చిన్నపిల్లాడిలా మారిపోయి…. ఇష్టంగా వాళ్ళతో ఉంటాడు.

 

 

మిగతా అందరి దగ్గర వేటాడే సింహం మాదిరి…. అందరిని హడాలేతిస్తాడు.

 

 

ఇది అండి… బాబు గారి స్టోరీ…..

 

 

ఇంకా ప్రెసెంట్ కి వద్దమా….

 

బాబు బాగా… కోపం మీదే…. రెడీ అవుతున్నాడు…. డ్రెస్సింగ్ రూమ్ లో కి వచ్చి…. కాబోర్డ్ ఓపెన్ చేసి చూసి…. బ్లూ కలర్ షూట్ ని సెలెక్ట్ చేసుకొని…. దానిని వేర్ చేసాడు బాబు.

 

 

మంచి రాయల్ షూస్ వేర్ చేసి…. లెఫ్ట్ హ్యాండ్ కి వాచ్…. రైట్ హ్యాండ్ కి…. గోల్డ్ కడియం తో…. లెఫ్ట్ చెవికి…. చిన్న స్టోన్ ఉన్న ఇయర్ రింగ్.

 

 

ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడు అంటే…. చూడగానే చెప్పొచ్చు…. నవయుగ మోడరన్ మన్మధుడు అని.

 

 

రెడీ ఐ…. రూమ్ బయటకు వచ్చి…. Thana గ్రాని ఉన్న గది లో కి వెళ్ళడానికి లిఫ్ట్ లో 1st ఫ్లోర్ కి వెళ్ళాడు రామ్.

 

 

డోర్ తీసుకొని లోపలకు వెళ్ళగానే… అక్కడ రాజారామ్ గారికి… మేడలో గోల్డ్ చేయిన్ వేస్తూ ఉంది మహాలక్ష్మి గారు.

 

 

వాళ్ళని ఆలా చూసి…. వావ్… రొమాంటిక్ కపుల్స్ అని కంప్లీమెంట్ ఇస్తూ లోపలకు వచ్చాడు రామ్.

 

 

ఏంటి కన్నా నువ్వు అని అంటూ… తన చేతుల్లో మొఖాన్ని దాచుకుంటారు ఆవిడా.

 

 

వాట్ తాతయ్య…. నువ్వు సిగ్గు పడవ అని కొంటేగా ంటాడు రామ్.

 

సిగ్గు పడే టైపు మనము కాదే… కానీ… వెళదామా…. టైం అవుతుంది అని అంటూ… తన కండువా ని సరి చేసుకుంటూ అంటాడు రాజారామ్.

 

 

 

హ.. తాతయ్య…. రెడీ… వెళదాం పదండి… అని అనగానే……

 

 

గ్రాని మామ్… ఎక్కడ రెడీ అయ్యిందా అని అడుగుతాడు రామ్.

 

 

హ కన్నా… రెడీ అయింది హాల్ లో వెయిట్ చేస్తున్నారు… పద అని ముగ్గురు…. లిఫ్ట్ లో హాల్ లో కి వస్తారు.

 

 

సుప్రజ గారు…. పట్టు చీర లో…. నిండుగా…. తెలుగు తనం ఉట్టిపడేలా…. పద్దతిగా ఉన్నారు.

 

 

మామ్…. యూ లూకింగ్… Gorgeous…. చాలా బాగున్నావు తెలుసా అని చిన్న కంప్లిమెంట్ ఇస్తాడు రామ్.

 

 

రామ్ దగ్గరకు వచ్చి…. నుదిటి మీద ముద్దు పెట్టి…. తన కళ్ళ కు ఉన్న కాటుక వెలికి పెట్టుకొని…. రామ్ కి చెవి వెనుక పెట్టి…. మొటికలు విరిచి….. నా బంగారు కొండా అని తన కొడుకును చూసి మురిసి పోతారు సుప్రజ గారు.

 

 

ఏంటి మామ్… నువ్వు…. అని చిన్న స్మైల్ ఇస్తాడు రామ్.

 

 

పెళ్లి కి ఇంకా లేట్ అవ్వడం తో…. కార్ లో ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు నలుగురు.

 

 

 

కార్ ని రామ్ డ్రైవింగ్ చేస్తున్నాడు….. ఆలా నలుగురు… ఎయిర్పోర్ట్ కి వెళ్లగా…. అక్కడ వీళ్లది సొంత ఫ్లైట్ ఉండటం తో….. డైరెక్ట్ గా ఫ్లైట్ లో హైద్రాబాద్ కి స్టార్ట్ ఐయ్యారు.

 

 

ఆలా గంట ఫ్లైట్ జెర్నీ తరువాత…. హైద్రాబాద్ ఎయిర్పోర్ట్ లో రీచ్ ఐయ్యారు.

 

 

తరువాత కార్ లో…..రామాపురం… కి బయలుదేరారు….

 

 

అప్పటిమ్ రామ్ కి బాగా చికాకు ఉంది… జెర్నీ వాళ్ళ….

 

మెయిన్ గా చెప్పాలి అంటే…. పల్లెటూర్లకు వెళ్ళాలి అంటే బాబు కి నచ్చదు…. మెయిన్ గా అక్కడ సిగ్నల్స్ ఎం ఉండవు అని ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవడానికి ఉండదు అని…. బాబు గారి ఫీలింగ్…..

 

 

కార్ లో గూగుల్ చూపిస్తున్న రూట్ లో నే బాబు గారు డ్రైవ్ చేస్తున్నాడు కానీ… పిచ్చ ఇర్రిటేషన్ లో ఉన్నాడు.

 

 

 

 

ఆలా 3 హౌర్స్ కార్ జర్నీ తరువాత…. రామాపురం అయితే రిచ్ ఐయ్యారు కానీ… అక్కడ రోడ్ ల ను చూసి…. బాబు కి బాగా కోపం వస్తుంది…. 

 

 

చా…. ఏంటి ఈ రోడ్స్…. బాగా ఇర్రిటేటింగ్ గా ఉంది…. అయినా ఏంటి తాతయ్య ఇది… అంత నీ వాళ్లే అని కోపంగా స్టిరింగ్ ని తిప్పుతున్నాడు రామ్.

 

 

పల్లెటూరులు కదా నాన్న…. రోడ్స్ ఇలానే ఉంటాయి….. ఎవరు పట్టించుకుంటారు చెప్పు…. పల్లెటూరులని…. టైం చూసుకొని… మనమే ఈ ఉరిని బాగుచేపించాలి అని అంటాడు రాజారామ్.

 

 

అప్పుడే…. మెల్లిగా చినుకులు స్టార్ట్ ఐ…. జోరుగా వర్షం అందుకుంది.

 

 

అంటే బాబు కి ఒక లెవెల్ లో కోపం ముంచుకోస్తుంది….

 

తాతయ్య…. ఫుల్ గా రెయిన్ పడుతుంది…. రోడ్స్ కూడా బాగోలేవు…. ఫోన్ లో సిగ్నల్స్ లేవు…. ఇప్పుడు పెళ్లి కి ఎలా వెళ్ళాలి అని కోపంగా అరుస్తాడు రామ్.

 

 

కూల్ కన్నా… ఎందుకు… ఆలా కోపడుతున్నావు…. నాకు పెళ్లి వాళ్ళ ఇల్లు తెలుసు కానీ…. ముందు నువ్వు కార్ స్టార్ట్ చెయ్ అని అంటాడు రాజారామ్.

 

 

ఏంటి తాతయ్య స్టార్ట్ చేసేది….ఈ వర్షం లో ఎలా వెళ్లడం… అని కోపంగా అంటాడు రామ్.

 

 

ఎందుకు రా అంత చికాకు నీకు….ఇంత చికాకు కోపం ఉంటే ఎలా…. ఒక వేల…. నీకు పల్లెటూరు అమ్మాయి నీకు భార్య గా వస్తే అప్పుడు ఎం చేస్తావు…. అని నవ్వును దస్తూ అంటాడు రాజారామ్.

 

 

నో… నెవెర్…. అసలు పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను కానీ… ఈ పల్లెటూరు అమ్మాయిలను నేను అస్సలు పెళ్లి చేసుకోను…. అని తేల్చి చెప్పేస్తాడు రామ్.

 

 

నువ్వు అనుకుంటే జరుగుతుందని ఏంటి…. నువ్వు ఇంతలా అంటున్నావు కాబట్టి…. నేను అయితే ఒక పల్లెటూరు అమ్మాయిని…. ఏరి కోరి మరి నీకు పెళ్లి చేస్తా చూడు…. ఇదే నా మాట అని సీరియస్ గా అన్నట్టు అంటాడు కానీ…. జోక్ గా అంటాడు రాజారామ్.

 

 

మీరు అనుకుంటే ఏంటి తాతయ్య… నేను చేసుకోవాలి కదా….. నెవెర్…. నేను అస్సలు చేసుకోను… అని కోపంగా కార్ స్టార్ట్ చేసాడు రామ్.

 

 

అయినా ఈ ఊరు లో ఎవరు ఉన్నారు తాతయ్య నీకు తెలిసిన వాళ్ళు…. ఒకటే పెళ్లి పెళ్లి అని నన్ను తీసుకెళ్తున్నావు డ్రైవ్ చేస్తూనే అడుగుతాడు రామ్.

 

 

 

 

సత్యనారాయణ… అని ఒక మంచి వ్వక్తి…. ఈ ఊరు లో నే వ్యవసాయం చేసే రైతు….. ఒక సరి మీ నాన్న… బిసినెస్ పర్పస్ లో… ఈ ఉరి కి వచ్చాడు…. అప్పుడు మీ నాన్న…. ఏదో వర్క్ మీద రోడ్ మీద నుంచి నడుస్తూ వస్తుంటే…. సడెన్ గా…. ఒక బస్…. మీ నానా ఉన్న సైడ్ కి… వచ్చింది…. అది మీ నాన్న చూసుకోకుండా అలానే నడుస్తూ ఉండగా…. ఇంకా ఒక్క సెకండ్ అయితే… బస్ తగులుతుంది అనగా…. సత్యనారాయణ అని ఆ వ్వక్తి వచ్చి…. మీ నాన్న ని పక్కకు లాగాడు…. అంతే సెకండ్స్ తేడా తో మీ నాన్న ని అతను రక్షించాడు…. లేదంటే ఎం జరిగేదో కూడా ఊహించలేను…..

 

 

ఎలాంటి వ్వక్తి… మీ నాన్న ని కాపాడే సరికి….. కృతజ్ఞతగా…. డబ్బు ఇస్తా అన్న తీసుకోలేదు….

 

 

అతని ఆత్మభిమానానికి మాకు అతను బాగా నచ్చడు…. కానీ అతని కి రుణపడిపోయాము అన్న ఒకే ఒక్క లోటు ఉండేది.

 

 

మేము అంత కూడా వెళ్లి… అతడిని అడిగాము డబ్బు అయినా… ఉద్యోగం అయినా ఇస్తాము అని… కానీ అతను సున్నితంగా నిరకరించడం తో…. మేము ఎం చేయలేక పోయాము….

 

కానీ అతనికి నాకు ఛాన్స్ వస్తే… నేను కచ్చితంగా ఆ రుణాన్ని తీర్చుకుంటాను… అది ఎంత కష్టం అయినా సరే….

 

 

మీ నాన్న కి అతను మంచి తనం నచ్చి…. ఎప్పుడైనా హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఇతడిని కలిసి వెళ్తాడు….. నేను కూడా చాలా టైమ్స్ ఇతడిని కలిసాను… ఆలా ఆ మర్యాద తో నే… అతను తన పెద్ద కూతురి పెళ్లి కి ఇన్విట్ చేసాడు… అని రాజారామ్ గారు చెప్తాడు…

 

 

తన కూతురి పెళ్లి కి అయినా డబ్బు ఇస్తా అన్న కూడా…. అతను ఒప్పుకోలేదు… ఎలాంటి మంచి మనిషి అతను అని చెప్పుకుతూ పోతాడు రాజారామ్ గారు.

 

 

ప్లీజ్ ఫాలో మీ గయ్స్ 🥰