కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించిన ఆ చివరి వాక్యం ప్రణిత మనసును కుదిపేసింది. ఇంతవరకు తనను ఎవరో దూరం నుంచి గమనిస్తున్నారని మాత్రమే అనుకుంది. కానీ ఇప్పుడు తన తండ్రి గతం, నరేంద్ర కుటుంబం, రవి… అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని అర్థమవుతోంది.
అప్పుడే నరేంద్ర నుంచి కాల్ వచ్చింది.
ఏం చేస్తున్నావు? అని అడిగాడు.
ఏమీ లేదు అని చెప్పబోయి ప్రణిత ఆగిపోయింది. నిన్ను చూసిన తర్వాత చెబుతాను అనుకుంది.
నరేంద్ర వెంటనే అడిగాడు. ప్రణిత… నీ గొంతు ఎందుకో మారిపోయింది.
ఆమె చిన్నగా నవ్వింది. నీకు అన్నీ ఎలా తెలిసిపోతాయి?
నిన్ను గమనించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్నాడు.
ఆ మాటకు ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది.
అయితే నన్ను ఎంత గమనిస్తున్నావో ఒకసారి చెప్పు చూద్దాం.
నువ్వు టెన్షన్‌లో ఉన్నప్పుడు పెదవిని చిన్నగా కొరుకుతావు. ఏదైనా దాచాలనుకున్నప్పుడు కళ్లతో తప్పించుకోవడానికి చూస్తావు. కోపంగా ఉన్నప్పుడు నీ కనుబొమ్మలు ఇలా ముడుచుకుంటాయి.
ప్రణిత వెంటనే తన కనుబొమ్మలను సరిచేసుకుంది.
అయ్యో… అంత గమనిస్తావా నన్ను?