నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 1
ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు.
అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది.
ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.
ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది.
ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది.
ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని చూపులు ఆమెను తాకుతున్నాయి.తన శరీరంలో ఇంతితై వలపింతై విరహపు జ్వాలలు ఆమెను చుట్టు ముట్టాయి. దూరం నుండి అతని పిలుపు తన చెవుల్లో మారు మోగుతుంది.
నిజంగా తన పేరు ఇంత మధురంగా ఉంటుందా అని ఆమె మురిసిపోయింది. ఇంతకీ ఎవరతను? తొందరగా అతన్ని చేరుకోవాలి. తనలో ఐక్యం కావాలి. ఎవరతను. అతన్ని చేరుకోవాలి, తనలో కలిసి పోవాలి.
అంతే, ఆమె లేచి నిలబడింది. వెండి మువ్వలు చిరు శబ్దం చేస్తూ ఉంటే ఆమె లయబద్ధంగా నడుస్తూ అతన్ని చేరుకుంటుంది.
అతన్ని చే..రు..కుంటుంది.. వెంటనే ఆత్రుతగా కౌగిలించుకుంది. చెవిలో గుస గుస.. వడి వడి పెదవుల కలయిక.. భగభగమండే వేడి నిట్టూర్పులు.. ఆమె కాటుక కళ్ళు తెరుచుకున్నాయి.
అతని కళ్ళల్లో ఏదో వెతకసాగింది. ఆ కళ్ళను చూసి ఆమె తట్టుకోలేకపోతుంది.. ఆ కళ్ళల్లో వెల్లువ.. ప్రేమ వెల్లువ..
పొడవైన బాహువులు ఆమెని గట్టిగా చుట్టేయడంతో అంత చలి వెదర్ లో కూడా వెచ్చగా అనిపిస్తోంది.
అతడి ఊపిరి అంత దగ్గరగా తాకుతుంటే ఒల్లంతా సెగలు పుడుతోంది.
మరింత గట్టిగా హత్తుకొని ‘‘నిజంగా నువ్వేనా, నాకోసం వచ్చావా’’ అని అడిగిందామె.
అతడి పెదవులు విచ్చుకున్నాయి
ఆ నవ్వు కోసం ఏదైనా చేసేయొచ్చు, సర్వం అర్పించేయొచ్చు.
అంత మనోహరంగా ఉంది ఆ స్మైల్.
మెల్లగా మీదకి వంగి పెదవులు అందుకున్నాడు..
మెత్తటి పెదాలకి తోడు, గరుకు గడ్డం కలిసిన ఆ ముద్దు ఆమెకి స్వీట్ పెయిన్ గా మారింది.
అతడి చేతులు ఆమె మెడ మీద నుంచి నిదానంగా కిందకి జారాయి.
అతడు ఒల్లంతా తడుముతుంటే ఇంకా ఏదో కావాలి అనిపిస్తోంది.
మరింత గట్టిగా అతడిని అల్లుకొని పోయింది.
గాలి కూడా దూరనంత దగ్గరగా హత్తుకున్నారు ఇద్దరు.
ఇద్దరూ ప్రేమ మైకంలో మునిగి ఉండగా, ఉన్నట్టుండి సడన్గా సముద్రం ప్లేస్ లో పెద్ద కొండ ప్రత్యక్షమైంది
ఏమైందో ఏమో ఇద్దరూ అలాగే హత్తుకొని కొండ మీద నుంచి కిందకి జారిపోయారు.
భయంకరమైన లోయని చూడగానే ఆమెకి గుండె ఆగినంత పనైంది. గాలి వేగంగా వీస్తోంది.
హెల్ప్, హెల్ప్ అని అరవాలి అనిపిస్తోంది. కానీ గొంతు పెగలడం లేదు.
ఒల్లంతా చెమటలు పడుతున్నాయి.
గట్టిగా తల విదిల్చి కేక పెట్టిన స్వప్నిక టక్కున లేచి కూర్చుంది. తీరా చూస్తే తను బెడ్ మీది నుంచి కింద పడి ఉంది.
అది తన రూమే…మరి కొండెక్కడ పోయింది.
నాతో రొమాన్స్ చేసిన ఆ రాజకుమారుడు ఏడి? లోయలోకి ఎందుకు పడిపోయా? వరుస ప్రశ్నలు బ్రెయిన్ ని హీటెక్కించాయి.
“ఏంటో, ఈ కల, చావగొట్టేస్తోంది” అని మనసులో అనుకుని లేచి ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళీ, వాటర్ బాటిల్ తీసుకుని మొత్తం తాగేసి, తిరిగి వచ్చి రూంలో బెడ్ మీద కూర్చుంది స్వప్ని.
అతని స్పర్శ ఇంకా తన ఒంటిపై అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ముద్దు, నిజంగా సూపర్. కలలోకి వచ్చి కిస్ పెట్టేవాడెవడ్రా బాబూ, అనుకుంటూ, సెల్ ఫోన్లో టైమ్ చూడగా, ఎర్లీ మార్నింగ్ ఫోరో క్లాక్.
తల పట్టుకొని,
‘అంటే ఈ టైం లో వచ్చిన కలలు నిజమవుతాయంటారు. కలలో వెంటాడే అతను నిజంగానే నాకు ఎదురౌతాడా? ఆ వెన్నెల వెలుగులో అతని ముఖం సరిగా కనిపించలేదు.
రొమాన్స్ సంగతి వదిలేస్తే, కలలో లాగ ఇద్దరం లోయలో పడిపోతామా? చచ్చిపోతామా? అసలు ఆయనెవరు? మగధీర సినిమా లాగా నా గత జన్మ ప్రేమికుడా? నేనెళ్లి వెతుక్కొని కలుసుకోవాలా?’’ అని కాసేపు ఆలోచించి, తల మీద చిన్నగా కొట్టుకొని,
‘షిట్, చిన్న పిల్లలా ఏంటీ ఈ పిచ్చి ఆలోచనలు? స్వప్ని అన్నీ వదిలెయ్, అది జస్ట్ కల అంతే, ఆయన గారి ముఖం కూడా కనిపించలేదు కాబట్టి పని చూసుకో’ అని తనకి తాను చెప్పుకొని, ల్యాపీ ముందేసుకొని మెయిల్స్ చెక్ చేసుకునే పనిలో పడింది.
ఇంతలో పని మనిషి సీతాలు అక్కడికి వచ్చి,
“అమ్మాయి గారు అప్పుడే లేచారా? కాఫీ తీసుకు రమ్మంటారా?”అని అడిగింది.
తలెత్తి చిన్నగా నవ్విన స్వప్నిక,
“నీ సిన్సియారిటీ నచ్చింది సీతాలు, నేను ఏ టైంలో లేచినా, అలర్ట్ గా ఉండి, నాకు కావాల్సినవి అమర్చి పెడుతున్నావ్, గ్రేట్”అని అంది.
సీతాలు సిగ్గుపడిపోతూ
“మీ నాన్న గారు మీ బాధ్యతని నాకు అప్పగించారు. మిమ్మల్ని చూసుకోవడం తప్ప నాకు ఏం పనుంది చెప్పండమ్మా? పెళ్లి చేసుకోవాల్సిన వయసులో అది వదిలేసి, జాబ్, వర్క్ అని తిరుగుతున్నారు. సరైన వయసులో తాళి కట్టించుకొని ఉంటే ఒడిలో ఒకరు, కడుపులో ఒకరు ఉండేవాళ్లు. చెబితే వినిపించుకోరు” అని బాధపడింది.
‘అబ్బా, మళ్లీ పెళ్లి గోల మొదలు పెట్టింది, వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి’’ అనుకున్న స్వప్నిక,
“అబ్బ సీతాలూ, పొద్దున్నే మొదలెట్టావా? పెళ్లి పెళ్లి అనే నీ అరిగిపోయిన పాత రికార్డు. ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయా.. ఆ కల మళ్ళీ వచ్చింది తెలుసా?”అని అంది.
సీతాలు కళ్లు పెద్దవి చేసి, “అమ్మ నాకు మీ అంత లోక జ్ఞానం లేకపోయినా ఒక చిన్న విషయం చెబుతాను వినండి, మీరు బయటకు చెప్పరు కానీ, ఈ కలని బట్టి చూస్తే మీ మనసు తొందరగా ఓ తోడు వెతుక్కొమ్మని చెబుతుందేమో” అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది.
స్వప్నిక చిరాగ్గా చూసి,
‘అబ్బా, ఈ పెద్ద వాళ్లకి కీ ఇస్తే చాలు, ప్రపంచంలో పెళ్ళి తప్ప ఇంక వేరే పనీ పాటా ఏదీ లేనట్టు మాట్లాడతారు.’అని మనసులో తిట్టుకుంది.
మళ్లీ అంతలోనే ‘అయినా ఈసారి సీతాలు కరెక్ట్ గానే చెప్పిందిలే. కానీ ఈ ప్రేమ, పెళ్లి అంటే నాకు భయం.. కాకపోతే మనిషికి ఒక తోడు ఉంటే ఎన్నో ఉపయోగాలు అని పేపర్లో, టీవీలో, ఎందరో చెప్తున్నారు. సరైన తోడు దొరికితేనే కదా, ఈ కలలన్నీ ఫుల్ ఫిల్ అయ్యేది.
ఖర్మ కాలిపోయి, ఆ వచ్చినోడు నా ఫీలింగ్స్ కి వ్యాల్యూ ఇవ్వకుంటే? మర్రి చెట్టు నీడలో ఏ మొక్క పెరగదన్నట్టు ఆ తోడు నీడ లో నా ఫీలింగ్స్ ని, నా గోల్స్ ని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని, ఆటిట్యూడ్ ని వదులుకోవాల్సి వస్తే? అమ్మో నా వల్ల కాదు’’ అనుకొని తన గుండె మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ భయపడింది స్వప్నిక.
కానీ తన ఆలోచనలకు తగ్గట్టుగా తన లైఫ్ ఉండదని..తనని ఒక త్సునామీ మూంచేస్తుందని పాపం ఆ సమయంలో స్వప్నిక ఊహించలేదు.. అంటే స్వప్నిక కల నిజమౌతుందా?? తెలుసుకోవడానికి తరువాతి ఎపిసోడ్ చదవండి..
అలాగే మీ రేటింగ్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేసీ నేను రాస్తున్న ఈ స్టోరీనీ ప్రమోట్ చేయండీ..🙏
(కొనసాగుతుంది)
Swipe left/right or tap the sides to turn pages