New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నా ప్రపంచం. – 2

నువ్వే నా ప్రపంచం. – 2

 

 

 “ఎందుకు?”అని ఆత్రుత్తగా అడిగింది మహిత.

 

 “ఎందుకంటే ఆ వెహికిల్లోని ఎవరికీ ఏమి కాలేదు కాబట్టి..”అని మహిత చేతిని పట్టుకుంది స్రవంతి. 

 

ఆ మాట వినగానే మహిత కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. 

 

“నిజంగా!”అనికళ్ళు పెద్దవి చేసింది మహిత. 

 

   కనుబొమ్మలు ఆడిస్తూ 

  “హా..నిజంగా..నిన్ననే తెల్సుకున్న, ఆ వెహికల్లోని ఎవ్వరికి ఏమి కాలేదట.ఆ రోజు మనం చూసిన అబ్బాయి వాళ్ళని సేవ్ చేసాడంట.” అని నమ్మకంగా తలాడించింది స్రవంతి.

 

  “ఔనా.. అతను చాలా మంచి వాడు. రియల్లీ గ్రేట్..”అంటూ ఆ అబ్బాయి ముఖం గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది కానీ స్పష్టంగా గుర్తుకు రాలేదు. 

 

 “చాలా.. ఆ రోజే క్లారిటీగా చూసుంటే బాగుండేది.కనీసం ఎప్పుడైనా కలిసినా ఒక థాంక్స్ చెప్పేదాన్ని.”అని మనసులోనే అనుకుంది మహిత. 

 

 ఆమె ఆలోచనని చూసి “ఏం ఆలోచిస్తున్నావే.?”అని అడిగింది స్రవంతి. 

 

 “నథింగ్.. ఏమి లేదు..అతను ఎలా ఉంటాడాని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నా..” చెప్పింది మహిత.

 

 “ఎందుకు.?”అని అనుమానంగా చూసింది స్రవంతి.

 

  “ఊరికే..ఏది ఏమైనా వాళ్ళకి ఏం కాలేదు.అది సరిపోద్ది..”అని ఒక నిట్టూర్పు వదిలింది మహిత. 

 

 

   ” తెల్సింది కదా ఇప్పటికైనా ఆ ఎక్సప్రెస్స్ మార్చి సావు.చూడలేక చస్తున్నా.”అని నవ్వింది స్రవంతి. 

 

  ఆ మాటకు మహిత రిలాక్స్ అవుతూ, “థ్యాంక్ గాడ్..దీనికంతకి కారణం ఆరోజు అక్కడకు వచ్చిన వ్యక్తి.ఎప్పుడైనా కలిస్తే అతనికి థాంక్స్ చెప్పాలి.అప్పుడు గాని నా మనసు ఓకే అవ్వదు.”అని అన్నది.

 

   “ఓకే.. చెప్తాంలే కాని..రెడీ అవ్వు.”అని స్రవంతి..

 

  “ఎక్కడికే..?”అని అనుమానంగా చూసింది మహిత..

 

  “అలా ఒకసారి ఆశ్రమం వరకు వెళ్లి, కొన్ని ఐటమ్స్ ఇచ్చి వద్దాం. నీకు కూడా కొంచెం రిలీఫ్’గా అనిపిస్తుంది.”అని స్రవంతి చెప్పగానే, సరే అంటూ రెడీ అయ్యింది మహిత..

 

 

 

 

  ******

 

 

 

  కొన్ని రోజులకి..

 

  “ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి?

ఏది ఏమైనా కానీ ఈ రోజు చెప్పేస్తా.. 

చెప్పి తీరుతా..అయినా ఇంకా ఎన్ని రోజులని దాచను..”అని తనలో తానే అనుకుంటూ రోడ్ పక్కన ఫ్యూట్పాత్ మీద అటు, ఇటు కంగారుగా తిరుగుతుంది మహిత.  

 

  ఆమె ముఖం ఆనందంతో పౌర్ణమి నాడు చందమామలా అందంగా వెలిగిపోతుంది. కానీ టెన్షన్’తో ఆమె పెదాలు వణుకుతుంటే అరక్షణానికి ఒకసారి,ఫుట్ పాత్ కి కొంత దూరాన ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ వైపు చూస్తుంది..అదేం విచిత్రమో కానీ ఇంతలోనే ఆకాశంలో కూడా చిన్నగా మబ్బులు కమ్ముకోవడం మొదలైంది.సిటీకి కొంచెం దూరంగా ఉన్న ఏరియా అది.. ఆ ఏరియాలో సమయం రాత్రి ఏడు దాటితే ఎక్కువ వెహ్కిల్స్ ఉండవు.ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా తన ఊహల్లో తెలిపోతుంటే ఆమె ఫోన్ రింగ్ అయ్యింది.

 

 కాల్ లిఫ్ట్ చేసి “హలో చెప్పే?”అని అడిగింది మహిత. 

 

 “ఎక్కడున్నావే?”అని అడిగింది అటు వైపు నుండి స్రవంతి. 

 

 “కలవడానికి వచ్చాను.”అని కొంచం సిగ్గుతో చెప్పింది మహిత. అప్పుడు ఆమె కళ్ళ మీదకి వచ్చాయి ఆమె కురులు.. 

 

 

  “ఓహ్..నైస్..చూడు,అస్సలు టెన్షన్ పడకు..” అంటూ స్రవంతి ఏదేదో చెప్తుంటే చిన్నగా నవ్వుతుంది మహిత. 

 

  “సరే, సరే.. నేను తర్వాత కాల్ చేస్తా.”అని మహిత అనగానే 

 “ఏంటీ వస్తున్నాడ?”అని కొంచం టీస్ చేసింది స్రవంతి. 

 

చిన్నగా నవ్వుతూనే 

   “లేదు కాని..”అని ఆమె ఆగిపోగానే “మరి ఏంటీ?”అని చిన్నగా హస్కిగా అడిగింది స్రవంతి.  “ఏం లేదు..నేను తర్వాత ఫోన్ చేస్తాను.”అని స్రవంతికి బై చెప్పి కాల్ కట్ చేసింది.

 

  ఆమె చెప్పిన మాటలు గుర్తుకు రాగానే ఒక్కసారిగా మహిత ముఖంలో సంతోషం చిగురించింది.అప్పుడే ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ సడెన్గా అక్కడికి వచ్చి ఆగింది ఒక పెద్ద కారు. దానిని గమనించిన ఆమె మనసు కొంచెం కీడు శెంకిస్తుంటే అక్కడి నుండి దూరంగా నడవడం మొదలు పెట్టింది. 

 

  అంతలో ఆ కారు నుండి నలుగురు వ్యక్తులు. కార్ ముందు డోర్ తెరుచుకొని మరో వ్యక్తి దిగాడు.. వాళ్ళని చూస్తే మనుషులని హింసించడంలో చాలా ఎక్సపీరియన్సు ఉన్నట్టుగా భయంకరంగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు నడిచింది మహిత. 

 

    “ఎక్కడికి వెళ్తున్నారు మేడం?”అని వెనకాల నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది ఆమె. 

 

   అప్పటికే ఆ రౌడీలలో ఇద్దరు ఆమెకి దగ్గర చేరుకున్నారు..అది చూసి భయంతో ఆమె తన చేతిలోని ఫోన్ని ఓపెన్ చేసేలోపే వేగంగా వచ్చి ఆమెను పట్టేశారు..ఆ కంగారులో ఆమె చేతి నుండి ఫోన్ జారీ నేలమీద పడింది.

 

 “ఏయ్..ఎవరు మీరు?”అని మహిత అంటుండగానే ఆ కారు డోర్ తెరుచుకున్న సౌండ్ వినిపించింది. 

 

  అటుగా చూసిన మహిత “నువ్వా.!”అంటూ షాక్’తో అలానే చూస్తూ ఉండిపోయింది.