ముత్యాల్లాంటి అతని చేవ్రాతతో తన తలరాత కూర్చి ఉందని అర్థం అయ్యి ఆమె చేతిలో ఆ కాగితం కుచించుకుపోయి తన రూపాన్ని కోల్పోయింది.
ఏంటమ్మా ఈ పేపరని చేతిలోకి తీసుకున్న రఘు గారికి అందులో ఉన్న “ఇక నీకు నాకు సెలవు. మన బంధం ఇంతటితో ముగిస్తున్నా అని అనుకోకు. నీకు నాకు ఇంకా డివోర్స్ కాలేదు. అవ్వవు కూడా. కాని మనం కలిసుండం. ఇంకెవరిని అయినా పెళ్లి చేసుకువాలని ప్రయత్నిస్తే మాత్రం నీ కుటుంబం మొత్తం జైలు పాలు అవుతుంది. నా గురించి నీకు, నీ కుటుంబానికి తెలిసిందేమీ లేదు… ఇక సెలవు..
టిట్ ఫర్ టాట్ ఫ్రొం అనిరుథ్ ” అనున్న అక్షరాలకి ఓ క్షణం కాలం స్తంభించింది రఘు గారికి .
ఏమైంది బాబాయ్ అలా ఉన్నావని అడిగినా సమాధానం చెప్పక మౌనంగా ఆలోచనలలో ఉన్న రఘు గారిని మళ్ళీ కదిలించిన వంశిక ఈ అక్షరాలు రాయనూ నేనేం అంత తప్పు చేశాను బాబాయ్ అని ఆవేదన వెళ్ళకక్కింది.
ఇదేం నువ్వు పట్టించుకోకు వంశీ ఎలాగైనా ఇంకో నెలలో అతన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయకుంటే నేను ఈ ఖాకి డ్రెస్ వేసుకొని కూడా వేస్ట్. నువ్వు ప్రశాంతంగా నీ గోల్ మీద దృష్టి పెట్టని అప్పటికి వంశిక మనసుని మల్లించినా అతడి ఆలోచనలు మాత్రం అక్కడే తారాడుతున్నాయి.
…………