వంశీ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠ నుంచి ఆశ్చర్యంలోకి మారిపోయింది. వంశీ ఆప్యాయంగా పలకరించిన తీరు చూసి అందరూ నోరెళ్లబెట్టారు.
ఆ గదిలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ గోపాల్ గారు, “వంశీ! అసలు నీకు ఈ అమ్మాయి ఎలా తెలుసురా?” అని అడిగారు.
వంశీ నవ్వుతూ అందరి వైపు చూసి..అమ్మా, నాన్న.. మీకు గుర్తుందా?
ఒకసారి నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో జాయిన్ చేశాను అని చెప్పాను కదా!
ఆ రోజు మాధవ్, నేను ఆ అమ్మాయిని అడ్మిట్ చేశాం కానీ, తనకు స్పృహ వచ్చే వరకు మేము అక్కడ ఉండలేదు.
తన ఫ్రెండ్ రాగానే బాధ్యత అప్పగించి వచ్చేసాం. ఆ రోజు నేను కాపాడిన అమ్మాయి ఈమెనే అన్నాడు.