New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 2

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 2

సరైన తోడు దొరికితేనే కదా, ఈ కలలన్నీ ఫుల్ ఫిల్ అయ్యేది. ఖర్మ కాలిపోయి, ఆ వచ్చినోడు నా ఫీలింగ్స్కి వ్యాల్యూ ఇవ్వకుంటే?

మర్రి చెట్టు నీడలో ఏ మొక్క పెరగదన్నట్టు ఆ తోడు నీడ లో నా ఫీలింగ్స్ ని, నా గోల్స్ ని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని, ఆటిట్యూడ్ ని వదులుకోవాల్సి వస్తే?అమ్మో నా వల్ల కాదు’’ అనుకొని ఛాతి మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ భయపడింది స్వప్నిక. 

 ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. దీనికి రివర్స్ కూడా ఉంది. చాలా మంది ఆడవాళ్ళ పతనం వెనక ఒక మగవాడు ఉంటాడు.  

ఈ మధ్యకాలంలో మ్యారేజ్ చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీస్ విడాకుల కోసం కోర్టుల చుట్టూ
తిరుగుతున్నారు. పెళ్ళయిన చాలామంది ఆడవాళ్ళు 
తమ కెరీర్ కోసం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు 
అనుకుంటూ,పరధ్యానంగానే సెల్ ఫోన్ లో టైం  చూసుకొని, “అమ్మో సెవన్ అవుతుంది” అని 

   ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని,  “సీతాలూ, కాఫి”అని అరిచింది స్వప్నిక.

    ఇంతలో కాఫీ తీసుకువచ్చిన సీతాలు,
    “ఇదిగో అమ్మా, కింద ఫోన్ కి మల్లిక మేడమ్ కాల్  చేసింది. నీ సెల్ ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుందంట.
ఈ రోజు ఆఫీస్ లో ఏదో మీటింగంట కదా!” అని అంది.

 టక్కున లేచి నిలబడిన స్వప్నికా, ఆ రోజు షెడ్యూల్    
గుర్తు చేసుకొని “అవును సీతాలు. ఒక అర గంటలో 
కిందికి వస్తా. త్వరగా టిఫిన్ రెడీ చెయ్.” అని చెప్పి, 
సెల్ ఫోన్ ని స్విచ్ ఆన్ చేసి, చార్జింగ్ పెట్టి ఫ్రెష్ 
అవడానికి వాష్ రూమ్లోకి దూరింది.

బయటకి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి,‘ఏయ్ స్వప్నీ, నువ్వు సూపరే, అందంలో నిన్ను 
కొట్టేవారే లేరు’ అనుకొని మురిసిపోయి, చీర  కట్టుకోవడంలో పడిపోయింది.

లైట్ గ్రీన్ కలర్, విత్ లైట్ ఆరెంజ్ బోర్డర్ చీర     
కట్టుకుని, గ్రీన్ కలర్ నెటెడ్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్, 
మెడలో సన్నని చైన్, లైట్ మేకప్, మరీ చిన్నదీ పెద్దదీ 
కాని నలుపు రంగు బొట్టుతో, లూజ్ గా వదిలేసిన 
 జుట్టు గాలికి ఎగురుతూ అందాల బొమ్మలా ఉంది 
స్వప్నిక.

మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్వప్నిక ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉంటుంది. ఆమె మేడ మీది నుండి కిందకి దిగొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉండగా, ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చింది సీతాలు.

హ్యాండ్ బ్యాగ్ లోని ఫోన్ రింగ్ కావడంతో, బయటకి    
తీసి స్క్రీన్ మీద పేరు చూసిన స్వప్నిక, ‘‘మేడం ఎందుకు కాల్ చేస్తుంది?’’ అనుకొని, కాల్ లిఫ్ట్ చేసి, 

     “గుడ్ మార్నింగ్ మేమ్” అని‌ అంది.

   అటు నుండి తను పని చేసే కంపెనీ జనరల్ మేనేజర్ 
    మల్లిక మేడం “వెరీ గుడ్ మార్నింగ్ మై ఏంజిల్.. నీ   
ఫోన్ ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ వచ్చిందేంటి?” అని అడిగింది.

“అవును మేమ్. రాత్రి చార్జింగ్ పెట్టడం మరిచిపోయాను. ఉదయం నుంచి నేను పని లోనే  ఉన్నాను. అందుకే చూసుకోలేదు.” అని అంది స్వప్నిక.

    చిన్నగా నవ్విన మల్లికా మేడం,
“ఇట్స్ ఓకే స్వప్నికా, నీ లాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఎప్పుడో ఒకసారి మిస్టేక్ జరిగితే నో ప్రాబ్లం. ఎంతవరకు వచ్చింది మన ప్రోగ్రాం?”అని అడిగింది.

    “నో ప్రాబ్లం మేడం, ఎవ్రీథింగ్ ఓకే. ఈవినింగ్ షార్ప్ గా  
సెవన్ వో క్లాక్ మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. నేను 
గంటలో మన ఆఫీస్ దగ్గర ఉంటాను.” అని అంది స్వప్నిక.

   “సరే, ఆ టైంకి నేను వస్తాను.”అని చెప్పి ఒక రెండు 
 నిమిషాలు మాట్లాడిన తరువాత ఫోన్ కట్ చేసింది మల్లికా మేడం.
ఆ తర్వాత ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ కనిపించాయి. 
డెకరేషన్, క్యాటరింగ్, ఈవెంట్ ఆర్గనైజర్ నుంచి వచ్చిన కాల్స్ అవి. అందులో కావ్య నెంబర్ చూసి 
తిరిగి కాల్ చేసిన స్వప్నిక,
 “ఏంటి కావ్య? ఫోన్ చేసావ్?” అని అడుగుతుంది.

 “హాయ్ స్వప్నీ ఎలా ఉన్నావ్?”అని అటువైపు  నుండి అడిగింది కావ్య.

   “ఎలా ఉన్నాను ఏంటి? కావ్యా, నిన్న నే కదా  మనం కలిసింది. మనం కలుసుకోకుండా సమ్ ఇయర్స్ అయినట్టు ఏంటా మాటలు?”అని అంది స్వప్నిక.

  దానికి  నవ్విన కావ్యా,
“అదేంటే, వాయిస్ చాలా మత్తుగా వస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్ తో అలా షికార్లు కొట్టి లేట్ నైట్ పడుకున్నావా ఏంటి?”అని అంది..

  కావ్య అలా దీర్గాలు తీస్తూ మాట్లాడటం ఏమాత్రం 
నచ్చని స్వప్నిక, 
“చత్, నోరు ముయ్యి. ఎప్పుడు డబుల్ మీనింగ్ మాటలు నువ్వూనూ. అసలు ఫోన్ ఎందుకు చేసావో చెప్పేడు” అని కోపంగా అంది..
 చిన్నగా నవ్విన కావ్య,
 “మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ రోజు. రేపట్నుంచి మన ఆఫీస్ లో ఏడుపులు ఉండనే ఉండవు తెలుసా? అని అంది..

“ఏడుపులా? అవును మరి, పని దొంగలకు మల్లికా మేడం అంటే హడల్ కదా, అందుకే ఇక రేపటి నుంచి మీలాంటి వాళ్లు హ్యాపీగా ఉండొచ్చు.”అని సీరియస్ గా అంది స్వప్నిక.

     దానికి  కేర్లస్ గా రియాక్ట్ అయిన కావ్య,
“పోవోయ్, లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి. దాంతో పాటు పని చేయాలి. ఊరికే పనీ.. పనీ..పనీ అంటే ఎలా? అబ్బా, బోరింగ్ పీపుల్. అయినా నీకో విషయం తెలుసా, వచ్చే బాస్  అబ్బాయట. చాలా అందంగా ఉంటాడట, ఇంకో విషయం, పెళ్ళి  కూడా కాలేదంటా, తెలుసా?.”అని చివరి నాలుగు మాటలు రహస్యం చెబుతున్నట్టు గుసగుసలాడింది.
     
 “సో వాట్? హా, అయితే ఏంటంట, మనకి పని ముఖ్యం, ఆడైనా, మగైనా, ఐ డోంట్ కేర్” అని అంది స్వప్నిక.
చిన్నగా నవ్విన కావ్య,    
“ఓకే యార్, అదే మరి, నీకూ పెళ్ళి కాలేదు.ఆయనకీ పెళ్ళి కాలేదు. తమరు పనికి తప్ప మిగతా వాటికి ఆమడ దూరంలో ఉంటారాయే. ఇప్పుడు అదే పని కోసం ఆ పెళ్లి కాని మగవాడి  సమక్షం లోనే ఉండాలి మరి.”అని  అంది.

  దానికి ఏం భయపడనట్టు ఫేస్ పెట్టిన స్వప్నిక,
 “ఓ అదా నీ బాధ? నేను ఎవరికీ లొంగనని నీకు తెలుసు కదా. నా జోలికొచ్చిన వాళ్ళకు అదే అంతకు ముందు ఆ రమణ గాడికి పట్టిన గతే పడుతుంది.”అని సీరియస్ గా చెప్పింది.

“సరేగాని నువ్వు ఇంకా ఇంట్లో నుండి స్టార్ట్ కాలేదా?
ఇక్కడ మేం అంతా నీ కోసం వెయిటింగ్ తెలుసా? 
ఆ మురళీ గాడి ఫోన్ వస్తుంది. నాకిక ఒకటే నస 
మొదలవుతుంది. వీడితో తల నొప్పి” అని గోల చేసింది కావ్య.
 “ఏంటి అందరికీ లవ్వూ, కొవ్వూ అంటూ క్లాస్ పీకే 
  నువ్వు మాత్రం నీ దాక వస్తే ఏడిపిస్తావు. నచ్చితే నచ్చావని చెప్పు. లేకపోతే లేదు. ఎందుకే వాణ్ణి ఊరికె నీ చుట్టు తిప్పుకుంటూ ఆడిస్తున్నావ్.” అని నవ్వింది స్వప్నిక.

 “ఓసి పిచ్చి మొద్దూ, ఇనుము వేడిగా ఉన్నపుడే మనం వంచాలే. ఇంత త్వరగా లొంగితే ఎలా? చూద్దాం. మిగితావి ఆఫీస్ లో మాట్లాడుదాం బై.” అని అంది కావ్య.

“ఒక గంటలో మీ ముందు ఉంటాను సరేనా?”అని   చెప్పి ఫోన్ కట్ చేసింది స్వప్నిక.

స్వప్నిక ఒక పెద్ద ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రోడక్ట్స్ 
 మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈవో గా  పనిచేస్తుంది. దాని పేరు ఎస్ ఎన్. ఎస్ బ్యూటీ ప్రోడక్ట్స్ కంపెని. దీని మెయిన్ బ్రాంచ్ ప్యారిస్ లో ఉంది.

చాలా సంవత్సరాలుగా ఈ బ్యూటీ ప్రొడక్ట్స కీ మంచి బ్రాండెడ్ వని మార్కెట్ లో పేరుంది.ఇప్పుడు మరో కొత్త బ్యూటీ ప్రోడక్ట్ ని ఈ రోజు మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. దీని పైన ఒక మూడు నెలలుగా ఈ ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. 

స్వప్నిక తన కారులో ఆఫీస్ కి వెళుతూ సిటీ లో అన్ని మెయిన్ సెంటర్స్ లో తను పెట్టించిన కంపెనీ హోర్డింగ్ లను చూసింది.

ఇంతలో మల్లికా మేడం ఫోన్ చేసి,
“స్వప్నికా, మన హోర్డింగ్స్ ఎక్కడెక్కడ పెట్టించావ్?”అని అడిగింది.

 “సికింద్రాబాద్ నుండి ట్యాంక్ బండ్ వరకూ, రోడ్డుకి రెండు వైపుల ఆ హోర్డంగ్స్ పెట్టించాను మేడం. అందమైన మోడల్స్ తో ఎస్.ఎన్.ఎస్. కంపెనీ బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు.. ఈ రోజు లాంచ్ చేయబోయే కొత్త బ్యూటీ ప్రోడక్ట్ గురించి ఆ హోర్డింగుల పై రాయించాను. మీరు చూసారుగా” అని అంది స్వప్నిక. 

“ఏస్ స్వప్నికా, దీని వెనుక నీ కృషి ఎంతో ఉంది. యాడ్ కి కాన్సెప్ట్ రెడీ చేయడం, స్క్రిప్ట్ వర్క్, ఫోటో షూట్ చేయించడం, తరువాత వీడియా యాడ్,  అవుట్ డోర్ షూటింగ్ వర్కు, ప్రొడక్షన్ వర్క్, ఆర్,ఆర్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయించావు నువ్వు.  నిజంగా ఐ అప్రిషియెట్ యూ.. 

 బట్, ఇన్ని రోజులుగా ప్యారిస్ లోని హెడ్ ఆఫీస్
 ని చూసుకుంటున్న మన ఎస్ ఎన్ ఎస్ కంపెనీ చైర్మన్ 
 ఇప్పుడు హైదరాబాద్ లోని ఆఫీస్ వ్యవహారాలను 
 చూసుకోడానికి వస్తున్నారు. బీ.కేర్ ఫుల్ “ అని టూ 
  మినెట్స్ మాట్లాడీ ఫోన్ కట్ చేసింది మల్లిక.

   ‘హూ.. కొత్త హోదాలొ కొత్త ఛైర్మెన్.. ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. ఎలా ఉంటాడో తెలియదు. కానీ చాలా టాలెంటెడ్ అని, చిన్న వయసులోనే, అతి తక్కువ టైంలో ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీస్ అన్నింటిలో తన బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీని, ది ఫస్ట్ అండ్ ది బెస్ట్ గా’ తీర్చి దిద్దాడని అంటారు..చూడాలి మరి.. ” అని అనుకుంది స్వప్నిక..

స్వప్నిక లైఫ్ లోకి ఎంటరవుతున్న త్సునామీ ఇతనేనా?
ఏమో ఎవరికి తెలుసు? తెలుసుకోడానికి తరువాతి ఎపిసోడ్ చదవండి..

హాయ్ ఎవ్రీ వన్… కథ మీ మనసును తాకితే తప్పకుండా మంచి రేటింగ్ ఇచ్చీ. కామెంట్స్‌ తో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకుని సపోర్ట్ చేయండి.. స్టోరీని ప్రమోట్‌ చేయండి.. థ్యాంక్యూ🙏
(కొనసాగుతుంది)