హైదరాబాద్ నగరం రాత్రి వేళ వెలుగులతో నిండిపోయి ఉంది.
రవి బైక్ మీద శ్రావణిని ఆమె ఇంటి వైపు తీసుకెళ్తున్నాడు. గాలి శరవేగంగా తగులుతున్నా, శ్రావణి మనసులో మాత్రం ఇందాక వంశీ ఇంట్లో జరిగిన సంఘటనలే తిరుగుతున్నాయి.
ఆ సారె, ఆ బొట్టు, ఆ ఆత్మీయత.. ఆమెకు ఒక కొత్త లోకాన్ని చూపించాయి.
రవి శ్రావణిని ఇంటి దగ్గర దింపాడు. శ్రావణి రవిని ఇంట్లోకి రామ్మని అడిగింది….
దానికి రవి నాకు పని ఉంది శ్రావణి ఇంకోసారి వచ్చినప్పుడు కచ్చితంగా వస్తాను….
నువ్వు ఒక్కదానివే వెళ్ళడం అమ్మకు ఇష్టం లేదు, అందుకే నేను దింపడానికి వచ్చాను….