పరవశం – 19
మార్నింగ్ మేఘా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బయటకి వస్తుంది..
హాల్‌లో కాఫీ తాగుతూ కూర్చున్న అందరినీ చూసి చిన్నగా నవ్వుతూ విష్ చేస్తుంది..
అందరూ మేఘా వైపు చూసి విష్ చేస్తారు.. మేఘా ఫేస్‌లో ఏదో హ్యాపీనెస్ ఉండటం అందరూ గమనిస్తారు.. అది ఎందుకో కూడా అర్థమవుతుంది.. కానీ ఏమీ మాట్లాడరు..
మేఘా, భవాని గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని, “సారీ అత్తా!” అని అంటుంది..
“ఎందుకు?” అని ఆవిడ అడగానే..