పెళ్లి చూపులు -77
వైష్ణవ్ ఆమె కొడుతున్న జుట్టు పీకేస్తున్న నవ్వుతూ ఆమె వైపు చూసాడు. రెండు నిమిషాలు అయినా ఆమె తనని కొట్టడం ఆపకపోవడంతో తన మైండ్లో చిలిపి ఆలోచన రావడంతో అదీకాక లంగా వోని వేసుకొని ఉండటంతో అతను చూపు ఆమె నడుం మీద ఆగిపోయింది.
“ఏంట్రా నేను కొడుతుంటే నవ్వుతున్నావు కానీ ఏమీ మాట్లాడటం లేదు” అని సిరి నోటిలో నుంచి మాట వచ్చిన మరుక్షణమే అతని చెయ్యి ఆమె నడుం మీద డైరెక్ట్ గా వేసేసి చిన్నగా గిచ్చాడు.
ఒక్కసారిగా ఉలిక్కి పడి రేయ్ ఏం చేస్తున్నావ్ అంటూ నడుం మీద చేతులు పెట్టుకొని అతడి మీద నుంచి పైకి లేవాలి అని చూసింది..
కానీ అతడు ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని తన బడిలో కూర్చోబెట్టుకుని తనకి మరింత దగ్గరగా లాక్కొని “ఎక్కడికి నా నుంచి పారిపోవాలి అని చూస్తున్నావ్, ఇప్పటివరకు నోరు మాత్రమే కాకుండా చేతులు కూడా పనిచేసాయ్, ఇప్పుడు కాళ్లు మాత్రమే పనిచేస్తున్నాయా పారిపోవాలి అనుకుంటున్నావ్” అని మరొక ఆమె చేత్తో హెయిర్ ని వెనక్కి అంటూ మెడ మీద పెదవులతో రాస్తూ అన్నాడు.
అప్పటికే అతని చెయ్యి తన నడుం మీద డైరెక్ట్ గా తగలడంతో నోట మాట రాక బిగిసిపోయి ఉన్నది కాస్త ఇప్పుడు అతని పెదవుల తన మెడ మీద తగులుతూ ఉండటం అతని ఫుల్ బాడీ ప్రెసెన్ష్ తనకి తెలుస్తూ ఉండటంతో,