ఇప్పుడు ఆ బర్రెలతో వచ్చే పాలని అమ్ముకుంటూనే ఆ కుటుంబాన్ని వాడు పోషిస్తున్నాడు అని చెప్పడం ముగిస్తాడు…
ప్రణయ్ చెప్పిన మాటలు అన్నీ విన్న ప్రతిమకి దాసు మీద గౌరవం, ప్రణయ్ మీద ఇది అని మాటల్లో చెప్పలేని ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది..
ఆ ఫీలింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది మన హారిక కి మాత్రమే తెలుసు.. వెంటనే హారిక దాసు బుగ్గలు చిన్నగా లాగుతూ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది దాసు..
నువ్వు సడన్ గా స్కూల్ మానేస్తే నీకు చదువు మీద శ్రద్ధ లేదు పొగరు అనుకున్నాను.. అంతేకానీ నీ జీవితంలో ఒక సంఘటన వల్ల నీ జీవితమే ఒక మలుపు తిరిగిందని నేను అసలు ఆలోచించలేకపోయాను..
అదేంటో మన ఇద్దరిదీ ఒకటే ఊరు అయినా నాకు ఆ విషయమే తెలియలేదు .. ఏదైతే ఏంట్లే ఇప్పుడు నువ్వు కాస్తయినా సంతోషంగా ఉన్నావు కదా అని మెల్లిగా అడిగింది..
హా టీచర్ అమ్మ ఇప్పుడు నేను కాస్త కాదు చాలా సంతోషంగా ఉన్నాను.. నేను అనుకున్నంత వరకు చదువుకోలేకపోయానే అని ఒక చిన్న లోటు తప్ప ఇప్పుడు నాకు ఇంకేమీ లోటు లేదు..