New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నా ప్రపంచం. – 1

నువ్వే నా ప్రపంచం. – 1

 

 

 

  “తొందరగా రావే.”అంటూ కారు డోర్ తీసింది స్రవంతి. 

   “ఆ వస్తున్న. వెయిట్.”అని ఇంకో అమ్మాయి స్వీట్ వాయిస్ వినిపించింది. 

 

  అప్పుడే మెల్లగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తుంటే “ఫాస్ట్.. వర్షం పడేలా ఉంది.”అని డోర్ తీసి కారులో కూర్చుంది స్రవంతి. 

 

   కారు నుండి బయటకు చూసిన ఆమెకి షాపులో ఇంకా ఏదో కొంటున్న ఆమె ఫ్రెండ్ కనిపించింది. 

 

  “అబ్బా.!ఇంకా ఎంత సేపే తల్లి..”అని కారులో నుండి అరిచింది స్రవంతి. 

 

   “ఒక్క నిమిషం ఆగలేవానే?”అంటూనే ఆ షాప్ నుండి బయటకు వచ్చింది ఆ అమ్మాయి. 

 

   ఆమె అలా రోడ్ మీద అడుగు పెట్టిందో లేదో చప్పున వర్షం మొదలైంది. సరిగ్గా అప్పుడే వీచిన గాలికి ఆ చినుకులు ముఖం మీద ముత్యాల్లా రాలాయి. 

 

  “ఓహ్ నో..ఉఫ్..”అనుకుంటూ చేతులు అడ్డం పెట్టుకుని ఆగిపోయింది ఆమె. 

 

    “ఏయ్ ఏం చేస్తున్నావే? ఫాస్ట్’గా రా.”అని డోర్ తెరిచింది స్రవంతి. 

 

     ఆ మాటతో ముఖం నుండి చేతులు పక్కకి తీసింది ఆ అమ్మాయి. సరిగ్గా అప్పుడే అటు వైపు నుండి వెళ్తున్న అబ్బాయిల బైక్ ఒక్క క్షణం ఆమెనే చూస్తూ ఉండిపోయారు నోరు వెల్లబెట్టి.

 

    చందమామలాంటి అందమైన ఆమె ముఖం నుండి నక్షత్రాల్లా నీటి బిందువులు జారుతుంటే ఆమె వేగంగా కారు దగ్గరకి వచ్చి 

 “ఓహ్.! గాడ్.! సడెన్గా ఈ వర్షం ఏంటే.”అని డ్రైవర్ సీటులో కూర్చుంది. 

 

   “వెదర్ అంటే అలానే ఉంటుంది అమ్మ. ఎప్పుడు మారుతుందో ఎవ్వరు చెప్పలేరు.”అని కొంటెగా అన్నది స్రవంతి. 

 

 

   చిన్నగా నవ్వి తన చేతిలోని కవర్స్’ని వెనకాల పడేసి కార్ స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. చిన్నగా వర్షం కూడా ఎక్కువ అయ్యింది. 

 

     దాంతో డ్రైవింగ్ సీటులో కూర్చున్న అమ్మాయి వైపు చూసి

  “కొంచం ముందు చూసి పోనియ్యే..ఈ వర్షం మన కోసమే చూస్తున్నట్టు అనిపిస్తుంది.”అని నవ్వుతూ అన్నది స్రవంతి.

 

  “నా డ్రైవింగ్ స్కిల్స్ మీద నీకు అంత డౌట్’గా ఉందా?నా పేరు ఏంటో తెలుసు కదా? మహిత..”అని ఆ అమ్మాయి అనగానే “హా తెలుసు.. మహిత..నిన్ను నువ్వు ఎత్తుకుంది చాలు. ముందుకు చూడు.”అని మధ్యలోనే ఆపేసింది స్రవంతి.

 

  “అంటే.! ఏంటే? ఆ మాత్రం నమ్మకం లేదా? సి..నా టాలెంట్ ఏంటో చూడు.”అని స్పీడ్ పెంచింది మహిత. 

 

   అప్పటికే వర్షం కొద్దీ కొద్దిగా ఎక్కువ అవ్వడంతో గ్లాస్ మీద పడుతున్న తుప్పుర్లు పెరుగుతున్నాయి.  

 

  “మహి..నేనేదో మాట వరసకు అన్నాను. దాన్ని నువ్వు ఇలా పర్సనల్’గా తీసుకోవాల? ప్లీజ్ స్లో డౌన్.” అని కొంచం భయంగా అన్నది స్రవంతి.  

 

 

  “ఏయ్..ఓడిపోయావ్..”అని నవ్వుతూ ముందుకు చూసిన మహిత

  “హే..నో..”అని పెద్దగా అరుస్తూ సర్రున బ్రేక్ కొట్టింది.కాని అప్పటికే చాల లేట్ అయ్యింది. ఎందుకంటే స్పీడ్’గా వచ్చిన ఆ కారు ఎదురుగా ఉన్న ఒక వెహికిల్’ని గుద్దేసింది. లక్కీగా వీళ్ళ కారుకి అంతలా ఏమి కాలేదు కాని వీళ్ళ కారు తాకడంతో ఎదురుగా ఉన్న ఆ వెహికల్ బోర్లా పడిపోయింది. 

 

  వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ వెహికిల్ నుండి పిల్లల అరుపులు వినిపించడంతో “ఓహ్..నో.!దేవుడా..ఏదో జరిగింది..”అంటూ టక్కున బయటకు దిగింది స్రవంతి. 

 

  ముందుకు చూసిన ఆమెకి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఎవరో ఒక వ్యక్తి దూరంగా కనిపించాడు. 

 

  దాంతో “ఓహ్…గాడ్.!” అనుకుంటూ తల పట్టుకుంది స్రవంతి. అదే సమయంలో కొంత దూరం నుండి పోలీస్ జీప్ సైరన్ కూడా వినిపించడంతో స్రవంతికి భయమేసింది. 

 

       “ఒకవేళ, ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయితే నా గోల్ రీచ్ అవ్వలేదు. లైఫ్ లో 

మళ్ళీ నాకు ఆ ఛాన్స్ రాదు.” అని మనసులో అనుకుంది. 

 

   అప్పుడే కారు దిగుతున్న మహిత కనిపించింది.

 

   వేగంగా ఆమెని అడ్డుకుని

   “మహి కిందకు దిగొద్దు. పదా..లోపలికి పదా..గో.”అంటూ బలవంతంగా కారులో కూర్చోబెట్టింది స్రవంతి. 

 

  “కాని వాళ్లకి..” అని మహిత ఆపడానికి చూస్తుంటే

   “వాళ్లకి ఏం కాలేదు. నథింగ్ టూ వరీ..”అంటూ తానే డ్రైవర్ సీటులో కూర్చొని కారు స్టార్ట్ చేసింది స్రవంతి. 

 

  ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు స్రవంతి చూసిన వ్యక్తి. కిందపడిన వెహికల్’ని పైకి లేపుతూ

  “హలో ఎక్క్యూజ్ మీ..స్టాప్ ది కార్. హెల్ప్ చెయ్యండి.” అని అరిచాడు అతను. 

  కానీ అతని మాటలు పట్టించుకోకుండా, స్రవంతి కార్’ని ఫాస్ట్’గా పోనిచ్చింది. అది వెళ్ళినప్పుడు పైకి లేచిన వర్షపు నీళ్లు అతని ముఖం మీదకు దూసుకువచ్చాయి. 

 

 “ఏంటీ ఈ దరిద్రం.!ఆగండి.”అని ఆ కారు వైపు చూసాడు. కానీ వర్షం ఎక్కువ ఉండటం వల్ల అతను కూడా వీళ్ళ కారు నెంబర్ సరిగ్గా చూడలేకపోయాడు. 

 

   “ప్లీజ్ స్టాప్ ది కార్ స్రవంతి. మనం అతనికి హెల్ప్ చెయ్యాలి.” అని అన్నది మహిత.

 

  “ఉస్..సైలెంట్.. సైలెంట్..”అని పక్కకి చూపించింది స్రవంతి. 

 

  అటుగా చూసిన మహితకి తమ పక్క నుండి వెళ్తున్న పోలీస్ జీప్ కనిపించింది.

 

   “ఇప్పుడు గనక మనం ఆగితే, కోర్ట్, కేసులు అని రచ్చ రచ్చ అవుతుంది. అప్పుడు నా అబ్రాడ్ మీటింగ్ డెఫినెట్’గా క్యాన్సల్ అవుతుంది.అదే జరిగితే నా లైఫ్’లో ఒక బిగ్ అపోర్చునిటీ కోల్పోతా..ప్లీజ్,ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చెయ్ మహి.” అని బాధగా అడిగింది స్రవంతి.

 

  “కాని అక్కడ..” అంటూ ఏదో చెప్తూ ఆగిపోయింది మహిత. 

 

   ఇప్పుడు ఆమెకి భయంతో నోట మాట రావడం లేదు.ఆ వెహికల్లో ఉన్న వాళ్ళని తల్చుకోగానే ఆమె మనసు బాధతో నిండిపోయింది. 

 

  “ప్లీజ్ దేవుడా.వాళ్లకి ఏమి కాకుండా చూడు.”అని టెన్షన్’గా దండం పెట్టుకుంది మహిత. 

 

   అది చూసిన స్రవంతి “డోంట్ వెరీ మహి. వాళ్లకి ఏం కాదు. అతను చూసుకుంటాడు.” అని ధైర్యం చెప్పింది.

 

   కాని ఆమె వైపు చూడకుండా డోర్ నుండి బయటకు చూస్తూ ఉండిపోయింది మహిత. ఇప్పుడు ఆమె కన్నుల ముందు ఆ వెహికల్ కూలిపోవడం, దాన్ని నుండి వినిపించిన పిల్లల అరుపులు అవే వినిపిస్తున్నాయి. స్రవంతి ఆమెని కదిలించలేకపోయింది. ఆ తర్వాత ఎవరికి డౌట్ రాకుండా కారుని రిపేర్ చేయించి, కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరుకున్నారు ఇద్దరు..

 

 

  * * * * * 

 

 ఆ రోజు నుండి నాలుగు రోజులకి.. మహిత తన రూమ్’లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే వచ్చి ఆమె పక్కన కూర్చుంది స్రవంతి. 

 

  “ఏంటీ.. ఇంకా ఆ విషయం గురించే థింక్ చేస్తున్నావ?”అని అడిగింది మెల్లగా స్రవంతి. 

 

  ఆమె వైపు తిరిగి “హా..నాకు చాల భయంగా ఉందే.”అని అన్నది మహిత.

 

  “భయం ఎందుకు?”అని చాల కూల్’గా అడిగింది స్రవంతి.

 

  “అదేంటే అలా అంటావ్? అప్పుడే మర్చిపోయావా? మొన్నటి అసిడెంట్. వాళ్లలో ఏ ఒక్కరికి ఎమన్నా అయితే, ఆ రిగ్రేట్’తో బతకడం నా వల్ల కాదు.”అని కన్నీరు నిండిన కన్నులతో చెప్పింది మహిత. 

 

 “నీకు ఆ అవసరం లేదు.”అని స్రవంతి అనగానే 

 “ఎందుకు?”అని ఆత్రుత్తగా అడిగింది మహిత.