పార్వతి పరిణయం – 4
గతం…
ఎప్పుడూ తన మాటే వింటూ, తను చెప్పిందే చేసేవాళ్ల మధ్య పెరిగిన కేదార్‌కు మొదటిసారి ఒక అమ్మాయి ఎదురు తిరగడం ఆశ్చర్యంగా అనిపించింది..
అందులోనూ తనను ఏమాత్రం లెక్కచేయకుండా వెళ్లిపోయిన పార్వతి మాటలు అతని మనసులో పదేపదే గుర్తుకొస్తున్నాయి……
ఆ అమ్మాయిని మళ్లీ ఎప్పుడు కలుస్తానా అనే ఆలోచన అతనిలో తెలియని ఆసక్తిని కలిగించింది.
మరోవైపు గౌరి ఫెయిల్ అవ్వడం అసాధ్యమని, మూల్యాంకనంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పార్వతి మరియు టీచర్ మాటలు గౌరి మనసుకు కొంత ఉపశమనం కలిగించాయి.
రీ-వాల్యుయేషన్‌లో తనకు న్యాయం జరుగుతుందనే చిన్న ఆశతో ఎదురుచూస్తోంది.
ఇటువైపు సంపద ఇంటికి వచ్చిన వ్యక్తి మాటలు మాత్రం ఆమె మనసులో భయాన్ని నింపాయి.
పదిహేడేళ్లుగా దాచిపెట్టిన రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన చెందుతోంది.
ప్రస్తుతం…
హైదరాబాద్…
సమయం తెల్లవారుజామున 5:30 నిమిషాలు.
గదిలో అలారం మోగుతుండగా బెడ్‌పై నిద్రపోతున్న కేదార్ కలలో తన తండ్రిని చూస్తుంటాడు.
చిన్నప్పుడు తన తండ్రి ప్రేమగా నిద్రలేపిన జ్ఞాపకం కలలో కనిపిస్తుంది.
ఆ పరిచయమైన గొంతు వినగానే నిద్రలోనే చిరునవ్వు చిందిస్తాడు.
కానీ ఒక్కసారిగా కళ్లు తెరిచి ఎదురుగా చూస్తే అక్కడ ఎవరూ ఉండరు.
మళ్లీ అదే కల అని అర్థమైన కేదార్ కాసేపు మౌనంగా ఉండిపోతాడు.
తండ్రి జ్ఞాపకాలు అతని మనసును కలచివేస్తాయి.
ఎప్పుడూ బయటకు కనిపించని అతని బాధ కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.
వెంటనే తనను తాను సంభాళించుకుని జాగింగ్ షూస్ వేసుకుని బయటకు వెళ్తాడు.
ఇటువైపు… గ్రామంలో సంపద ఇల్లు.
నిన్న వచ్చిన వ్యక్తి మాటలు సంపద మనసును ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఏదోలా అతన్ని పంపించేసినా, ఆ పాప గురించి, బంగారు కడియం గురించి వాళ్లకు తెలిస్తే పరిస్థితి ఏమవుతుందోనని భయపడుతుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి తల్లిని అలా చూసి ఏమైందని అడుగుతుంది.
సంపద భయాన్ని దిగమింగి హా…ఏముంటుందమ్మ ఒంటరి ఆడదాన్ని ఇక డాన్స్ చేసి ఇంటిని నెట్టుకొచ్చే ఓపిక ఈ కాళ్లకు లేదు.
కన్న ప్రేమ, కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు…
నేనూ అనాధనే మరో అనాధకి జీవితం ఇచ్చిన దానిని అవుతానని పెంచుకున్నాను…
కానీ ఇలా అమ్మ అని పిల్చేదాన్ని, ఇన్నాళ్లు పెంచిన దాన్ని అద్దె కట్టడానికి డబ్బులు లేవని బయటకు నెడుతున్న చూస్తున్నావంటే, నేను ఎంత తప్పు చేసానో ఇప్పుడర్థమవుతుంది.
అంటూ సంపద తన ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేస్తూ, ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో తాను ఇబ్బంది పడుతుంటే పార్వతి మాత్రం ఎలాంటి బాధ్యత లేకుండా ఉంటోందని నిష్టూరంగా మాట్లాడుతుంది.
ఆ మాటలకు పార్వతి మనసు చివుక్కుమంటుంది. తల్లికి తన వల్ల భారం కాకూడదని, ఏదైనా ఉద్యోగం సంపాదించి ఇంటికి సాయం చేయాలని నిర్ణయించుకుంటుంది.
కొద్దిసేపటి తర్వాత…
పార్వతి తన సర్టిఫికెట్లు తీసుకుని ఉద్యోగం కోసం బయటకు బయలుదేరుతుంది.
అదే సమయంలో గౌరి నుంచి ఫోన్ వస్తుంది.
రీ-వాల్యుయేషన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ కాలేజీ దగ్గర కలవాలని నిర్ణయించుకుంటారు.
నువ్వేమ్ దిగులు పడకు గౌరీ నేను ఇంట్లో సమస్యల వల్ల ఇంటర్వ్యూ కోసం వచ్చాను. సాయంత్రం వెళదాం అని చెప్తుంది.
సరే పార్వతి అంటుంది గౌరీ..
పార్వతి ఉద్యోగం కోసం వెళ్తున్న దారిలో ఒక పెద్ద కంపెనీ ముందు ఉన్న ఉద్యోగ ప్రకటనను చూస్తుంది. వెంటనే లోపలికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
మరోవైపు… హైదరాబాద్.
జాగింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన కేదార్‌కు రాజీవ్ ఫోన్ చేస్తాడు.
ఫోన్ మాట్లాడుతూ వస్తున్న కేదార్ను వాళ్ల అమ్మ ఆపుతుంది. కాల్ అయిపోయాక నీతో మాట్లాడాలి అని సైగ చేస్తుంది.
కాల్ లో :
గ్రామంలో తమకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని ఉందని, వెంటనే బయలుదేరాలని చెబుతాడు. కేదార్ కూడా ఆలస్యం చేయకుండా గ్రామానికి వెళ్లడానికి సిద్ధమవుతాడు.
అయితే విధి ఆడుతున్న వింత నాటకంలో, ఉద్యోగం కోసం వెళ్లిన పార్వతి అడుగులు, పని మీద బయలుదేరిన కేదార్ ప్రయాణం ఒకే చోట కలవబోతున్నాయని వాళ్లిద్దరికీ తెలియదు.
అదే సమయంలో…
సంపద గదిలో ఉన్న పాత పెట్టెను తెరిచి బంగారు కడియాన్ని బయటకు తీస్తుంది. దాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో ఆమె ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది.
ఆ మెసేజ్‌లో ఉన్న ఒక్క వాక్యం చదవగానే సంపద గుండె ఆగినంత పనవుతుంది.
“ఆ కడియం ఎవరిదో తెలుసుకోవడానికి మేము మళ్లీ వస్తున్నాం. ఈసారి నిజం దాచడం అంత సులభం కాదు!”
సంపద భయంతో పార్వతి వెళ్లిన దిశగా చూస్తూ ఉండిపోతుంది.
ఇంకా ఉంది…
తరువాయి భాగం :
ఉద్యోగం కోసం వెళ్లిన పార్వతికి తెలియకుండానే విధి మరో పరీక్ష పెట్టబోతోంది..
తను ఇంటర్వ్యూకి వెళ్లిన కంపెనీ తనతో రోడ్డుపై గొడవపడిన కేదార్‌దేనని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది.
తనను ఎదిరించిన పార్వతికి బుద్ధి చెప్పాలనే అహంకారంతో కేదార్ ఆమెకు ఊహించని శిక్ష వేస్తాడు.
ఆ శిక్షతో పార్వతి రాత్రంతా రోడ్డుపై వర్షంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. చేతిలో ఫోన్ కూడా లేకపోవడంతో ఇంట్లో వాళ్లకు సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.
మరోవైపు పార్వతి కోసం సంపద, గౌరి ఆందోళనగా ఎదురుచూస్తుంటారు.
అయితే కేదార్ చేసిన పనికి రాజీవ్ మనసులో జాలి మొదలవుతుంది.
అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? పార్వతిని ఆ పరిస్థితి నుంచి కాపాడేది ఎవరు? కేదార్ తన తప్పును తెలుసుకుంటాడా?
తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే!
Swipe left/right or tap the sides to turn pages