ఒక్కోసారి వయసులో పెద్దవాళ్లే మెచ్యూర్ గా బిహేవ్ చేయలేక పోతారు.. తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తుంటారు..
కానీ ఇక్కడ దాసు అలా చేయకుండా తమ అమ్మ ఆరోగ్యం కోసం చదువు మానేసి ఆమెను చూసుకోవడం అనేది ప్రతిమ కి చాలా బాగా నచ్చుతుంది..
దాసు చదువు మానేయాల్సి వచ్చినందుకు ఆమెకు బాధగా ఉన్నా ఎవరి తలరాతను ఎవరూ మార్చలేరు అని తనకి తాను సర్ది చెప్పుకుని మరి ఇప్పుడు వాళ్ళకి ఆదాయం ఎలా అండి..
వాళ్ళింట్లో ఇంతకుముందు కూడా వాళ్ళ అమ్మగారు ఒకరే సంపాదించేవారు అని చెప్తున్నారు.. మరి ఇప్పుడు ఆవిడ కూడా మంచాన పడిపోయారు కదా..
ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుంది.. పైగా వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగా అవ్వాలి అంటే మందులు కూడా వాడుతూ ఉండాలి కదా.. వాటన్నిటికీ డబ్బులు ఎలా వస్తున్నాయండీ అని కాస్త బాధగానే అడిగింది..
ఎందుకో తెలియదు ఆమె కూడా ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే తట్టుకోలేదు.. ఇప్పుడు దాసు వాళ్ళని ఆ పరిస్థితిని తలచుకుంటే ఆమె గుండె తరుక్కుపోతుంది..