రోజా – 1
శంభో శంకర హర హర మహదేవ
తతిన్తదిమి తిందిమి పరుల తాండవకేళి తప్పరా గౌరీమంజుల శింజినీ జతుల లాస్యవినోదవ శంకర
భరత వేదముగా నిరతనాట్యముగా కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగా అవని వేదనగా పలికిన పదము పరేశ
నీలకంధర జాలిపొందరా కరుణతో ననుగనరా..
నేలకందర శైలమందిర మోరవిని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా..
శంభో శంకర హర హర మహదేవ
తతిన్తదిమి తిందిమి పరుల తాండవకేళి తప్పరా గౌరీమంజుల శింజినీ జతుల లాస్యవినోదవ శంకర
నాట్యం చేస్తూ చేస్తూ 19 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఒక్కసారిగా పాట ఆగిపోవడంతో నృత్యం ఆపేసి అందరి వైపు చూసి నమస్కారం చేసింది చిద్విలాసం చేస్తూ.
అందరూ అద్భుతంగా అప్పటివరకు నాట్యం చూసి.. పాట ఆగిపోవడం నృత్యం ఆగిపోవడంతో ప్రతి ఒక్కరి చేతులు చప్పట్లతో నిశ్శబ్దాన్ని ఛేదించాయి.. అందరికన్నులు అద్భుతాన్ని చూసినంత సంబరపడ్డాయి.
అందరి చెప్పట్లే సన్మానాలుగా సంబరపడిపోయింది ఆ అమ్మాయి.
స్టేజ్ కింద నుంచి నవ్వుతూ చూసాడు ఒక పెద్దాయన.
ఆ అమ్మాయి స్టేట్స్ దిగి ఆ పెద్దాయన పక్కనకి వచ్చి నిలబడి..”ఏలా చేశాను మావయ్య…!” అని అడిగింది కళ్ళు కూడా నవ్వగలవు అన్నంత బాగా కళ్ళతోటే నవ్వుతూ.
“మొదటిసారి కోమలమైన రోజా పువ్వు కూడా ఇంత అందంగా నాట్యం చేయగలదు అన్నంత బాగా చేశావు రోజా.. నిజంగా ఎంత బాగా డాన్స్ చేసావో తెలుసా నువ్వు.” అని అన్నాడు సంబరంగా మేనకోడల్ని చూసుకుంటూ సురేష్.
“తెలుసు మావయ్య మీ కళ్ళల్లో ఆనందమే చెప్పింది నేను ఎంత బాగా నాట్యం చేశానో అని…” అని అంది సంబరంగా రోజా.
“సిగ్గు ఉందంటే ఆడపిల్లవి వినాయకుడు స్టేజ్ మీద ఆ కుప్పిగంతులు ఏంటి…?” అని వెనక నుంచి కోపంగా వచ్చి రోజా తల మీద ఒక్క మొట్టికాయ వేసింది ఒక మధ్య వయసుకురాలు అయినటువంటి మహిళ.
“పద్మ రోజా మీద ఎందుకు చేయి చేసుకుంటున్నావు..!” అని అన్నాడు ఆమె వైపు కోపంగా చూస్తూ సురేష్.
“బాగుందండీ సంబడం.. వయసుకు వచ్చిన పిల్లతో ఇలా స్టేజి మీద కుప్పిగంతులు ఏంటి…!!! ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు..?పెళ్లి చేయాల్సిన పిల్లతో ఇలా బజారు దానిలా డాన్స్ లు చేయించడం ఏంటి..? ఇంకా పైనుంచి నన్నే ప్రశ్నిస్తున్నారు మీరు.” అని అంది పద్మ ఆవేశంగా.
“మతుండే మాట్లాడుతున్నావా.. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా… వినాయకుడి స్టేజ్ మీద చేసింది దేవుడి కోసం మొదటి పాటకి నృత్యం చేయాలి అంటే చేసింది.. దానికే ఇలా మాట్లాడాలా అందరి ముందు.” అని అన్నాడు తమ చుట్టూ గుమ్మిగూడిన జనాలని చూస్తూ సురేష్.
“నాకు మతి ఉండే మాట్లాడుతున్న మీకే మతి చెడినట్టు ఉంది.
దీని అమ్మ కూడా ఇలాగే భోగం దానిలాగా అక్కడక్కడా డాన్సులు వేసి ఎవరితోటో కడుపు చేపించుకొని దీన్ని మన యధాన ఏసి వెళ్ళిపోయింది,ఇప్పుడు మీ చెల్లి లాగానే దీన్ని కూడా స్టేజ్ ల మీద గుప్పిగంతులు వేయిస్తున్నావ్..
ఇది కూడా ఎవడ్నో పట్టుకొని పోతే దీనికి పుట్టిన పిల్లల్ని కూడా తీసుకువచ్చి నా మేఖన ఏయ్యి.. నేను అందరిని పెంచుకుంటూ కూర్చుంటా.” అని సురేష్ ని నానమాటలు అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది పద్మ కోపంగా.
పద్మ మాటలకి అప్పటికే సురేష్ వెనక చేరి ఏడుస్తూ ఉంది రోజా.. తన బాల్యం మొత్తం ఈ మాటలతోటే గడిచింది కదా మరి ఇప్పుడు అందరి ముందు కూడా అవే మాటలు అనేసరికి ఏడుపు వచ్చేసింది తట్టుకోలేక.
భార్య మాటలకి గుండెల్లో గుణపాలు దిగిన సురేష్ మేనకోడలి ముందు బయటపడకుండా మేనకోడల్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు.. ఆ దారి మొత్తం నిశ్శబ్దమే అలుముకుంది.
సురేష్ వాళ్ళు వస్తుంటే అక్కడ గుమ్మి కూడిన జనాలు నవ్వుతూ ఉన్నారు.. వీడి చెల్లెలు లాగానే వీడి కోడలు కూడా అయిపోతుందిలే.. ఎంతైనా మన పెద్దవాళ్ళు అన్నారుగా తల్లికి బోల్లి ఉంటే కూతురికి కనీసం మచ్చ అయినా ఉంటుంది అని… అని చెవులు కోరుకుంటు ఉన్నారు.
పద్మ మాటలు బాధని మిగిలిస్తే జనాలు మాటలు శోకాన్ని రప్పించాయి సురేష్ కి.. ఆ రాత్రి చీకట్లో తన కన్నీళ్ళని రోజాకి కనిపించకుండా చేశాయి.
కానీ..! రోజా మనసులో మాత్రం తుఫానే మోదలైంది.. అమ్మ గురించి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు,అంటే నాన్న ఎవరో ఇక్కడ ఎవరికీ తెలియదా…!! నాకు నాన్న ఉన్నాడా లేడా..? అని ఆలోచిస్తూనే ఉంది రోజా దారి పొడవునా.
ఆ రాత్రికి సురేష్ రోజా ఆకలి మర్చిపోయి ఆకాశంలో కనిపిస్తున్న జాబిల్లిని చూస్తూ బయట మంచం మీద పడుకున్నారు..నేల మీద రోజా అయితే మంచం మీద సురేష్.. లోపల తలుపు గడి పెట్టుకొని పద్మ.
రోజా గురించే ఎప్పుడు గొడవ అయినా పద్మ లోపల నుంచి గడి పెట్టుకుంటుంది సురేష్ ని,రోజని బయటనే ఉంచి.
అది ఎండాకాలమైనా సరే.. వర్షాకాలమైన సరే.. చలికాలం అయినా సరే రోజా మీద కోపం వస్తే సురేష్ రోజా ఇద్దరూ బయటే ఉండాలి..అది వాళ్ళకి గత 19 సంవత్సరాల నుంచి అలవాటే ఈరోజు ఏమి కొత్త కాదు.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages