New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 143

మాంగళ్య బంధం – 143

మీరిద్దరూ జీవితాంతం ఒకరి చేతిని మరొకరు విడవకుండా ఒకరికొకరు గా బతకాలి అంటూ   ఆమె ఎడమచేత్తోనే ప్రణయ్ చేతిని,ప్రతిమ చేతిని కలిపి పట్టుకుని ఎప్పటికీ ఈ చేతులు ఇలానే కలిసి ఉండాలి ..

 

చెప్పండి నాన్న మీరిద్దరూ ఎప్పుడు ఇలానే కలిసే ఉంటామని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా,ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీ భార్యాభర్తల బంధాన్ని  నిలబెట్టుకొని కలిసే ముందుకు సాగుతామని నాకు మాట ఇవ్వండి అని అడిగారు యశోద గారు..

 

ఆమె మాట్లాడే వరకు మౌనంగా ఉన్న ప్రణయ్  అమ్మ ఏంటి ఇదంతా? నువ్వు ఉన్నా లేకున్నా అనే మాటలు అసలు మాట్లాడబాకమ్మ..

 

నువ్వు లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోను కూడా ఊహించుకోలేను.. ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకు..

 

అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా.. అదేదో నువ్వు ఇప్పటికి ఎప్పుడు మమ్మల్ని వదిలి ఏదో ఊరికి వెళుతున్నట్టు, ఇక మీదట నువ్వు మాతో కలిసి ఉండనట్టు, ఏంటి ప్రమాణాలు ఈ అప్పగింతలు..

 

నువ్విలా మాట్లాడడం నాకు అసలు నచ్చడం లేదు.. ఇవన్నీ వదిలేసి నువ్వు ముందు టిఫిన్ తిను.. ప్లేట్లో ఉన్న తిండి తినకుండా పిచ్చి పిచ్చి మాటలు అన్ని మాట్లాడుతున్నావు ఎందుకు అని బాధ, కోపం కలగలిపిన గొంతుతో అంటాడు ?

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue