స్నేహ ని రెడీ చేసిన లక్ష్మి గారు…. ఒక సరి స్నేహ ని చూసి… ఎంత ముద్దుగా ఉన్నవో…. నా బంగారం అంటూ… నుదిటిన ముద్దు పెట్టుకుంది లక్ష్మి గారు.
స్నేహ కి ఎం అర్ధం కావడం లేదు…. ఎందుకు తనని ఇలా రెడీ చేస్తున్నారో తెలియక….. లోపల టెన్షన్ పెరిగిపోతుంది…. ఇంకా ఆర్యన్ కూడా తనను…. మార్నింగ్ నుంచి…. మంచిగా ట్రీట్ చేస్తుంటే…. ఎందుకో అనుమానంగా ఉంది స్నేహ కి.