వెంటనే దాసు అన్నా వద్దన్నా నేను ఇంటికి వెళ్లి చద్దన్నం తింటాను అని అంటూ ఉండగానే రేయ్ నువ్వు ఏమి మాట్లాడకుండా చెప్పింది చేసి పో అని చిరుకోపంగా అంటాడు ప్రణయ్..
ప్రణయ్ అలా అనడంతో ఇంకేమీ మాట్లాడకుండా చేతులు కడుక్కుని వచ్చి మౌనంగా కూర్చుంటాడు దాసు..
దాసుకి ప్రణయ్ అంటే చాలా గౌరవంతో కూడిన చిన్న భయం.. ప్రణయ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పడు దాసు..
తమ జీవితం ఏమైపోతుందో అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న దాసుకి ప్రణయ్ వచ్చి అండగా నిలబడి తన కుటుంబం వీధి పాలు కాకుండా కాపాడాడు అన్న గౌరవం దాసు మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది..
ప్రణయ్ మాటకి మౌనంగా కూర్చున్న దాసోని చూడగానే ప్రతిమకు చిన్నగా నవ్వొస్తుంది.. ఈయన మాటంటే ఎంత విలువ దాసు కి అని అనుకోకుండా ఉండలేక పోతుంది..
వెంటనే ప్రతిమ దాసుకి కూడా టిఫిన్ వడ్డించడంతో వాడు మారు మాట్లాడకుండా పెట్టింది తినేసి చేయి కడుక్కొని,వద్దు వద్దు అంటున్న వినకుండా వాడు తిన్న ప్లేట్ ని వాడే కడిగి పక్కన పెట్టేసి అన్న ఇంక నేను ఇంటికి వెళ్తున్నాను టీచర్ అమ్మ బాయ్..