New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 145

మాంగళ్య బంధం – 145

హహహ అంతేగా మా నాన్నగారు అంటే ఆ మాత్రం ఉండాలి మరి అని తను కూడా వాళ్ళ అమ్మ నవ్వులో జత కలుపుతాడు ప్రణయ్..

 

కాసేపు తల్లితో కబుర్లు చెప్పిన తర్వాత  అమ్మ ఇప్పటికే నేను పొలానికి వెళ్లి దగ్గర దగ్గర వారం అవుతుంది.. ఈ రోజైనా నేను పొలానికి వెళ్తాను అమ్మ..

 

ప్రతిరోజు మనం పొలానికి వెళ్లకుండా పాలేరుల మీద వదిలేయడం మంచిది కాదు.. వాళ్లు కూడా బాగానే చూసుకుంటారు అనుకో..

 

కానీ సొంతవాళ్లు చూసుకునేది వేరు.. పాలేర్లు చూసుకునేది వేరుగానే ఉంటుందిగా.. అందుకే ఇంక మాత్రం నేను వెళ్లడానికి అడ్డు చెప్పకు..

 

ఇప్పటికే నాకు ఆ పంటలన్నీ ఎలా ఉన్నాయో ఏమో అని దిగులుగా ఉంది.. ఒకసారి పొలానికి వెళ్లి అన్నీ తిరిగి నా కళ్ళతో నేను చూసుకుంటే తప్ప నా మనసు తృప్తిగా ఉండదు  అని చెప్తాడు..

 

పెళ్లి కోసమని పెళ్లికి ముందు రెండు రోజుల నుండి  పొలానికి పంపించిన యశోద గారు  ఇంకెలా నువ్వు మూడు నిద్రలు కూడా అయిపోయాయి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue