హ్మ్ మీ అల్లుడి గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి అదేదో మీరే వెళ్లి మీ అల్లుడి గారిని పిలుచుకోండి పిన్ని గారు అని అల్లరిగా అంటాడు భరత్..
అతని అల్లరి మాటలకి శాంతి గారు నవ్వేస్తూ భరత్ బాబు నువ్వు ఈరోజు ఎవరిని వదిలి పెట్టడం లేదు గా.. కానివ్వు నువ్వు ఎప్పుడు ఇంతే సంతోషం గా అందరితో అల్లరి చేస్తూ, ఆటపట్టిస్తూ నవ్వుతు, నవ్విస్తూ ఉండాలి..
నీలాంటి వాడు ఉంటేనే కద సందడి గా ఉండేది అంటు మీరు చెప్పినట్టు నేనే వెళ్లి పిలుచుకుని వస్తాను మీరు కానివ్వండి అంటు వాళ్ళకి వడ్డించి ప్రణయ్ రూమ్ దగ్గరకి వెళ్తారు ఆవిడ..
పిల్లలు కూడా బయటే ఉండడం తో తన ఫోన్ లో న్యూస్ చూస్తుంటాడు ప్రణయ్..
అతని రూమ్ దగ్గరకి వెళ్లిన శాంతి గారు లోపలకి వెళ్లకుండా డోర్ దగ్గరే నిలబడి ప్రణయ్ బాబు అని పిలుస్తారు..
ఆవిడ పిలుపుకి తల ఎత్తి డోర్ వైపు చూసిన ప్రణయ్ ఫోన్ ఆఫ్ చేసి వెంటనే బెడ్ మీద కూర్చున్న వాడల్లా లేచి నిల్చుని ఏంటి అత్తయ్య అని అడిగాడు..