50
రౌద్ర నవ్వుకుంటూ ఆమెకు తినిపిస్తూ తను కూడా మధ్య మధ్యలో తింటూనే ఉన్నాడు. అలా ఒకసారి శౌర్య కావాలి అని అతడి వేలు కోరికేసింది.
“గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు నా వేలు కోరికేస్తున్నావ్ తర్వాత…!” అని ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ సాగదీస్తూ అన్నాడు రౌద్ర..
“ఏం చేస్తావ్ ఏంటి ఏమి చేయలేవ్” అని స్టైల్ గా అన్నది శౌర్య.
“ఏం చేస్తాను ఏం చేయను అనేది ఇంటికి వెళ్లిన తర్వాత చూపిస్తాను, ఇక్కడే చెప్తే ఏడిచి చస్తావ్” అని ఆమెకు మాత్రమే వినబడే విధంగా అన్నాడు రౌద్ర.
“అప్పుడే నన్ను భయపెడుతున్నావా..?” అని బెదురు కళ్ళతో అన్నది శౌర్య