New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 142

మాంగళ్య బంధం – 142

ఎక్కడైనా సరే ఎవరైనా సరే పని చేస్తేనే డబ్బులు ఇస్తారమ్మ.. ఊరికే ఎవరూ డబ్బులు ఇవ్వరు కదా.. కాకుంటే వాళ్ళక్కడ ఏసీ రూముల్లో కూర్చుని పని చేస్తారు. నేనిక్కడ ఎండలో పని చేస్తాను అంతే తేడా..

 

వాళ్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరీ చేస్తేనే వాళ్లకు జీతాలు ఇస్తారు.. నేను ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో పని చేస్తేనే మనకి పంట మంచిగా వచ్చి ఆదాయం వస్తుంది..

 

కాబట్టి నువ్వు ఇంకెప్పుడూ నీ కొడుకు ఉద్యోగం చేయడం లేదు,పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం లేదు, ఎండలో పని చేసి కష్టపడుతున్నాడు అని బాధపడకు..

 

నేను చేసే పనిని నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను.. నాకు వ్యవసాయం చేయడం చాలా నచ్చింది.. నువ్వు ఇలాంటి ఆలోచనలు అన్నీ వదిలేసి ముందు టిఫిన్ చేద్దువు పద అని చెప్తున్నప్పుడే ప్రణయ్ మాటలు అన్ని విన్న ప్రతిమ ఆ రూమ్ దగ్గర నుండి వంటింట్లోకి వెళ్లి ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని యశోద గారి గది లోపలికి వస్తూ అత్తయ్య చేతులు కడుక్కోండి..

 

టిఫిన్ తిందురు గాని ఇప్పటికే ఆలస్యమైంది అంటూ తను తెచ్చిన టిఫిన్ ప్లేట్ ని పక్కన పెడుతుంది..

 

ఏదో మాటల్లో పడిపోయి ఉన్న తల్లి కొడుకుల ఇద్దరు ప్రతిమ మాటలకి తలతిప్పి ఆమె వైపు ఆమె చేతిలో ఉన్న ప్లేటు వైపు చూస్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue