వంశీ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కిటికీ గుండా వస్తున్న చల్లని గాలి శ్రావణి ముఖాన్ని తాకుతున్నా,
ఆమెకు మాత్రం ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. తన కళ్ల ముందు ఉన్నది కేవలం ఒక పుస్తకం కాదు..
తన జీవితం, తన కన్నీళ్లు, తన రహస్యాల భాండాగారం.
శ్రావణి వణుకుతున్న చేతులతో ఆ పుస్తకాల గుట్ట కింద ఉన్న తన డైరీని బయటకు తీసింది.
ఆ రంగు, ఆ అంచులు.. అవును, ఇది తనదే! ఒక్కసారిగా ఆమెకు ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన దృశ్యం గుర్తొచ్చింది.
హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు బహుశా ఇది వాళ్లకు దొరికి ఉండవచ్చు.