New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 43

మౌనమే ని భాష – 43

కాలం తన వేగంతో తాను వెళ్ళిపోతోంది. వంశీ ఇంటికి శ్రావణి వెళ్ళిన ఆ రోజు నుండి శ్రావణి మనసులో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం మొదలైంది. 

 

కానీ అదే సమయంలో లోపల ఒక తెలియని భయం. అందుకే సరస్వతి గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ప్రేమగా పిలిచినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటోంది.

 

ఆఫీసులో పని ఉంది ఆంటీ ఈరోజు కుదరదు ఆంటీ అంటూ తనను తాను ఆ మమకారం నుంచి దూరం చేసుకోవాలని చూస్తోంది.

 

ఒక శనివారం సాయంత్రం.. శ్రావణి ఆఫీస్ పనులు ముగించుకుని అలసటగా ఇంటికి వచ్చింది. అప్పుడే ఫోన్ మోగింది. 

 

స్క్రీన్ మీద సరస్వతి ఆంటీ అని పేరు చూడగానే శ్రావణికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

 

హలో ఆంటీ.. బాగున్నారా అని శ్రావణి అడిగింది.

అవతలి నుంచి సరస్వతి గారి గొంతు కొంచెం కోపంగా, అంతే ప్రేమగా వినిపించింది. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue