కానీ ప్రతిమ మాత్రం ఒకసారి ప్రణయ్ వైపు చూసి ఆ తరువాత యశోద గారి వైపు చూస్తూ గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలి అత్తయ్య మీరు ఏమి కంగారు పడకండి నేను మాటిస్తున్నాను కదా..
మీరు కోరుకున్నట్టే మొత్తం జరుగుతుంది.. అందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారు .. ఇంక మీరు అవన్నీ వదిలేసి భోజనం చేయండి అంటూ కనీ సున్నితంగా ప్రణయ చేతిలో ఉండి చేతిని వదిలించుకుంటుంది..
ప్రతిమ ఇద్దరం భార్యాభర్తలుగా జీవితాంతం కలిసే ఉంటాము అని నోటితో చెప్పకుండా, అలా అని యశోద గారికి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేయడం చూసినా ప్రణయ్ ప్రతిమ ని చూడగా ఆమె ప్రణయవంకే చూస్తూ ఇప్పటికైతే ఏదోలా గట్టెక్కేసాం కదా కాస్త కూలవ్వండి అన్నట్టుగా తన కళ్ళని ఆర్పుతుంది..
కారణం ప్రణయ్ కంగారు పడిపోవడం ఆమె గమనించింది కనుక..
కోడలు మాటలు విన్న యశోద గారు హమ్మయ్య నువ్వే ఇలా చెప్పావు అంటే కచ్చితంగా నువ్వు నా కొడుకు చేతిని ఎప్పటికీ విడిచి పెట్టవు.. ఇద్దరు సంతోషం గా కాపురం చేసుకుంటారు అని నాకు అర్థమైంది..
నాకు ఈ మాట చాలు ప్రతిమ ఇంకేమీ అవసరం లేదు సంతోషంగా తింటాను అని నవ్వుతూ చెప్పి ప్లేట్ ఖాళీ చేసి చేతులు కడుక్కుంటారు..